న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రోకు చెందిన ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ నుంచి మల్టీ మిలియన్ డాలర్ విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎల్ అండ్ టి టెక్నాలజీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక పొత్తులో ఉత్పత్తుల బలోపేతం, ఉన్నతమైన నాణ్యతా ఉత్పత్తులను వినియోగదారులకు అందించనున్నట్టు బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో బుధవారం నాటి మార్కెట్ లో 0.79 శాతం ఎగిసింది. అయితే, ఈ ఒప్పందం మొత్తం విలువ ఇంకా బహిర్గతం చేయలేదు.
బహుళ సంవత్సరాల భాగస్వామ్య అవార్డు గెల్చుకున్న తమ సంస్థ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని ఎల్ అండ్ టి టెక్ సీఈఓ, ఎండీ కేశవ్ పాండా చెప్పారు. ప్రపంచ వినియోగదారులకు కటిండ్ ఎడ్జ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. కాగా ఈ సెప్టెంబర్ ఐపీవోలో రూ. 900 కోట్లను సాధించిన సంగతి తెలిసిందే.
ఎల్అండ్టి టెక్నాలజీ సర్వీసెస్ భారీ డీల్
Published Wed, Oct 19 2016 1:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
Advertisement
Advertisement