
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బిలో 1600 ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ జరగనుంది. విజేతకు రూ. 35 వేలు... రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 22,500... మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 11 వేలు అందజేస్తారు.
స్పాట్ ఎంట్రీలను స్వీకరించరు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 7337578899, 8338399299 ఫోన్ నంబర్లలో ఈనెల 9వ తేదీలోపు తమ పేరు నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు.
చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
Comments
Please login to add a commentAdd a comment