అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) క్లాసికల్ ఫార్మాట్ లైవ్ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గురువారం లైవ్ ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2784 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకొని భారత నంబర్‌వన్‌గా అవతరించాడు.
కొన్నాళ్లుగా నాలుగో ర్యాంక్‌లో నిలిచి, భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2779.5 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో గుకేశ్, అర్జున్, ప్రజ్ఞానంద పోటీపడుతున్నారు.
ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో గుకేశ్ రెండో స్థానంలో ఉన్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్ ఒక పాయింట్‌తో 13వ స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment