న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను వెనుక్కి నెట్టి నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రూట్ తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు.
ఇక విలియమ్సన్ తన టెస్టు కెరీర్‌లో నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. కాగా కేన్ చివరగా నాలుగు నెలల కిందట టెస్టుల్లో ఆడాడు. అయితే తన కంటే ముందున్న బ్యాటర్లు పేలవ ప్రదర్శన కారణంగా విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యాషెస్ రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(882) రెండో స్ధానానికి చేరుకున్నాడు.
స్మిత్ విలియమ్సన్ కంటే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అయితే యాషెస్ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు జరగనుండడంతో కేన్‌ను స్మిత్ అధిగమించే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‍ల్లో టీమిండియా నుంచి ఒకే ఒక్క బ్యాటర్ టాప్-10లో నిలిచాడు.
అతడే రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదంతో గాయపడి ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ(729) పాయింట్లతో 12వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(700).. ఒక స్థానం పడిపోయి ప్రస్తుతం 14వ ర్యాంకుకు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment