'సెంచరీ' కొట్టిన అశ్విన్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌ | Ravichandran Ashwin becomes 14th Indian to play 100 Test matches | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'సెంచరీ' కొట్టిన అశ్విన్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌

Published Thu, Mar 7 2024 9:54 AM | Last Updated on Thu, Mar 7 2024 10:06 AM

Ravichandran Ashwin becomes 14th Indian to play 100 Test matches - Sakshi

టీమిండియా స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌​ తన కెరీర్‌లో మరో అరుదైన  ఘనతను సొంతం చేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్ రికార్డులకెక్కాడు.

ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్‌ను అందజేశాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో అశ్విన్‌ సతీమణి ప్రీతి నారాయణన్‌ కూడా పాల్గొన్నారు. అదే విధంగా భారత ఆటగాళ్ల నుంచి అశ్విన్‌ గార్డ్‌ ఆఫ్‌ హనర్‌ కూడా స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవతున్నాయి. 

స్పిన్‌ మాంత్రికుడు..
2011లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. తన పేరును ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా ఆశూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో అయితే అశ్విన్‌ రికార్డు ఘనంగా ఉంది. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్‌ కొనసాగుతున్నాడు.

అశూ ఇప్పటివరకు స్వదేశంలో టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ సిరీస్‌లోనే తన 500వ టెస్టు వికెట్ల మార్కును కూడా అశ్విన్‌ అధిగమించాడు. కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా అ‍శ్విన్‌ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్‌ సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా అశ్విన్‌ ఉన్నాడు. అశ్విన్‌ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 100 మ్యాచ్‌ల్లో 507 వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా తరపున 100పైగా టెస్టులు ఆడిన ఆటగాళ్లు వీరే..

సచిన్ టెండూల్కర్ - 200 టెస్టులు

రాహుల్ ద్రవిడ్ - 163 టెస్టులు

వీవీఎస్ లక్ష్మణ్ - 134 టెస్టులు

అనిల్ కుంబ్లే - 132 టెస్టులు

కపిల్ దేవ్ - 131 టెస్టులు

సునీల్ గవాస్కర్ - 125 టెస్టులు

దిలీప్ వెంగ్‌సర్కార్ - 116 టెస్టులు

సౌరవ్ గంగూలీ - 113 టెస్టులు

విరాట్ కోహ్లి - 113 టెస్టులు

ఇషాంత్ శర్మ - 105 టెస్టులు

హర్భజన్ సింగ్ - 103 టెస్టులు

చెతేశ్వర్ పుజారా -103 టెస్టులు

వీరేంద్ర సెహ్వాగ్ - 103 టెస్టులు

అశ్విన్‌-100 టెస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement