fifth place
-
హంపికి ఐదో స్థానం
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది.హంపి, దివ్య 4.5 పాయింట్ల చొప్పున సంపాదించారు. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 36 ఎత్తుల్లో.. ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను దివ్య 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 7 పాయింట్లతో అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. టాన్ జోంగి (చైనా; 6.5 పాయింట్లు) రెండో స్థానంలో, బీబీసారా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
టాప్ అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్.. జీక్యూఐఐలో అయిదో ర్యాంకు
న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్‌లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్గా వ్యవహరిస్తారు. నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్‌లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్‌లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. -
టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2022: భారతీయ వంటలకు జై
న్యూఢిల్లీ: అత్యుత్తమ వంట విధానాలున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇటలీ, గ్రీస్, స్పెయిన్ తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. వంటలో వాడే పదార్థాలు, దినుసులు, పానీయాలపై ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ర్యాంకులు దక్కాయి. 2022కు గాను టేస్ట్ అట్లాస్ చేపట్టిన ఈ ఓటింగ్‌లో భారత్‌కు 4.54 పాయింట్లు వచ్చాయి. జపనీస్ వంటకాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2022 ఫలితాల ప్రకారం..400కు పైగా భారత వంటదినుసుల్లో గరం మసాలా, ఘీ, మలాయ్, బట్టర్ గార్లిక్ నాన్, కీమా తదితరాలకు అగ్రస్థానం దక్కింది. దేశంలో మంచి ఆదరణ ఉన్న 450 హోటళ్లలో ముంబైలోని ప్రముఖ శ్రీ థాకర్ భోజనాలయ్, బెంగళూరులోని కారవల్లి, ఢిల్లీలోని బుఖారా, దమ్ ఫఖ్త్, గురుగ్రామ్‌లోని కొమోరిన్ రెస్టారెంట్లకు అత్యధిక ఓట్లు పడ్డాయి. అయితే, ప్రపంచదేశాల్లో ఆదరణ ఉన్న చైనా వంటకాలకు 11వ స్థానం, పేరున్న థాయ్ వంటకాలకు 30వ స్థానం దక్కడంపై నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. కాగా, ఈ జాబితాలో అమెరికా 8వ, ఫ్రాన్సు 9వ ర్యాంకుల్లో నిలవడం గమనార్హం. -
తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్ను దాటేసిన భారత్.. మరింత బలంగా..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు. వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో బ్రిటన్ బ్రిటన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్ జాన్సన్ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. -
ఆరోగ్య రంగం.. హైదరాబాద్‌కు 5వ స్థానం
న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్‌లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది. ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్‌ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ ఎన్సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది. బెంగళూరులో భిన్నం బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి. ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగు భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్‌కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది. -
ఐదో స్థానానికి పడిపోయిన కోహ్లి
దుబాయ్: భారత్‌తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి (883 పాయింట్లు) ఎగబాకాడు. తన వందో టెస్టులో ద్విశతకంతో పాటు జట్టును విజేతగా నిలిపిన రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగు నుంచి ఐదో స్థానానికి (852) పడిపోయాడు. కోహ్లికంటే రూట్ మెరుగైన స్థితిలో నిలవడం 2017 నవంబర్ తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (919), ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (891) తమ తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్నారు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ తరఫున పుజారా (7వ) మాత్రమే ఉండగా, 13వ స్థానంలో ఉన్న రిషభ్ పంత్... బ్యాట్స్‌మన్ జాబితాలో 700 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత రెగ్యులర్ వికెట్ కీపర్‌గా నిలవడం విశేషం. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ (7వ), బుమ్రా (8వ) ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు. ప్యాట్ కమిన్స్ (908 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... భారత్‌తో తొలి టెస్టులో చెలరేగిన జేమ్స్ అండర్సన్ (826) ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ (826) రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. టాప్–10 ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉండగా, స్టోక్స్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
హరికృష్ణకు ఐదో స్థానం
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో చైనాలో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. హరికృష్ణ 4.5 పాయింట్లతో యు యాంగి (చైనా)తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా యు యాంగికి నాలుగో స్థానం, హరికృష్ణకు ఐదో స్థానం లభించాయి. చివరిదైన పదో రౌండ్లో హరికృష్ణ 53 ఎత్తుల్లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 6.5 పాయింట్లతో లిరెన్ డింగ్ విజేతగా నిలువగా... అనీశ్ గిరి (నెదర్లాండ్స్–5.5) రెండో స్థానంలో, స్విద్లెర్ (రష్యా–5.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
హైదరా‘బాద్షా’
ప్రపంచ టాప్ 30 డైనమిక్ సిటీల్లో ఐదో స్థానంలో మన మహానగరం తొలి స్థానంలో బెంగళూరు; జాబితాలో పుణె, చెన్నై, ఢిల్లీ, ముంబై 134 మహానగరాల్లో నుంచి 30 సిటీలను ఎంపిక చేసిన జేఎల్ఎల్ ‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్’ పేరుతో విడుదల షికాగో మన భాగ్యనగరం కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి దిశగా శరవేగంగా మార్పు చెందుతున్న మహానగరాల టాప్ టెన్ జాబితాలో హైదరాబాద్ చోటు సంపాదించింది. ప్రపంచ దేశాల్లోని మహా నగరాలను పక్కకుతోసి.. అత్యంత ‘డైనమిక్ సిటీ’ల లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్ఎల్ ఏటా విడుదల చేసే గ్లోబల్ ‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్(సీఎంఐ)’లో ఈ సంవత్సరం సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఐదో స్థానం సాధించింది. హోచి మిన్ సిటీ(వియత్నాం), సిలికాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై(చైనా) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలోని టాప్ 30 సిటీల్లో భారత్‌కు చెందిన ఆరు నగరాలుండటం విశేషం. పుణెకి 13వ స్థానం, చెన్నైకి 18వ స్థానం, ఢిల్లీకి 23వ స్థానం, ముంబైకి 25వ స్థానం లభించాయి. లండన్(6), న్యూయార్క్(14), పారిస్(17), లాస్ ఏంజెలిస్(27), దుబాయ్(11) తదితర మహానగరాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. తాజా జాబితాలో సగానికి పైగా ఆసియా పసిఫిక్ దేశాల్లోని నగరాలున్నాయి. ఈ లిస్ట్‌లో చైనా కన్నా భారత్‌కు చెందిన నగరాలు ఎక్కువగా ఉండటం విశేషం. అలాగే, తొలిసారి తొలిస్థానం(బెంగళూరు)కూడా పొందింది. గత రెండేళ్లుగా తొలి స్థానంలో నిలిచిన లండన్ ఈ సారి ఆరో స్థానానికి దిగజారింది. తాజా జాబితాలో అమెరికాకు చెందిన ఆస్టిన్, బోస్టన్, సియాటల్, సాన్‌ఫ్రాన్సిస్కో.. ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ, మెల్బోర్న్.. యూరప్ నుంచి డబ్లిన్, స్టాక్‌హోం.. తదితర నగరాలున్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యాలోని నైరోబీ పదో స్థానం సాధించింది. ప్రముఖ స్తిరాస్థి సేవలు, నిర్వహణ, పెట్టుబడుల సంస్థ జేఎల్ఎల్(జోన్స్ లాంగ్ లాసెల్లే) గత నాలుగేళ్లుగా ప్రతీ సంవత్సరం అత్యంత వేగంగా మార్పు చెందుతున్న 30 ప్రపంచ నగరాల జాబితాను ‘సిటీ మోమెంటమ్ ఇండెక్స్’పేరుతో రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 134 నగరాలను ఎంపిక చేసుకుని, వాటిలో చోటు చేసుకుంటున్న సానుకూల మార్పులను 42 అంశాల ఆధారంగా నిర్ధారించి జేఎల్ఎల్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఆ 42 అంశాల్లో జీడీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలుండటం, రియల్ ఎస్టేట్ వృద్ధి.. కార్యకలాపాలు, సాంకేతిక సామర్ధ్యం, మౌలిక వసతులు, చవకగా సేవలు, కాంపిటీటివ్నెన్, అద్దెలు, విద్య, కన్సూమర్ మార్కెట్, వ్యాపార సన్నద్ధత, సాంకేతిక అనుసంధానత, పర్యావరణం, సృజనాత్మకత, ఉద్యోగిత, లేబర్ మార్కెట్, జీవన నాణ్యత.. మొదలైనవి ఉంటాయి. -
జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఐదో స్థానాన్ని సంపాదించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ‘మాస్టర్స్’ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హరికృష్ణకు ఐదో స్థానం దక్కింది. భారత్‌కే చెందిన సేతురామన్ 4వ, అభిజిత్ గుప్తా 10వ, విదిత్ 18వ, లలిత్‌బాబు 30వ, సందీపన్ చందా 39వ, విశ్వనాథన్ ఆనంద్ 41వ స్థానాల్లో నిలిచారు. -
ఆకాశమే హద్దు..
అంతరిక్షంపై ఆధిపత్యం చలాయిస్తున్న దేశాల్లో మనది ఐదోస్థానం. సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు విదేశీ ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నాం. అత్యంత కీలకమైన సమాచార, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి.. మొత్తంగా ఆర్థికాభివృద్ధికి ఇది తోడ్పడుతోంది. ఇక ప్రపంచంలోనే కంప్యూటర్ల వినియోగంలో భారతదేశానిదే ఐదోస్థానం.