
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ దూరమయ్యారు. టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. "మేము ముందుగా ఫీల్డింగ్ చేయబోతున్నాం. ఇండోర్ హై స్కోరింగ్ గ్రౌండ్.
ఇక ఈ మ్యాచ్‌లో మేము మూడు మార్పులతో ఆడనున్నాం. విరాట్, రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చాం. ఈ మ్యాచ్‌కు అర్ష్‌దీప్ సింగ్ కూడా దూరమయ్యాడు. అర్ష్‌దీప్ కొంచెం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది ఏమి కాదు.
కేవలం ముందుజాగ్రత్తగా మాత్రమే అతడికి విశ్రాంతి ఇచ్చాం. అయ్యర్, ఉమేష్, సిరాజ్‌లు జట్టులోకి వచ్చారు" అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఇదే టీమిండియాకు అఖరి టీ20 మ్యాచ్.
చదవండి: IND vs SA: రోహిత్ శర్మతో ఫోటో దిగిన డీసీపీ.. ఏంటి అరెస్ట్ చేశారా?