
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇండియా తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌తో జత కట్టింది. కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీనితో శాంసంగ్ ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లపై ఏడాది పొడవునా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్ అని ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి.
సిగ్నేచర్ వేరియంట్ కార్డుతో ఏటా రూ. 10,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 2,500), ఇన్ఫినిటీ వేరియంట్ కార్డుతో రూ. 20,000 వరకు (నెలవారీ పరిమితి రూ. 5,000) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కనీస లావాదేవీ విలువ అంటూ ఏమీ ఉండదు. సిగ్నేచర్ కార్డు వార్షిక ఫీజు రూ. 500, ఇన్ఫినిటీ కార్డు ఫీజు రూ. 5000గా (పన్నులు అదనం) ఉంటుంది.
వినియోగదారులకు మరింత మెరుగైన డీల్స్ అందించేందుకు బిగ్‌బాస్కెట్, మింత్రా, టాటా 1ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో మొదలైన సంస్థలతో చేతులు శాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపాయి.
చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!