ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. యెస్ బ్యాంక్, ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో ఫిన్ టెక్ సంస్థ రియో.. యెస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది.
యూపీఐతో మిళితం చేసిన ఈ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వ్యాపార స్థానాల నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డ్ రియో యాప్‌లోని నో యువర్ ఆఫర్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, వ్యక్తిగతీకరించిన రివార్డ్‌లు, ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది.
ఈ కార్డు కావాలంటే..
చిన్న నగరాల వినియోగదారులే ఈ కార్డుపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దాని బీటా లాంచ్ సమయంలో 60 శాతం అప్లికేషన్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వచ్చాయి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం కలిగి ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారు కనీసం రూ. 25,000 నికర నెలవారీ జీతం లేదా రూ. 5 లక్షల వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఉన్న యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ కొత్త కార్దుకు అర్హులు కాదు.
ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
జీవితకాలం ఉచితం
ఈ కార్డ్ జీవితకాలం ఉచితం. జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లావాదేవీలకు ఛార్జీ ఉంటుంది. ఒక నెలలో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడ్ లేదా ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపుపై 1% రుసుము, జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రూ. 10,000లకు మించి ఇంధన లావాదేవీలకు ఒక్కో దానిపై 1% రుసుముతో పాటు జీఎస్టీ విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment