భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌలర్ల ఆధిపత్యం గురించి రోహిత్ మాట్లాడాడు.
'సఫారీ పిచ్‌లు పేసర్లకు అనూకూలంగా ఉంటాయి. బౌన్స్ ఎక్కువగా ఉండే వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లు తమ ఆధిపత్యం చెలాయిస్తారు. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్‌పై పగుళ్లు(క్రాక్స్) వల్ల బ్యాటర్లకు మరింత కష్టమవుతోంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు మొత్తం పిచ్ ఒకేలా ఉంటుంది. 5 రోజులూ బంతి బౌన్స్ అవుతూనే ఉంటుంది.
మ్యాచ్‌లో ప్రతీ రోజు బౌలర్లను ఎదుర్కొడం బ్యాటర్లకు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అయితే మాకు గతంలో ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రోటీస్ క్వాలిటి బౌలింగ్ ఎటాక్‌పై పై చేయి సాధించడం అంత ఈజీ కాదు. కానీ ఇటువంటి పరిస్ధితుల్లోనే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి విజయం సాధిస్తే చాలా సంతోషంగా ఉంటుంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో, ఎలా ఆడాలో మేము చర్చించుకున్నాం. అదే విధంగా టెస్టుకు సిద్దం కావడానికి మాకు చాలా సమయం లభించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" ప్రీ మ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తొలిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment