secured
-
హంపికి ఐదో స్థానం
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది.హంపి, దివ్య 4.5 పాయింట్ల చొప్పున సంపాదించారు. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 36 ఎత్తుల్లో.. ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను దివ్య 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 7 పాయింట్లతో అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. టాన్ జోంగి (చైనా; 6.5 పాయింట్లు) రెండో స్థానంలో, బీబీసారా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
అదనపు రుణానికి రూట్.. టాపప్ హోమ్‌లోన్!
సొంతిల్లు.. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఒకటి. రుణంపై సొంతిల్లు సమకూర్చుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలా గృహ రుణం తీసుకున్న తర్వాతి కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం అదనపు రుణం తీసుకునే అవకాశం ఉంటే..? గృహ నవీకరణ లేదా విద్యా సంబంధిత ఫీజుల చెల్లింపు లేదా అనారోగ్యం.. అవసరం ఏదైనా గృహ రుణంపై టాపప్ రుణం సులభంగా లభిస్తుంది. కాకపోతే ఈ విధంగా తీసుకుంటున్న రుణం ఏ అవసరాలకు వినియోగిస్తున్నారనేది ఇంత వరకు బ్యాంక్‌లు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలే ఆర్బీఐ ఈ విషయమై బ్యాంక్‌లను హెచ్చరించింది. కనుక టాపప్ హోమ్‌లోన్‌ను ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనేది రుణ గ్రహీతలు సైతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. చౌకగా లభించే ఈ రుణాన్ని ముఖ్యమైన అవసరాల్లో వినియోగించుకోవడం ద్వారా తగినంత ప్రయోజనం పొందొచ్చు. టాపప్ అంటే... అప్పటికే తీసుకున్న గృహ రుణంపై అదనపు రుణాన్ని తీసుకోవడమే టాపప్ హోమ్‌లోన్ అవుతుంది. దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇంటి విలువ ఎంత? ఇంటికి తీసుకున్న రుణానికి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నారు? అప్పటి వరకు ఎంత మేర చెల్లించారు? తదితర అంశాల ఆధారంగా ఈ రుణానికి అర్హత లభిస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కిందకే వస్తుంది. కనుక బ్యాంక్‌లకు వీటిపై రిస్క్ తక్కువే. అయితే రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ రుణంపై బ్యాంకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.ఎలా పనిచేస్తాయి? ‘‘గృహ రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ.. 18–24 నెలలు గడిచిన తర్వాత టాపప్ లోన్ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది’’ అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. వాస్తవంగా జారీ అయిన గృహ రుణం నుంచి అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి పోను మిగిలిన మొత్తం టాపప్‌గా లభిస్తుంది. అంటే అప్పటి వరకు తీర్చిన రుణం మొత్తమే తిరిగి రుణంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్ హోమ్‌లోన్‌కు అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి. రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు టాపప్ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ హోమ్ లోన్స్ హెడ్ రతన్ చౌదరి తెలిపారు. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందొచ్చని చౌదరి సూచించారు. సులభతరం టాపప్ హోమ్‌లోన్‌ను చాలా సంస్థలు డిజిటల్‌గా మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా రుణం చేతికి అందుతుంది. అప్పటికే గృహ రుణం కోసం అన్ని పత్రాలు సమరి్పంచి ఉంటారు కనుక.. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం ఏర్పడదు. అన్ని పత్రాలు దగ్గర ఉండడంతో బ్యాంక్‌లు వేగంగా నిర్ణయం తీసుకుంటాయి. రుణ గ్రహీత తాజా క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పకుండా పరిశీలిస్తాయి. చౌక ఆప్షన్ అన్ని రుణాల్లోకి గృహ రుణం చౌక వడ్డీ రేటుకే లభిస్తుంది. గృహ రుణంపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటే.. టాపప్కి సైతం అమలవుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్‌కార్డుపై రుణం, బంగారంపై రుణం కంటే టాపప్ హోమ్‌లోన్ చౌక అని పైసాబజార్ రతన్ చౌదరి తెలిపారు. ఒకవేళ అప్పటికే క్రెడిట్ కార్డ్‌పై రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని, అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంటే.. అటువంటి వారు సైతం టాపప్ హోమ్‌లోన్ తీసుకుని వాటిని తీర్చివేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్, క్రెడిట్ కార్డు రుణాలు అన్ సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకే వాటిపై వడ్డీ రేటు ఎక్కువ. గృహ రుణం సెక్యూర్డ్ (ఇల్లు తనఖాపై) కనుక వడ్డీ రేటు తక్కువ. అవసరం మేరకే.. సులభంగా, చౌకగా వస్తుందని చెప్పి టాపప్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపించే ముందు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన చేయడం ఎంతో అవసరం. టాపప్ రుణాలతో వచ్చే పెద్ద సమస్య నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగిపోవడమేనని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (ఆర్ఐఏ), సహజ్ మనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ తెలిపారు. టాపప్ హోమ్ రుణాలు అనుత్పాదక అవసరాలకు వినియోగం అవుతుండడంపై ఆర్బీఐ ఇటీవలే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరింది. ముఖ్యంగా ఈ తరహా రుణాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. లోన్–టు–వేల్యూ రేషియో (ప్రాపర్టీ విలువపై జారీ చేసే రుణం మొత్తం/ఎల్టీవీ), రిస్క్‌లు, రుణ నిధుల వినియోగంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఈ తరహా రుణాలు స్పెక్యులేటివ్ అవసరాలకు తీసుకోవడం లేదని బ్యాంక్/ఎన్బీఎఫ్సీని నమ్మించాల్సి రావచ్చు. ఇలా తీసుకున్న నిధులను ట్రేడింగ్‌లో నష్టపోయి, తిరిగి చెల్లింపులు చేయలేకపోతే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంక్ ఇంటిని జప్తు చేస్తుందన్నది మర్చిపోవద్దు. ‘‘టాపప్ హోమ్ లోన్స్ అన్నవి సాధారణంగా గృహ నవీకరణ కోసమే. పిల్లల విద్య లేదా వైద్య వ్యయాలు వంటి ఇతర అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రుణం తీసుకునే సమయంలోనే దీనిపై బ్యాంక్‌లు నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అయితే ఈ రుణాన్ని స్పెక్యులేటివ్ అవసరాలకు వినియోగించరాదని సూచించారు. ఇదే విషయం రుణ ఒప్పంద నిబంధనల్లోనూ స్పష్టంగా ఉంటుంది.రుణం రాకపోతే..? చాలా సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో (గృహ రుణం బదిలీ) టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ చౌదరి తెలిపారు. ఇంటి రుణం ఇచి్చన సంస్థ దగ్గర టాపప్ హోమ్ లోన్ పొందలేకపోతే.. లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్టు అయితే.. అప్పుడు మిగిలి ఉన్న గృహ రుణాన్ని (బ్యాలెన్స్) మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ద్వారా టాపప్ హోమ్‌లోన్‌ను పొందొచ్చని చౌదరి సూచించారు. ఇవి గమనించాలి.. → విహార యాత్ర, ఖరీదైన వస్తు కొనుగోళ్ల కోసం టాపప్ హోమ్‌లోన్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. తమ ఆస్తి విలువ పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చు. → టాపప్ హోమ్ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధికి (రెండు నుంచి నాలుగేళ్లు) పరిమితం చేసుకోవాలి. దీర్ఘకాలం ఎంపిక చేసుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. → గృహ రుణం, దానిపై టాపప్‌తో కలిపి అసలు ఇంటి విలువలో 75 శాతం మించకుండా చూసుకోవడం సౌకర్యం. → ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను చాలా సంస్థలు వసూలు చేస్తున్నాయి. → బ్యాంక్‌తో సంప్రదింపులు చేయడం ద్వారా వీలైతే వడ్డీ రేటులో రాయితీ పొందొచ్చు. → టాపప్ హోమ్‌లోన్‌ను ఖరీదైన ఇతర రుణాల చెల్లింపులకు వినియోగించుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
ఎలన్ మస్క్ పాఠశాలలో సీటు సాధించిన వరంగల్ విద్యార్థి..!
6th Class Student From Warangal Secured Seat In Elon Musk School: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటాడు వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ...కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ లాంగ్వేజ్‌లో పట్టు సాధించి ఏకంగా ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్లో అనిక్ పాల్ అడ్మిషన్ సాధించాడు. అనిక్ పాల్ తండ్రి విజయ్‌పాల్ వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి తెలుసుకున్న విజయ్‌పాల్... తన కుమారుడిని ఎలాగైనా అందులో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. అందుకు సరిపడా శిక్షణను అనిక్ కు అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనిక్ పాల్ కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. మూడు రౌండ్లను అలవోకగా..! ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిన్ స్కూల్ ప్రవేశ పరీక్షలోని మూడు రౌండ్లను అనిక్ పాల్ అలవోకగా సాధించాడు. ప్రవేశ పరీక్షలో భాగంగా మొదటి రౌండ్లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌కు సంబంధించిన పలు లాజికల్ ప్రశ్నలను అనిక్ పాల్ ఇట్టే పరిష్కరించాడు. రెండో రౌండ్లో సింథసిస్ స్కూల్ బోర్డు ఇచ్చిన ఓ ప్రశ్నకు వివరణాత్మక సమాధానంతో కూడిన వీడియోను రూపొందించి పంపగా అందులో సెలక్ట్ అవ్వగా...మూడో రౌండ్లో పర్సనల్ ఇంటర్వ్యూ లోనూ సత్తా చాటాడు. దీంతో అనిక్ పాల్‌కు సింథసిస్ స్కూల్లో సీటు ఖరారైంది. ప్రస్తుతం అనిక్ పాల్ ఆన్లైన్ క్లాసులను వింటున్నట్లు తెలుస్తోంది. సింథసిస్ స్కూల్ ప్రత్యేకతలివే ఎలన్ మస్క్, జోష్ డాన్‌తో కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్‌లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు. చదవండి: స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! -
బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగానే ఉంది: ఆర్బీఐ
ముంబై: దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల పట్ల వదంతులు చలామణి అవుతున్నాయి. ఇవి డిపాజిటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా, స్థిరంగా ఉందని, ఈ వదంతులను విని భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజలకు ఆర్బీఐ హామీ ఇస్తోంది’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు మంగళవారం స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ స్టాక్స్ సైతం తీవ్ర నష్టాల పాలయ్యాయి. -
ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ భారీ డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రోకు చెందిన ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ నుంచి మల్టీ మిలియన్ డాలర్ విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎల్ అండ్ టి టెక్నాలజీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక పొత్తులో ఉత్పత్తుల బలోపేతం, ఉన్నతమైన నాణ్యతా ఉత్పత్తులను వినియోగదారులకు అందించనున్నట్టు బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో బుధవారం నాటి మార్కెట్ లో 0.79 శాతం ఎగిసింది. అయితే, ఈ ఒప్పందం మొత్తం విలువ ఇంకా బహిర్గతం చేయలేదు. బహుళ సంవత్సరాల భాగస్వామ్య అవార్డు గెల్చుకున్న తమ సంస్థ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని ఎల్ అండ్ టి టెక్ సీఈఓ, ఎండీ కేశవ్ పాండా చెప్పారు. ప్రపంచ వినియోగదారులకు కటిండ్ ఎడ్జ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. కాగా ఈ సెప్టెంబర్ ఐపీవోలో రూ. 900 కోట్లను సాధించిన సంగతి తెలిసిందే.