ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్‌లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది.
ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు.
"ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది.
అయితే బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది.
మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్‌లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment