Fide
-
హంపికి ఐదో స్థానం
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది.హంపి, దివ్య 4.5 పాయింట్ల చొప్పున సంపాదించారు. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 36 ఎత్తుల్లో.. ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను దివ్య 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 7 పాయింట్లతో అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. టాన్ జోంగి (చైనా; 6.5 పాయింట్లు) రెండో స్థానంలో, బీబీసారా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
బీబీసారా చేతిలో హంపి ఓటమి
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 34 ఎత్తుల్లో కజకిస్తాన్‌కు చెందిన అసబయేవా బీబీసారా చేతిలో ఓడిపోయింది. పది మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో జరిగిన తొలి గేమ్ ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... టాన్ జోంగి (చైనా)తో జరిగిన రెండో గేమ్‌ను 70 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన మూడో గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. సలీమోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో హంపి 64 ఎత్తుల్లో నెగ్గింది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉంది. దివ్య గెలుపు బోణీ భారత రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ ఐదో రౌండ్లో గెలుపు బోణీ కొట్టింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో దివ్య 45 ఎత్తుల్లో నెగ్గింది. హంపితో తొలి రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించిన దివ్య... కాటరీనా లాగ్నోతో జరిగిన రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో గేమ్‌లో దివ్య 40 ఎత్తుల్లో ఓడిపోయింది. టాన్ జోంగి (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను దివ్య 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
అర్జున్‌ది అరుదైన ఘనత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్ చెస్ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు. మరెంతో మంది యువత చెస్ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు. భారత్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ముగిశాక అర్జున్ లైవ్ రేటింగ్ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్ రేటింగ్ 2798కు చేరింది. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్ క్లబ్ ఓపెన్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. -
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
చెస్ ఒలింపియాడ్‌కు వేళాయె...
గడుల ఆటకు వేళైంది.. ఎత్తుకు పైఎత్తు వేసేందుకు పోటీ దారులు సిద్ధమయ్యారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ చెస్ మహా సంగ్రామానికి చెన్నై నగరం సిద్ధమైంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి అతిరథ మహారథులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాల చెస్ క్రీడాకారులు, అధికారులు, భద్రతా సిబ్బంది రాకతో నగరం కొత్త కాంతులీనుతోంది. ఇక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం ఒలంపియాడ్ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ప్రత్యేక ఆడిటోరియం రూపొందించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ చెస్ పండుగకు రంగం సిద్ధమైంది. 44వ చెస్ ఒలంపియాడ్ పోటీల ప్రారంభోత్స కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కోలాహలంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అత్యధిక దేశాలు పాల్గొంటున్న టోర్నీగా.. దేశంలో తొలిసారిగా జరిగే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీల ఏర్పాట్లకు తమిళనాడు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. ‘తమిళతంబి’ పేరు న గుర్రం ముఖం రూపంలో ఓ చిహ్నాన్ని ఇందుకోసం ప్రత్యేక రూపొందించి నగరం నలుమూలలా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ఆడిటోరియం, క్రీడాకారులకు స్టార్ హోటళ్లలో బస, వందలాది కళాకారులతో స్వాగతం, చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం చెన్నైకు చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్వదేశీ, విదేశీ చెస్ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. క్రీడా ప్రాంగణం పరిసరాల్లో ఏడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యధిక దేశా లు పాల్గొంటున్న టోర్నీగా ఇది గుర్తింపు పొందింది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్న నెహ్రూ ఇండోర్ స్టేడియంను సీఎం స్టాలిన్ బుధవారం పరిశీలించారు. 28వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు చెస్‌పోటీలు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు 1,045 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన చెస్ ఒలంపియాడ్ టార్చ్ రిలే రన్ 39 రోజుల్లో 75 ముఖ్య నగరాలను చుట్టివచ్చి బుధవారం మహాబలిపురానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు ఆ టార్చ్‌ను అందుకున్నా రు. క్రీడాకారులను ప్రాంగణానికి చేర్చే ప్రత్యేక బస్సులకు సంబంధించిన ట్రయల్ రన్‌ను పోలీసులు బుధవారం నిర్వహించారు. ఈనెల 30, 31వ తేదీల్లో తిరువాన్మియూర్, తాంబరం నుంచి మహాబలిపురానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇక ప్రపంచ చెస్ ఒలంపియాడ్ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజేతలైన 100 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పిక్నిక్ ట్రిప్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లి తర్వాత తిరుగు ప్రయాణామయ్యారు. ప్రధాని మోదీపై ఫొటో లేకపోవడంపై.. చెస్ ఒలంపియాడ్ పోటీ ఆహ్వానాల్లో ప్రధాని మోదీ ఫొటో వేయకుండా వివక్ష చూపారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీడియా ప్రకటనలు, ఫ్లెక్సీల్లో ప్రపంచ స్థాయి పోటీలను ప్రారంభించే పీఎం ఫొటో లేకుండా చేయడం ఆశ్చర్యకరమని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చెస్ పోటీలను జయప్రదం చేసేందుకు బీజేపీ రాష్ట్రశాఖ సహకరిస్తున్నా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ పాటించక పోవడం బాధాకరమన్నారు. పీఎంపై తప్పుడు పోస్టులు పెడితే.. చెస్ పోటీలను ప్రారంభించేందుకు చెన్నైకి రానున్న ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ హెచ్చరించారు. బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒలంపియాడ్‌తో ప్రపంచ దేశాలన్నీ చెన్నై వైపు చూస్తున్నాయని, ఈ దశలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగిన వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. మహాబ లిపురం పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని, 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
వైశాలి సంచలనం... ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై విజయం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ రెండో గ్రాండ్‌ప్రి చాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల వైశాలి 6–4 పాయింట్ల తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2016 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్ అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హారిక 4–7 పాయింట్ల తేడాతో అనా ఉషెనినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. -
విజేత ఉషెనినా
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్‌షిప్ తొలి అంచె టోర్నీలో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అనా ఉషెనినా విజేతగా నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఉషెనినా 7–4తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఉషెనినాకు 12 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 3 వేల డాలర్ల (రూ. 2 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున హంపి, వైశాలి బరిలోకి దిగారు. -
చాంపియన్ అర్ఘ్యసేన్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత బిలో 1400 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుడు అర్ఘ్యసేన్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం 8.5 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి వరకు పోరాడిన తెలుగు క్రీడాకారిణి తేజశ్రీకి నిరాశ తప్పలేదు. తమిళనాడుకు చెందిన భరత్ రాజ్ రన్నరప్‌గా నిలవగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పి. తేజశ్రీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరితో పాటు ఎస్. ఉన్నిక్రిష్ణన్ (కేరళ), ఎంఏ సమీ (కేరళ) 8 పాయింట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా భరత్, తేజ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... ఉన్నిక్రిష్ణన్, సమీ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విజేతగా నిలిచిన అర్ఘ్యసేన్‌కు టైటిల్‌తో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌కు రూ. 25,000, తేజశ్రీకి రూ. 13,000 నగదు బహుమతిగా అందజేశారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దీపక్, టీఎస్‌సీఏ కార్యదర్శి కేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భరత్‌కుమార్ రెడ్డికి మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. చివరి వరకు టైటిల్ బరిలో నిలిచిన భరత్‌కుమార్ రెడ్డి, వి. వరుణ్, సుమేర్ అర్ష్ అనుకున్నది సాధించలేకపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌస్తవ్ కుందు ఈ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. ప్రకాశ్ రామ్ (పంజాబ్) రన్నరప్‌గా నిలవగా, భరత్‌కుమార్ రెడ్డి మూడోస్థానంతో సంతృప్తి పడ్డాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం కౌస్తవ్ 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 7.5 పాయింట్లు సాధించిన ప్రకాశ్ రామ్, భరత్ కుమార్ రెడ్డి, వి. వరుణ్, షేక్ సుమేర్ అర్ష్ ముసిని అజయ్ (ఏపీ) రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా ప్రకాశ్, భరత్‌కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... సుమేర్, అజయ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు. విజేతగా నిలిచిన కౌస్తవ్ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ అందుకోగా... ప్రకాశ్ రామ్‌కు రూ. 25,000, భరత్ రూ. 13,000 బహుమతిగా అందుకున్నారు. -
చాంపియన్ జె. రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఫిడే మాస్టర్ జె.రామకృష్ణ (ఆంధ్రా బ్యాంక్) చాంపియన్‌గా నిలిచాడు. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో నిర్ణీత 9 రౌండ్లకుగానూ 8.5 పాయింట్లు సాధించి రామకృష్ణ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్ వేదికగా ఆదివారం జరిగిన చివరిదైన తొమ్మిదోరౌండ్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ఉదయ్ కిరణ్‌పై అతను విజయం సాధించాడు. తెలంగాణ క్రీడాకారుడు భరత్‌కుమార్ రెడ్డి 7.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. కర్ణాటకకు చెందిన ఎ. బాలకిషన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యదర్శి కె. శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతగా నిలిచిన రామకృష్ణ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీని అందుకున్నా డు. భరత్‌కుమార్ రెడ్డి రూ. 35,000, బాలకిషన్ రూ. 30,000 నగదు బహుమానాన్ని పొందారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 లక్షలు. దీన్ని 70 మంది క్రీడాకారులకు అందజేశారు. -
రామకృష్ణకు ఏడో విజయం
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రాబ్యాంక్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ ఏడో విజయాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో అతను ఏడు రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ఎం. నిఖిల్‌పై రామకృష్ణ గెలుపొందాడు. తెలంగాణ ప్లేయర్లు భరత్‌కుమార్ రెడ్డి, ఎస్.ఖాన్‌లతో పాటు కర్ణాటక ఆటగాడు బాలకిషన్ 6 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మిగతా ఏడో రౌండ్ గేముల్లో వి. పృథ్వీ కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై టాప్‌సీడ్ భరత్‌కుమార్‌రెడ్డి (తెలంగాణ), వైభవ్ సింగ్ వర్మ (ఢిల్లీ)పై ఎ. బాలకిషన్ (కర్ణాటక), శ్రీథన్ (తెలంగాణ)పై ఎస్.ఖాన్ (తెలంగాణ) విజయం సాధించారు. టి. సిద్ధాంత్ (మహారాష్ట్ర)తో జె. శరణ్య (తమిళనాడు), సీహెచ్ సాయి వర్షిత్ (ఆంధ్రప్రదేశ్)తో ఎం. రిత్విక్ రాజా, రౌనక్ (పశ్చిమ బెంగాల్)తో శిబి శ్రీనివాస్ (తెలంగాణ), నీరజ్ అనిరుధ్ (తెలంగాణ)తో సాయికృష్ణ (తెలంగాణ), వైష్ణవి (ఆంధ్రప్రదేశ్)తో అంకిత (తెలంగాణ) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. -
రామకృష్ణకు మూడో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రాబ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ జోరు కనబరుస్తున్నాడు. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో రామకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధించాడు. గురువారం జరిగిన మూడోరౌండ్ గేమ్‌లో రుష్యేంద్ర చౌదరీపై అతను విజయం సాధించాడు. మరో బోర్డులో టాప్ సీడ్ భరత్ కుమార్ రెడ్డి (తెలంగాణ) తమిళనాడుకు చెందిన ఆర్. శ్యామ్‌ను 45 ఎత్తుల్లో ఓడించాడు. ఇతర బోర్డుల్లో సతీశ్‌కుమార్ (తెలంగాణ)పై బాలకిషన్ (కర్ణాటక), రిషిత్ (ఆంధ్రప్రదేశ్)పై జె. శరణ్య (తమిళనాడు), కీర్తి (తెలంగాణ)పై సందీప్‌నాయుడు (తెలంగాణ), బషిక్ ఇమ్రోస్ (తెలంగాణ)పై సాయి వర్షిత్ (ఆంధ్రప్రదేశ్), హృషికేశ్ సింహాద్రి (ఆంధ్రప్రదేశ్)పై షణ్ముఖ (తెలంగాణ), విశ్వక్సేన్ (తెలంగాణ)పై ఎం. నిఖిల్ (ఆంధ్రప్రదేశ్), జోయెల్ పాల్ (ఆంధ్రప్రదేశ్)పై రాహుల్ కృష్ణ (తమిళనాడు), అనుకర్ష దత్తా (పశ్చిమ బెంగాల్)పై సృజన్ కీర్తన్ (తెలంగాణ) విజయం సాధించారు. మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో 23 మంది సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. , -
ఆధిక్యంలో హారిక
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 88 ఎత్తుల్లో ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. హంపి ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. యు వాంగ్ (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆధిక్యంలో హారిక
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 16 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హారిక 5.5 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌ను హంపి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. హంపి, జూ వెన్జున్ (చైనా), స్టెఫనోవా 5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే తొమ్మిదో రౌండ్లో బేలా ఖోటెనాష్విలి (జార్జియా)తో హారిక; అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హంపి తలపడతారు. హరికృష్ణ విజయం: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని సాధించాడు. డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. -
హంపిపై హారిక గెలుపు
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో హారిక 74 ఎత్తుల్లో హంపిపై విజయం సాధించింది. హంపిపై హారికకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో హారిక ఈ టోర్నీలో 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో తొలి పరాజయం చవిచూసిన హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. వాసిలీ ఇవాన్చుక్ (ఉ క్రెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 93 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హంపికి ఆరో స్థానం
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో హంపి మొత్తం ఆరు పాయింట్లు సాధించింది. చివరిదైన 11వ రౌండ్లో తెల్ల పావులతో ఆడిన హంపి 61 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఈ టోర్నీలో హంపి మూడు గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయి, మిగతా ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో జు వెన్జున్ (చైనా)తో తలపడిన హారిక 50 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, మిగతా ఏడింటిని ‘డ్రా’గా ముగించింది. హారిక, పియా క్రామ్లింగ్ (స్వీడన్), వాలెంటినా గునీనా (రష్యా) ముగ్గురూ 4.5 పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా క్రామ్లింగ్ ఎనిమిదో స్థానంలో, హారిక తొమ్మిదో స్థానంలో, వాలెంటినా పదో స్థానంలో నిలిచారు. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో జు వెన్జున్ 7.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. -
హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో పోటీపడిన హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హారిక 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత హాంపి ఖాతాలో 2 పాయిం ట్లు, హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉన్నాయి. 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ 23న ముగుస్తుంది. -
హంపి, హారిక ఓటమి
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఆదివారం జరిగిన ఆరో రౌండ్లో జుయ్ జావో (చైనా) 24 ఎత్తుల్లో హంపిపై... తాతియానా కొసింత్సెవా (రష్యా) 32 ఎత్తుల్లో హారికపై గెలిచారు. ఈ టోర్నీలో హంపికిది మూడో ఓటమికాగా, హారికకు తొలి పరాజయం. సోమవారం జరిగే ఏడో రౌండ్లో కొసింత్సెవాతో హంపి; అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో హారిక తలపడతారు.