ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.కెరీర్‌లో వందో టెస్టు ఆడిన అశ్విన్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులెక్కాడు.
అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్‌లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌లో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
టీమిండియా ఘన విజయం..
ఇక ధర్మశాల టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో సైతం 218 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు
►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218
►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం)
►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195
►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు
►ఐదు మ్యాచ్‌ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం
Comments
Please login to add a commentAdd a comment