రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా(PC: IPL.com)
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ యాజమన్యం తప్పించింది. అతడి స్ధానంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ముంబై ఇండియన్స్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "షేమ్ ఆన్ ముంబై ఇండియన్స్"(#ShameOnMI) అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రేండ్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని గంటలలోపే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో భారీగా తమ ఫాలోవర్లను ముంబై ఫ్రాంచైజీ కోల్పోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విటర్)లో ముంబై అధికారిక పేజిని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 1.5 లక్షల మంది ఫాలోవర్లను ముంబై ఇండియన్స్ కోల్పోయింది.
రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment