దుబాయ్: భారత్‌తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి (883 పాయింట్లు) ఎగబాకాడు. తన వందో టెస్టులో ద్విశతకంతో పాటు జట్టును విజేతగా నిలిపిన రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగు నుంచి ఐదో స్థానానికి (852) పడిపోయాడు. కోహ్లికంటే రూట్ మెరుగైన స్థితిలో నిలవడం 2017 నవంబర్ తర్వాత ఇదే తొలిసారి.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (919), ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (891) తమ తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్నారు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ తరఫున పుజారా (7వ) మాత్రమే ఉండగా, 13వ స్థానంలో ఉన్న రిషభ్ పంత్... బ్యాట్స్‌మన్ జాబితాలో 700 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత రెగ్యులర్ వికెట్ కీపర్‌గా నిలవడం విశేషం. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ (7వ), బుమ్రా (8వ) ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు. ప్యాట్ కమిన్స్ (908 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... భారత్‌తో తొలి టెస్టులో చెలరేగిన జేమ్స్ అండర్సన్ (826) ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ (826) రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. టాప్–10 ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉండగా, స్టోక్స్ నంబర్‌వన్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment