
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది.

హంపి, దివ్య 4.5 పాయింట్ల చొప్పున సంపాదించారు. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 36 ఎత్తుల్లో.. ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను దివ్య 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 7 పాయింట్లతో అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. టాన్ జోంగి (చైనా; 6.5 పాయింట్లు) రెండో స్థానంలో, బీబీసారా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment