రామకృష్ణకు మూడో గెలుపు | Rama Krishna Gets Third Title of FIDE Chess Tourney | Sakshi
Sakshi News home page

రామకృష్ణకు మూడో గెలుపు

Published Fri, May 17 2019 10:04 AM | Last Updated on Fri, May 17 2019 10:04 AM

Rama Krishna Gets Third Title of FIDE Chess Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రాబ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ జోరు కనబరుస్తున్నాడు. ఇండియన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో రామకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధించాడు. గురువారం జరిగిన మూడోరౌండ్‌ గేమ్‌లో రుష్యేంద్ర చౌదరీపై అతను విజయం సాధించాడు. మరో బోర్డులో టాప్‌ సీడ్‌ భరత్‌ కుమార్‌ రెడ్డి (తెలంగాణ) తమిళనాడుకు చెందిన ఆర్‌. శ్యామ్‌ను 45 ఎత్తుల్లో ఓడించాడు.

ఇతర బోర్డుల్లో సతీశ్‌కుమార్‌ (తెలంగాణ)పై బాలకిషన్‌ (కర్ణాటక), రిషిత్‌ (ఆంధ్రప్రదేశ్‌)పై జె. శరణ్య (తమిళనాడు), కీర్తి (తెలంగాణ)పై సందీప్‌నాయుడు (తెలంగాణ),  బషిక్‌ ఇమ్రోస్‌ (తెలంగాణ)పై సాయి వర్షిత్‌ (ఆంధ్రప్రదేశ్‌), హృషికేశ్‌ సింహాద్రి (ఆంధ్రప్రదేశ్‌)పై షణ్ముఖ (తెలంగాణ), విశ్వక్సేన్‌ (తెలంగాణ)పై ఎం. నిఖిల్‌ (ఆంధ్రప్రదేశ్‌), జోయెల్‌ పాల్‌ (ఆంధ్రప్రదేశ్‌)పై రాహుల్‌ కృష్ణ (తమిళనాడు), అనుకర్ష దత్తా (పశ్చిమ బెంగాల్‌)పై సృజన్‌ కీర్తన్‌ (తెలంగాణ) విజయం సాధించారు. మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో 23 మంది సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.  

,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement