దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ వచ్చే డిసెంబర్ నెల నుండి తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో అనేక మార్పులు చేయబోతోంది. వీటిలో కొత్త రిడెంప్షన్ ఫీజులు, సవరించిన వడ్డీ రేట్లు, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 20 నుండి అమలుకానున్నాయి.
ఎడ్జ్ రివార్డ్‌లపై రిడెంప్షన్ ఫీజు
యాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ రివార్డ్‌లు లేదా మైల్స్‌ను వినియోగించడం కోసం రిడెంప్షన్ ఫీజులను ప్రవేశపెడుతోంది. క్యాష్ రిడెంప్షన్‌కు రూ. 99 (18 శాతం జీఎస్టీ అదనం), మైలేజ్ ప్రోగ్రామ్‌కు పాయింట్లను బదిలీ చేయడానికి రూ. 199 (18 శాతం జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. డిసెంబర్ 20 లోపు పాయింట్‌లను రీడీమ్ లేదా బదిలీ చేసుకుంటే ఈ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.
రిడెంప్షన్ ఫీజు వర్తించే కార్డులు ఇవే..
» యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్
» శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్
» శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
» యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్
» యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్
సవరించిన ఇతర ఛార్జీలు
నెలవారీ వడ్డీ రేటు 3.75 శాతానికి పెరుగుతుంది. ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్‌పై చెల్లింపు మొత్తంలో 2 శాతం రుసుము ఉంటుంది. కనిష్ట పరిమితి రూ. 500 కాగా గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. దీంతో శాఖలలో నగదు చెల్లింపుపైనా రూ.175 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ట బకాయి మొత్తాన్ని చెల్లించడంతో వరుసగా రెండు సార్లు విఫలమైతే రూ. 100 అదనపు రుసుము విధిస్తారు.
ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!
ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్‌ను డీసీసీని 1.5 శాతానికి సవరించారు. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం, క్రెడ్, గూగుల్ పే వంటి ఏదైనా థర్డ్-పార్టీ యాప్ ద్వారా విద్యా రుసుము చెల్లిస్తే 1 శాతం రుసుము ఉంటుంది. అయితే, విద్యా సంస్థలకు నేరుగా చెల్లించే చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది.
రూ. 10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్‌పై 1% రుసుము చెల్లించాలి. ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 50,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులు, రూ. 25,000 లకు మించిన యుటిలిటీ, రూ. 10,000 కంటే ఎక్కువ గేమింగ్ లావాదేవీలు ఉంటే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment