చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 88 ఎత్తుల్లో ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. హంపి ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. యు వాంగ్ (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
ఆధిక్యంలో హారిక
Published Wed, Jul 13 2016 12:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement