ICC Test Batsman Rankings
-
దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దశాబ్దకాలం తర్వాత చేదు అనుభవం ఎదురైంది. 10 ఏళ్ల తర్వాత విరాట్ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో నుంచి బయటికి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత విరాట్ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ముంబై టెస్ట్‌లో తన ట్విన్ ఫిఫ్టీలకు రివార్డ్ పొందాడు. పంత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. జో రూట్, కేన్ విలియమ్సన్ టాప్-2 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో.. ఉస్మాన్ ఖ్వాజా, సౌద్ షకీల్, మార్నస్ లబూషేన్, కమిందు మెండిస్ తలో రెండు స్థానాలు కోల్పోయి 8 నుంచి 11 స్థానాల్లో ఉన్నారు. లంక ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే, ధనంజయ డిసిల్వ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 14, 15 స్థానాలకు ఎగబాకగా.. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ముంబై టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తర్వాత రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఆసీస్ స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్, టీమిండియా పేసు గుర్రం బుమ్రా టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. నాథన్ లయోన్, ప్రభాత్ జయసూర్య, నౌమన్ అలీ, మ్యాట్ హెన్రీ టాప్-10లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2 ఆల్రౌండర్లుగా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను వెనుక్కి నెట్టి నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రూట్ తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు. ఇక విలియమ్సన్ తన టెస్టు కెరీర్లో నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. కాగా కేన్ చివరగా నాలుగు నెలల కిందట టెస్టుల్లో ఆడాడు. అయితే తన కంటే ముందున్న బ్యాటర్లు పేలవ ప్రదర్శన కారణంగా విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యాషెస్ రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(882) రెండో స్ధానానికి చేరుకున్నాడు. స్మిత్ విలియమ్సన్ కంటే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అయితే యాషెస్ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు జరగనుండడంతో కేన్‌ను స్మిత్ అధిగమించే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్ల్లో టీమిండియా నుంచి ఒకే ఒక్క బ్యాటర్ టాప్-10లో నిలిచాడు. అతడే రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదంతో గాయపడి ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ(729) పాయింట్లతో 12వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(700).. ఒక స్థానం పడిపోయి ప్రస్తుతం 14వ ర్యాంకుకు చేరాడు. -
ఐదో స్థానానికి పడిపోయిన కోహ్లి
దుబాయ్: భారత్‌తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి (883 పాయింట్లు) ఎగబాకాడు. తన వందో టెస్టులో ద్విశతకంతో పాటు జట్టును విజేతగా నిలిపిన రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగు నుంచి ఐదో స్థానానికి (852) పడిపోయాడు. కోహ్లికంటే రూట్ మెరుగైన స్థితిలో నిలవడం 2017 నవంబర్ తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (919), ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (891) తమ తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్నారు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ తరఫున పుజారా (7వ) మాత్రమే ఉండగా, 13వ స్థానంలో ఉన్న రిషభ్ పంత్... బ్యాట్స్‌మన్ జాబితాలో 700 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత రెగ్యులర్ వికెట్ కీపర్‌గా నిలవడం విశేషం. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ (7వ), బుమ్రా (8వ) ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు. ప్యాట్ కమిన్స్ (908 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... భారత్‌తో తొలి టెస్టులో చెలరేగిన జేమ్స్ అండర్సన్ (826) ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ (826) రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. టాప్–10 ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉండగా, స్టోక్స్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్..
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు చెరో స్థానం కోల్పోయి ఐదు, ఏడు ర్యాంకులకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో అర్ధ శతకం సాధించినప్పటికీ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లాండ్ సారథి జో రూట్(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుత్నున్నారు. మరో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, ఆసీస్ ఓపెనర్ వార్నర్‌లు తలో స్థానాన్ని మెరుగుపరచుకొని ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేయడంతో తొలిసారిగా 700 రేటింగ్ పాయింట్లు సాధించి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా, మరో ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బూమ్రాలు చెరో స్థానాన్ని మెరుగుపరచుకొని ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
ఫిట్‌నెస్‌పై దృష్టి: పుజారా
ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రదర్శన పట్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానని... దీనివల్ల ప్రదర్శనతో పాటు ర్యాంకింగ్ కూడా మెరుగవుతోందని చెప్పాడు. ‘2011లో మోకాలుకు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నా. ఆ తర్వాత ఫిట్నెస్ కాపాడుకునేందుకు కఠోరంగా శ్రమిస్తూ వచ్చాను. దీంతో గత ఏడాదిన్నర నుంచి నా ప్రదర్శన కూడా బాగా మెరుగుపడింది. మొదట్లో నేను జిమ్‌లో బద్ధకించేవాడిని. కానీ ఇప్పుడు బాగా మారాను’ అని అన్నాడు. అయితే సఫారీ గడ్డపై భారత వైఫల్యంపై మాట్లాడేందుకు నిరాకరించాడు. కెరీర్లో ఉత్తమ ర్యాంకుకు... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పుజారా కెరీర్లో ఉత్తమంగా ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో అతను రెండు స్థానాల్ని మెరుగుపర్చుకోగా... కోహ్లి ఓ స్థానం కోల్పోయి 11వ ర్యాంకుకు దిగజారాడు. టెస్టు బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడు, ప్రజ్ఞాన్ ఓజా తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.