అందుకే ఓవరాక్షన్‌ చేయకూడదు.. అక్కడ ఉన్నది రోహిత్‌! వీడియో వైరల్‌ | Rohit Sharma smashed back to back 6 and 4 against Muslim Shoaib Bashir | Sakshi
Sakshi News home page

IND vs ENG: అందుకే ఓవరాక్షన్‌ చేయకూడదు.. అక్కడ ఉన్నది రోహిత్‌! వీడియో వైరల్‌

Published Fri, Mar 8 2024 12:43 PM | Last Updated on Fri, Mar 8 2024 1:44 PM

Rohit Sharma smashed back to back 6 and 4 against Muslim Shoaib Bashir - Sakshi

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ను భారత బ్యాటర్లు ఓ ఆట ఆడేసుకున్నారు. తొలి రోజు ఆటలో బషీర్‌కు యశస్వీ జైశ్వాల్‌ చుక్కలు చూపించగా.. రెండో రోజు ఆటలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టార్గెట్‌ చేశాడు. అయితే బషీర్‌ను హిట్‌మ్యాన్‌ టార్గెట్‌ చేయడానికి ఓ కారణముంది. తొలి రోజు ఆటలో జైశ్వాల్‌ను ఔట్‌ చేసిన అనంతరం బషీర్‌ ఓవరాక్షన్‌ చేశాడు.

షోయబ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకునే క్రమంలో జైశ్వాల్‌ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్‌గా ఏదో అన్నాడు. అప్పుడు నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రోహిత్‌ శర్మ కాస్త సీరియస్‌గా రియాక్షన్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ఆరంభంలోనే బషీర్‌కు హిట్‌మ్యాన్‌ చుక్కలు చూపించాడు.

32 ఓవర్‌ వేసిన బషీర్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది.. యువ స్పిన్నర్‌ను ఒత్తడిలోకి నెట్టాడు. దెబ్బకు  షీర్‌ తన చేతులను తలపై వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్‌తో పెట్టుకుంటే అలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement