
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ సైతం తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
చదవండి: #David Miller: మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment