దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి ముగించింది. దీంతో సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌ను కేవలం ఐదు సెషన్లలోనే టీమిండియా ముగించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ నిలిచింది.
అయితే సిరీస్ డ్రాగా ముగియడంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహించడం సమయం వృధా అని రవిశాస్త్రి తెలిపాడు. అదనంగా మరో టెస్టును ఆడించి వుంటే సిరీస్ ఫలితం తేలి ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం ఏకీభవిస్తున్నారు.
కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కావడం సిగ్గు చేటు అని ఏబీడీ విమర్శించాడు.
గొప్ప చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా- భారత్ సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే పెట్టడం నిజంగా అవమానకరం అంటూ డివిలియర్స్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన భారత్ జట్టు టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకోగా.. టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment