
PC:Sports Tiger
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.
ఈడెన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.
11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది.