Processing fee
-
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
యూరప్ ట్రిప్ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్11)షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది. గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్ కమిషన్ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు. -
లోన్ కావాలా? అయితే మీకో శుభవార్త
ముంబై: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. రిటైల్ కస్టమర్లకు వివిధ రుణాలపై పండుగ ఆఫర్ణు సోమవారంప్రకటించింది. వినియోగదారులకు అందించే వివిధ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఇటీవల పొదుపు ఖాతాలవడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు తాజాగా వివిధ రుణాలపై 100శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజు ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొన్న బ్యాంకు కారు, వ్యక్తిగత, బంగారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ వివరాలు 1. డిసెంబరు 31, 2017 వరకు కారు రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు 2. అక్టోబర్ 31, 2017 వరకు వ్యక్తిగత బంగారు రుణాలపై పై 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు 3. సెప్టెంబరు 30, 2017 వరకు వినియోగదారులకు ఎక్స్ ప్రెస్ క్రెడిట్‌పై ( వ్యక్తిగత రుణం) ప్రాసెసింగ్ ఫీజు 50శాతం మినహాయింపు పొందవచ్చు కాగా ఇప్పటివరకు బ్యాంక్ రుణంమొత్తంపై 0.5శాతం, కారు లోన్లపై 2శాతం, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప్రాసెసింగ్ ఫీజుగా 0.5శాతం ద్విచక్ర వాహనాల లోన్లపై సూపర్ బైక్ పై 1.5శాతం, గోల్డ్ లోన్లపై 0.51శాతం ఛార్జ్ చేస్తోంది. దీనికి అదనంగా జీఎస్టీ ని కూడా వసూలు చేస్తోంది. -
ఖాతాదారుడికి ఇండస్ ఇండ్ బ్యాంక్ వేధింపు!
సాక్షి ప్రతినిధి, కడప :తక్కువ వడ్డీకే రుణం ఇస్తామని చెప్పి.. రుణం ఇవ్వకుండా అకౌంట్లోంచి ప్రాసెస్ ఫీజు వసూలు చేసుకుని ఓ ఖాతాదారునికి నగరంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ అధికారులు చుక్కలు చూపిస్తున్న వైనమిది. బాధితుని కథనం మేరకు వివరాలు.. పరుశురాం అండ్ సన్స్ పేరిట మైన్ ఓనర్ వి పరుశురాముడుకు ఇండస్ ఇండ్ బ్యాంకులో 2006 నుంచి అకౌంట్ ఉంది. అకౌంట్ నెం. 200007471951 ద్వారా బ్యాంకు నిబంధనల మేరకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బ్యాంకు సిబ్బంది మీకు రూ.కోటి రుణం ఇస్తామని ఖాతాదారుడిని కలిశారు. ఇప్పట్లో తనకు రుణం అవసరం లేదని ఆయన చెప్పాడు. అయినా వడ్డీ రేటు తక్కువ అంటూ పలు రకాలుగా వివరించి ఒప్పించారు. ఆ మేరకు డాక్యుమెంట్లు ఇవ్వడంతో రూ.70 లక్షలు రుణం మంజూరు చేయనున్నట్లు బ్యాంకు సిబ్బంది వివరించారు. ఆ మేరకు పరస్పరం అంగీకారంతో వ్యవహారం నడిచింది. అయితే పరుశురాముడికి రుణం అందక మునుపే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.70 వేలు, రూ.8,652 సర్వీసు ట్యాక్స్ కింద అకౌంట్ నుంచి డ్రా చేశారు. 2014 జనవరి 1న ఇండస్ ఇండ్ బ్యాంకు డబ్బులు డ్రా చేసింది. బ్యాంకు అకౌంట్లో డబ్బులు తేడా రావడంతో ఖాతాదారుడు బ్యాంకు స్టేట్మెంట్ కోరారు. ఆ మేరకు రుణం ప్రాసెసింగ్ ఫీజు రూపేనా బ్యాంకు డ్రా చేసినట్లు రూఢీ అయ్యింది.రుణం ఇవ్వకుండానే ప్రాసెస్ ఫీజు ఎలా వసూలు చేస్తారంటూ ఖాతాదారుడు వాపోయారు. అనేక పర్యాయాలు బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్లకు రాత పూర్వకంగా విన్నవించాడు. న్యాయవాదిని ఆశ్రయించడంతో.... 2014 జూలై నుంచి బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేకపోవడంతో పరుశురాముడు న్యాయవాదిని ఆశ్రయించి బ్యాంకుకు లీగల్ నోటీసు జారీ చేశారు. అప్పటి వరకూ చూస్తాం, చేస్తాం అన్న బ్యాంకు అధికారులు.. విషయం లీగల్ వింగ్‌లోకి వెళ్లింది, మీరే తేల్చుకోండని చేతులు ఎత్తేశారు. రుణం తీసుకోండని, మీరే చెప్పారు, సరే అని ఒప్పుకుంటే రుణం ఇవ్వకుండానే ప్రాస్సెస్ ఫీజు రూపేనా రూ.78,652 డ్రా చేసుకున్నారు, అడిగితే చలనం లేదు, లీగల్ నోటీసు ఇస్తే మాకు సంబంధం లేదంటారా అని ఖాతాదారుడు వాపోయాడు. వెనక్కు ఇచ్చే అధికారం లేకనే.. ‘ఖాతాదారుడు పరుశురాముడు అకౌంట్ నుంచి రూ.78,652 డ్రా చేసిన మాట వాస్తవమే. వాస్తవానికి రూ.70 లక్షలు రుణం మంజూరైంది, బ్యాంకులో తాజాగా వచ్చిన నిబంధనల మేరకు ఖాతాదారుడికి అందలేదు. ఇదే విషయాన్ని బ్యాంకు తరుఫున పలుమార్లు హెడ్ ఆఫీసు దృష్టికి తీసుకెళ్లాం. హైలెవెల్లో ఆశించిన స్పందన లేదు. డబ్బులు వెనక్కు ఇచ్చే అధికారం మాకు లేదు. ఇప్పుడు ఖాతాదారుడు లీగల్‌గా వెళ్లడంతో ఆ అంశం మా చేతుల్లో లేదు. లీగల్‌గా పోరాటం చేయాల్సిందే’నని ఇండస్ ఇండ్ బ్యాంకు అధికారి రెహ్మన్ సాక్షి ప్రతినిధికి వివరించారు.