ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు.
అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment