
ముంబై: ప్రస్తుత ఎంఎస్‌ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్‌సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది.
అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment