పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్‌మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్‌నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.
విదేశీ ఆస్తి అంటే ఏమిటి?
ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment