chess tourney
-
Chennai Grandmaster Tourney: ఛాంపియన్ గుకేశ్
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. చెన్నై వేదికగా ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్‌కు టైటిల్ లభించింది. అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 4 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన ఏడో రౌండ్లో గుకేశ్–హరికృష్ణ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... అర్జున్ 57 ఎత్తుల్లో సనన్ జుగిరోవ్ (హంగేరి)పై గెలుపొందాడు. టాప్–3లో నిలిచిన గుకేశ్‌కు 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల 98 వేలు), అర్జున్‌కు 12 వేల డాలర్లు (రూ. 9 లక్షల 98 వేలు), హరికృష్ణకు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హైదరాబాద్‌లో చెస్ టోర్నీ.. ప్రైజ్‌మనీ, ఇతర వివరాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బిలో 1600 ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ జరగనుంది. విజేతకు రూ. 35 వేలు... రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 22,500... మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 11 వేలు అందజేస్తారు. స్పాట్ ఎంట్రీలను స్వీకరించరు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 7337578899, 8338399299 ఫోన్ నంబర్లలో ఈనెల 9వ తేదీలోపు తమ పేరు నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు. చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..? -
Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్..
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన రెండో ఫైనల్ రెండు గేముల్లోనూ కార్ల్సన్ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ -
విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో స్థానం
సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, అరో నియన్ (అర్మేనియా) 23.5 పాయింట్లతో కలసి సంయుక్తగా రెండో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా అరోనియన్‌కు రెండో స్థానం, ఆనంద్‌కు మూడో స్థానం దక్కింది. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య పోలాండ్‌లో జరిగిన ఈ టోర్నీ సోమవారం ముగిసింది. 24 పాయింట్లతో జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) విజేతగా నిలిచాడు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హవా
టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం సాధించాడు. నెదర్లాండ్స్‌లో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన అర్జున్ 42 ఎత్తుల్లో డానియల్ డార్దా (బెల్జియం)పై గెలిచాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత అర్జున్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు ఆరో ఓటమి
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్, భారత నంబర్‌వన్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో పరాజయం చవిచూశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ నెపోమ్నియాచితో ఆదివారం జరిగిన ఆరో రౌండ్లో ఆనంద్ 2–3తో ఓడిపోయాడు. ఇప్పటికే ఆనంద్ వరుసగా స్విద్లెర్ , కార్ల్సన్, క్రామ్నిక్ , అనీశ్ గిరి , పీటర్ లెకో చేతిలో ఓటమి పొందాడు. -
ఓటమితో ముగింపు
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత పురుషుల జట్టు తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడింది. తొలుత చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1.5–2.5తో ఓటమి చవిచూసిన టీమిండియా... అనంతరం రష్యాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 1.5–2.5తో ఓడిపోయింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో హరికృష్ణ, విదిత్, హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆధిబన్ ఓడిపోయాడు. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో హంపి గెలుపొందగా... హరికృష్ణ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ఆధిబన్ తమ గేముల్లో ఓడిపోయారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత భారత్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, అమెరికా జట్లు నేడు జరిగే సూపర్ ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. -
రాజా డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల టెన్నిస్ టోర్నమెంట్లో రాజా రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. బోయిన్పల్లి కృష్ణస్వామి అడ్వాన్స్డ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రాజా విజేతగా నిలిచాడు. పురుషుల ఫైనల్లో రాజా 6–2తో సంతోష్‌పై నెగ్గాడు. డబుల్స్ టైటిల్‌పోరులో రాజా–దిలీప్ కుమార్ జంట 6–1తో ఆదిత్య–క్రిస్ అలెన్ జేమ్స్ జోడీని ఓడించింది. అండర్–18 ఫైనల్లో లలిత్ మోహన్ 6–5 (5)తో విజయ్ తేజ్ రాజుపై, తేజస్వీ 6–5 (5)తో లహరికపై గెలుపొందారు. అండర్–16 బాలుర ఫైనల్లో విజయ్ తేజ్ రాజు 6–0తో రిషి శర్మను చిత్తుగా ఓడించాడు. అండర్–14 కేటగిరీలో రిషి శర్మ, తేజస్వీ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో రిషి శర్మ 6–5 (5)తో ధీరజ్‌పై గెలుపొందగా... తేజస్వీ 6–2తో శ్రీకా రెడ్డిని ఓడించింది. అండర్–12 బాలుర ఫైనల్లో ధీరజ్ 6–3తో వేదాన్‡్షపై, బాలికల తుదిపోరులో శ్రీకారెడ్డి 6–3తో దీక్షితపై గెలుపొందారు. అండర్–10 విభాగంలో ధ్రువ, సృష్టి విజేతలుగా నిలిచారు. బాలుర ఫైనల్లో ధ్రువ 6–4తో చంద్రపై నెగ్గాడు. బాలికల ఫైనల్లో సృష్టి 6–0తో మాన్యారెడ్డిని ఓడించింది. అండర్–8 విభాగంలో కబీర్ 6–2తో కార్తికేయపై గెలుపొందాడు. -
చాంపియన్ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పెరల్ సిటీ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఐసీఎఫ్ గ్రాండ్‌మాస్టర్ లక్ష్మణ్ రాజారామ్ సత్తా చాటాడు. స్థానిక మారుతి గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో లక్ష్మణ్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో నిరీ్ణత 11 రౌండ్ల అనంతరం 9 పాయింట్లను సాధించిన అతను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం కోసం పోటీపడ్డాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా లక్ష్మణ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ కార్తికేయన్ (ఐసీఎఫ్; 9 పాయింట్లు), ఇంటర్నేషనల్ మాస్టర్ ముత్తయ్య (తమిళనాడు; 9 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు. లక్ష్మణ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గేముల్లో గెలుపొందాడు. మరో 4 గేమ్‌లను ‘డ్రా’గా ముగించి టోరీ్నలో అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన లక్ష్మణ్ రూ. 50,000 ప్రైజ్‌మనీతో పాటు ఆల్టో 800 కారును బహుమతిగా అందుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన కార్తికేయన్ రూ. 30,000 ప్రైజ్‌మనీ, ద్విచక్రవాహనాన్ని గెలుచుకోగా... మూడోస్థానంలో నిలిచిన ముత్తయ్య ల్యాప్‌టాప్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమానాన్ని సొంతం చేసుకున్నాడు. మొత్తం 300 మంది చెస్ ప్లేయర్లు తలపడిన ఈ టోరీ్నలో తెలంగాణకు చెందిన ప్రణీత్ 8.5 పాయింట్లతో 12వ స్థానంలో, శిబి శ్రీనివాస్ 8 పాయింట్లతో 22వ స్థానంలో, జె. వెంకట రమణ 7.5 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచారు. శుక్రవారం టోర్నీ ముగింపు కార్యక్రమంలో డీఎస్పీ వంశీమోహన్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, ఖ్యాతి ఫౌండేషన్ చైర్మన్ వి. భవాని పాల్గొన్నారు. -
రష్యా జీఎంపై రాజా రిత్విక్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ మారియట్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు ఐఎం రాజా రిత్విక్ అద్భుత విజయం నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారుడు రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ సావ్చెంకో బోరిస్‌పై రాజా రిత్విక్ 60 ఎత్తుల్లో గెలుపొందాడు. ఐదు రౌండ్ల అనంతరం రష్యాకు చెందిన ఐఎం ట్రియాపిస్కో అలెగ్జాండర్ 5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇతర బోర్డుల్లో కార్తికేయన్ (తమిళనాడు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్ (రష్యా), ఉత్కల్ రంజన్ (ఒడిశా)పై తుఖోవ్ ఆడమ్ (ఉక్రెయిన్), మనీశ్ కుమార్ (ఒడిశా)పై లక్ష్మణ్, భరత్ కల్యాణ్ (తమిళనాడు)పై రత్నాకరణ్ (కేరళ), శేఖర్ చంద్ర (ఒడిశా)పై భరత్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కౌస్తువ్ ఖండు (పశి్చమ బెంగాల్)పై కవింద అఖిల (శ్రీలంక), డి సిల్వా (శ్రీలంక)పై శంతను (మహారాష్ట్ర), రాజు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్ (తెలంగాణ), అజయ్ (ఆంధ్రప్రదేశ్)పై వరుణ్ (ఆంధ్రప్రదేశ్), శ్రీహిత్ రెడ్డి (తెలంగాణ)పై రాజేశ్ (ఒడిశా), జయకుమార్ (మహారాష్ట్ర)పై కార్తీక్ (తెలంగాణ), సురేంద్రన్ (తమిళనాడు)పై రహమాన్ (బంగ్లాదేశ్) గెలుపొందారు. -
చాంపియన్ సూర్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో సూర్య ఆలకంటి విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ అండర్–17 బాలుర విభాగంలో సూర్య విజేతగా నిలిచాడు. నాలుగు రౌండ్ల పాటు పోటీలు జరుగగా సూర్య 4 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 3 పాయింట్లతో శివతేజ, పి. వెంకట జశ్వంత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా శివతేజ రన్నరప్‌గా, జశ్వంత్ మూడో స్థానాన్ని అందుకున్నారు. అండర్–15 బాలికల విభాగంలో నిషా (4 పాయింట్లు), స్నేహ (4 పాయింట్లు), మనోజ్ఞ (2 పాయింట్లు)... బాలుర కేటగిరీలో విశ్వ (4.5 పాయింట్లు), ఆకాశ్ (4 పాయింట్లు), సాయి పవన్ (3.5 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–7 బాలురు: 1. దివ్యాన్షు, 2. హరిరామ్, 3. చరణ్; బాలికలు: 1. సాధన, 2. కీర్తి, 3. శాన్వి. అండర్–9 బాలురు: 1. సాత్విక్, 2. శ్రీవంత్ శర్మ, 3. ఆదిత్య శ్రీరామ్; బాలికలు: 1. లహరి, 2. హృతిక, 3. సంహిత. అండర్–11 బాలురు: 1. ప్రణయ్, 2. సహర్ష, 3. సాకేత్‌రామ్ సాయి; బాలికలు: 1. ఇషాన్వి, 2. నిగమశ్రీ, 3. నిఖిత. అండర్–13 బాలురు: 1. రిత్విక్, 2. శశాంక్, 3. శ్రీధన్వి; బాలికలు: 1. మేధ, 2. రితిక, 3. ఆకాంక్ష. -
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ బ్రోచర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: పడాల లక్ష్మమ్మ, భూమా గౌడ్ స్మారక తెలంగాణ రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, కార్యదర్శి కేఎస్ ప్రసాద్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఈనెల 13, 14 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. విజేతకు రూ. 30,000 ప్రైజ్‌మనీ అందజేయనున్నారు. వివరాలకు www. chesstelangana.com వెబ్సైట్లో లేదా ప్రశాంత్ గౌడ్ (88010 00222, 88010 00666)ను సంప్రదించాలి. -
చాంపియన్ సహజశ్రీ
సాక్షి, హైదరాబాద్: మీనాతాయి షిర్గావ్కర్ స్మారక ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ మహిళల చెస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని సంగ్లి వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో సహజశ్రీ నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకుంది. ఆరు గేముల్లో గెలిచిన సహజ... రెండింటినీ డ్రా చేసుకొని అజేయంగా నిలిచింది. తొలి గేమ్‌లో భక్తి రజాయ్ (గుజరాత్)పై, రెండో గేమ్‌లో అస్మితా (గోవా)పై, మూడో గేమ్‌లో డే కేయా (గుజరాత్)పై, నాలుగో గేమ్‌లో మోహిత (ఏపీ)పై, ఐదో గేమ్‌లో వృషాలి (మహారాష్ట్ర)పై గెలుపొందిన సహజశ్రీ... విశ్వ షా (మహారాష్ట్ర)తో ఆరోగేమ్ను, ధనశ్రీ (మహారాష్ట్ర)తో ఏడో గేమ్‌ను డ్రా చేసుకుంది. చివరిదైన ఎనిమిదో రౌండ్లో రియా నరేంద్ర (మహారాష్ట్ర)పై గెలుపొంది చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన విశ్వ షా, వృషాలి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
చాంపియన్ సిద్ధిక్ అక్బర్
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తమిళనాడు ప్లేయర్ సిద్ధిక్ అక్బర్ చాంపియన్‌గా నిలిచాడు. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ (ఐజీఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదోరౌండ్‌లో తెలంగాణకు చెందిన వర్షిత్‌తో గేమ్‌ను సిద్ధిక్ డ్రా చేసుకున్నాడు. సిద్ధిక్‌తో పాటు మరో నలుగురు క్రీడాకారులు 8 పాయింట్లతో తొలి స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నాగశ్రీ సాయికాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఎస్. కృష్ణమూర్తి (తమిళనాడు) మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో చెస్64.కామ్ సీఈవో జయప్రకాశ్ ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన సిద్ధిక్ రూ. 50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందుకున్నాడు. సాయికాంత్ రూ. 35,000, కృష్ణమూర్తి రూ.30,000 ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, ఐజీఎంఎస్‌ఏ కార్యనిర్వహణాధికారి ప్రొఫెసర్ పి. కామేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలి పది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు: 1. సిద్ధిక్ అక్బర్, 2. నాగశ్రీ సాయికాంత్, 3. కృష్ణమూర్తి, 4. వర్షిత్ (తెలంగాణ), 5. ఎం. అనిల్ (తెలంగాణ), 6. జె. మనోజ్ రంజిత్ (తమిళనాడు), 7. ప్రజ్వల్ (మహారాష్ట్ర), 8. వై. సేతుమాధవ్ (ఆంధ్రప్రదేశ్), 9. జి. హేమ ఈశ్వర్ (ఆంధ్రప్రదేశ్), 10. సంజీవన్ సింగ్ సర్దార్ (తెలంగాణ). -
చాంపియన్ జె. రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఫిడే మాస్టర్ జె.రామకృష్ణ (ఆంధ్రా బ్యాంక్) చాంపియన్‌గా నిలిచాడు. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో నిర్ణీత 9 రౌండ్లకుగానూ 8.5 పాయింట్లు సాధించి రామకృష్ణ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్ వేదికగా ఆదివారం జరిగిన చివరిదైన తొమ్మిదోరౌండ్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ఉదయ్ కిరణ్‌పై అతను విజయం సాధించాడు. తెలంగాణ క్రీడాకారుడు భరత్‌కుమార్ రెడ్డి 7.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. కర్ణాటకకు చెందిన ఎ. బాలకిషన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) కార్యదర్శి కె. శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతగా నిలిచిన రామకృష్ణ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీని అందుకున్నా డు. భరత్‌కుమార్ రెడ్డి రూ. 35,000, బాలకిషన్ రూ. 30,000 నగదు బహుమానాన్ని పొందారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 లక్షలు. దీన్ని 70 మంది క్రీడాకారులకు అందజేశారు. -
రామకృష్ణకు ఏడో విజయం
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రాబ్యాంక్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ ఏడో విజయాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో అతను ఏడు రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ఎం. నిఖిల్‌పై రామకృష్ణ గెలుపొందాడు. తెలంగాణ ప్లేయర్లు భరత్‌కుమార్ రెడ్డి, ఎస్.ఖాన్‌లతో పాటు కర్ణాటక ఆటగాడు బాలకిషన్ 6 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మిగతా ఏడో రౌండ్ గేముల్లో వి. పృథ్వీ కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై టాప్‌సీడ్ భరత్‌కుమార్‌రెడ్డి (తెలంగాణ), వైభవ్ సింగ్ వర్మ (ఢిల్లీ)పై ఎ. బాలకిషన్ (కర్ణాటక), శ్రీథన్ (తెలంగాణ)పై ఎస్.ఖాన్ (తెలంగాణ) విజయం సాధించారు. టి. సిద్ధాంత్ (మహారాష్ట్ర)తో జె. శరణ్య (తమిళనాడు), సీహెచ్ సాయి వర్షిత్ (ఆంధ్రప్రదేశ్)తో ఎం. రిత్విక్ రాజా, రౌనక్ (పశ్చిమ బెంగాల్)తో శిబి శ్రీనివాస్ (తెలంగాణ), నీరజ్ అనిరుధ్ (తెలంగాణ)తో సాయికృష్ణ (తెలంగాణ), వైష్ణవి (ఆంధ్రప్రదేశ్)తో అంకిత (తెలంగాణ) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. -
రామకృష్ణకు మూడో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రాబ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ జోరు కనబరుస్తున్నాడు. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో రామకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధించాడు. గురువారం జరిగిన మూడోరౌండ్ గేమ్‌లో రుష్యేంద్ర చౌదరీపై అతను విజయం సాధించాడు. మరో బోర్డులో టాప్ సీడ్ భరత్ కుమార్ రెడ్డి (తెలంగాణ) తమిళనాడుకు చెందిన ఆర్. శ్యామ్‌ను 45 ఎత్తుల్లో ఓడించాడు. ఇతర బోర్డుల్లో సతీశ్‌కుమార్ (తెలంగాణ)పై బాలకిషన్ (కర్ణాటక), రిషిత్ (ఆంధ్రప్రదేశ్)పై జె. శరణ్య (తమిళనాడు), కీర్తి (తెలంగాణ)పై సందీప్‌నాయుడు (తెలంగాణ), బషిక్ ఇమ్రోస్ (తెలంగాణ)పై సాయి వర్షిత్ (ఆంధ్రప్రదేశ్), హృషికేశ్ సింహాద్రి (ఆంధ్రప్రదేశ్)పై షణ్ముఖ (తెలంగాణ), విశ్వక్సేన్ (తెలంగాణ)పై ఎం. నిఖిల్ (ఆంధ్రప్రదేశ్), జోయెల్ పాల్ (ఆంధ్రప్రదేశ్)పై రాహుల్ కృష్ణ (తమిళనాడు), అనుకర్ష దత్తా (పశ్చిమ బెంగాల్)పై సృజన్ కీర్తన్ (తెలంగాణ) విజయం సాధించారు. మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో 23 మంది సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. , -
రెండో స్థానంలో ఆనంద్
షంకిర్ (అజర్బైజాన్): వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదు రౌండ్లలో అతను ఒక్క నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్సన్తో మాత్రమే ఓడిపోయాడు. రెండు గేమ్‌ల్లో గెలిచి మరో రెండు గేముల్ని డ్రా చేసుకున్నాడు. దీంతో 3 పాయింట్లతో కర్యాకిన్ (రష్యా)తో కలిసి ఉమ్మడిగా రెండోస్థానంలో నిలిచాడు. కార్ల్సన్ (నార్వే) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో రౌండ్ గేమ్‌లో అనిశ్ గిరి (నెదర్లాండ్స్)పై ఆనంద్ గెలిచాడు. -
చాంపియన్ అభిరామ్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తక్షశిల పబ్లిక్ స్కూల్ (లాలాపేట్) విద్యార్థి అభిరామ్ ప్రణీత్, జేకే రాజు చాంపియన్లుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లకు గానూ 6 పాయింట్లు సాధించిన అభిరామ్ ప్రణీత్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి గేమ్‌లో ఆరుష్‌పై ప్రణీత్ గెలుపొందాడు. 5 పాయింట్లతో కోవిద్ కుశాల్ రన్నరప్‌గా నిలవగా... ఆలకంటి విశ్వ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో 5.5 పాయింట్లు స్కోర్ చేసిన జేకే రాజు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అమిత్‌పాల్ సింగ్ (5 పాయింట్లు), షణ్ముఖ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీలో జాహ్నవి శ్రీలలిత ‘బెస్ట్ ఉమన్’, ఎం. రామ్మోహన్ రావు ‘బెస్ట్ వెటరన్’ అవార్డులను గెలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. శ్రీయాన్ రెడ్డి, 2. జె. శ్రీరామ్; బాలికలు: 1. కె. సాత్విక. అండర్–12 బాలురు: 1. కోవిద్ కుషాల్, 2. విశ్వ; బాలికలు: 1. కె. తన్మయి, భవిష్య రెడ్డి. అండర్–10 బాలురు: 1. వి. అభిరామ్, 2. సత్య పృథ్వీ; బాలికలు: 1. జి. శరణ్య, 2. రిమితా రెడ్డి. అండర్–8 బాలురు: 1. ధ్రువ్, 2. శ్రీ రేవంత్ కుమార్; బాలికలు: 1. ఐశ్వర్య, 2. అనయా. అండర్–6 బాలురు: 1. ఎం. గురుదేవ్, 2. హర్‌తేజ్‌పాల్ సింగ్; బాలికలు: 1. ఎన్. హరిణి. , , -
హారిక గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడో ‘డ్రా’ నమోదు చేసింది. జార్జియా గ్రాండ్‌మాస్టర్ బేలా ఖోటెనాష్విలితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హారిక 4.5 పాయింట్లతో ఇరీనా క్రుష్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. తొమ్మిదో రౌండ్లో ఇరీనా క్రుష్‌తో హారిక ఆడుతుంది. -
చాంప్స్ ఆదిత్య, నిశ్చల్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో ఆదిత్య వరుణ్, టి. నిశ్చల్ చాంపియన్లుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో ఆదిత్య, జూనియర్స్ విభాగంలో నిశ్చల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఓపెన్ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లు ముగిసేసరికి ఓక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ (కొత్తపేట్)కు చెందిన ఆదిత్య వరుణ్ 6 పాయింట్లతో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్లో దువ్వాల సురేశ్ (5)పై ఆదిత్య విజయం సాధించాడు. 5 పాయింట్లతో కె. త్రిష, సురేశ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా త్రిష రన్నరప్‌గా నిలవగా, సురేశ్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో నిశ్చల్, డి. నిగమశ్రీ, పురుషోత్తం, ఎస్. బాబు 5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నిశ్చల్ అగ్రస్థానంలో... నిగమశ్రీ,, పురుషోత్తం వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో జాతీయ మాజీ ప్లేయర్ పి. రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. బి. పురుషోత్తం, 2. శ్రీగణేశ్ చరణ్; బాలికలు: 1. హాసిత, 2. ఎన్. అక్షయ; అండర్–12 బాలురు: 1. సీహెచ్ మోక్షజ్ఞ, 2. ఎం. శ్రీ జీవన్; బాలికలు: 1. నిగమశ్రీ, 2. వేద శ్రుతి. అండర్–10 బాలురు: 1. ఎస్. బాబు, 2. ఎ. హిమాన్షు; బాలికలు: 1. కె. నిత్యశ్రీ, 2. మీనా. అండర్–8 బాలురు: 1. డి. పార్థివ్, 2. వి. సంతోష్ కుమార్. అండర్–6 బాలురు: 1. కె. ద„Š , 2. పి. సాయి జయంత్. -
చెస్ చాంపియన్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ టోర్నమెంట్లో క్యాండిడేట్ మాస్టర్ (సీఎం) ఉప్పల ప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. బీఎస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్ విభాగంలో ప్రణీత్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలి ఐదు గేముల్లో వరుసగా సేవితా విజు, విశ్వనాథ్ కన్నం, శ్రీనివాస రావు, ఆదిత్య వరుణ్, తరుణ్‌లపై విజయం సాధించాడు. వి. వరుణ్‌తో జరిగిన ఆరో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. వరుణ్ రన్నరప్‌గా నిలవగా, కె. ఆశ్లేష్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజి కరెస్పాండెంట్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర విభాగాల విజేతల వివరాలు అండర్–9 బాలురు: 1. నిశ్చల్, 2. సాయి రుత్విక్, 3. అన్‡్ష నందన్; బాలికలు: 1. సస్య సింఘారెడ్డి, అనయా అగర్వాల్, అభిజ్ఞ అద్దంకి. అండర్–11 బాలురు: 1. అనురాగ్, 2. కోవిధ్ కుశాల్ రెడ్డి, 3. శ్రీ చైతన్య; బాలికలు: 1. ఈశాన్వి సత్య సాయి, 2. శరణ్య, 3. అస్మా మరియం బేగమ్. అండర్–13 బాలురు: 1. శ్రీనందన్ బాబు, 2. చైతన్య, 3. సృజన్; బాలికలు: 1. భవిష్య, 2. తన్మయి, 3. జ్యోతి జీవన. -
ఓవరాల్ చాంప్ సాధు వాస్వాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) స్కూల్ పిల్లల చెస్ టోర్నీలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు సత్తా చాటింది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొత్తం 130 మంది చిన్నారులు పాల్గొన్న ఈ టోర్నీని తరగతుల వారీగా నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ కంచన్ దులాని, యూనిసెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సీవీ రమాదేవి ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతల వివరాలు మొదటి తరగతి బాలురు: 1. గురుదేవ్, 2. రిషిత్; బాలికలు: 1. మంజరి; రెండో తరగతి బాలురు: 1. సాయి అనీశ్, 2. వైభవ్; బాలికలు: 1. రుషిత, 2. సాత్విక. మూడో తరగతి బాలురు: 1. చరణ్, 2. ధ్రువ్ కుమార్; బాలికలు: 1. సిద్ధిక, 2. టియా బేడీ; నాలుగో తరగతి బాలురు: 1. అనీశ్, 2. రిత్విక్; బాలికలు: 1. చైత్ర; ఐదో తరగతి బాలురు: 1. ప్రణీత్, 2. త్రిశాంక్; బాలికలు: 1. హర్షిత, 2. సొనాల్ సింగ్; ఆరో తరగతి బాలురు: 1. ప్రణయ్, 2. సూర్యప్రతాప్; బాలికలు: 1. సేవిత విజు, 2. ప్రణీత. ఏడో తరగతి బాలురు: 1. హేమంత్, 2. నీల్ జాన్ వివేక్; బాలికలు: 1. కీర్తి, 2. వేద. ఎనిమిదో తరగతి బాలురు : 1. ప్రభంజన్, 2. మిహిర్; బాలికలు: 1. యజ్ఞ ప్రియ, 2. శ్రీచరిత. తొమ్మిదో తరగతి బాలురు: 1. ఎన్. రోహిత్, 2. శ్రీ గణేశ్. -
చాంపియన్ భరత్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో పోలూరి భరత్‌కుమార్ రెడ్డి అదరగొట్టాడు. అబిడ్స్‌లోని డైమండ్ జూబ్లీ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భరత్ చాంపియన్‌గా నిలిచాడు. టోర్నీలో నిర్ణీత ఆరు రౌండ్లు ముగిసేసరికి అజేయంగా 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచే క్రమం లో హాసిత, పి. అభిషేక్, సాకేత్ కుమార్, జి. శ్రీనివాస్, సృజన్ కీర్తన్, బిపిన్ రాజ్‌లపై వరుసగా ఆరు గేముల్లో విజయం సాధించాడు. మరోవైపు 5.5 పాయింట్లతో శ్రీశ్వాన్, వి. వరుణ్, తరుణ్, శివ రెండోస్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా శ్రీశ్వాన్ రన్నరప్‌గా నిలవగా, వరుణ్ మూడో స్థానంలో... తరుణ్, శివ వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సంతృప్తిచెందారు. బిపిన్ రాజ్, షణ్ముఖ, అమిత్‌పాల్ సింగ్, సృజన్ కీర్తన్, ప్రతీక్ తలా 5 పాయింట్లతో టాప్–10లో చోటు దక్కించుకున్నారు. 4 పాయింట్లు సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి సహజ్దీప్ కౌర్ 49వ స్థానంలో టోర్నీని ముగించింది. ఆమె సంకీర్త్ రెడ్డితో జరిగిన రెండోగేమ్, రామ్‌సాగర్‌తో జరిగిన నాలుగో గేమ్‌లో ఓటమి పాలైంది. అభిజిత్ అర్కట్, అనీశ్, ధ్రువన్, వెంకట సుబ్బయ్యలతో జరిగిన గేముల్లో గెలుపొంది నాలుగు పాయింట్లతో నిలిచింది. -
అర్జున్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: చెన్నై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్‌కు నిరాశ ఎదురైంది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో అర్జున్ టాప్–10 చోటు దక్కించుకోలేకపోయాడు. నిర్ణీత 10 రౌండ్లు ముగిసేసరికి 6 పాయింట్లతో 51వ స్థానంతో టోర్నీని ముగించాడు. తొలి రౌండ్లో బద్రి నారాయణ్ (భారత్), రెండో గేమ్‌లో మొహమ్మద్ అబ్జిద్ రహమాన్ (బంగ్లాదేశ్)లపై గెలుపొందిన అర్జున్... గ్రాండ్ మాస్టర్ జియాదినోవ్ రసెత్ (అమెరికా)తో జరిగిన మూడో గేమ్‌లో ఓటమి చవిచూశాడు. అనంతరం ట్రిటోన్ మాక్సిమ్ (ఫ్రాన్స్), సెంథిల్ మారన్, ముత్తయ్య (భారత్)లతో జరిగిన మూడు గేముల్లో విజయాలు సాధించాడు. గ్రాండ్ మాస్టర్ డేవియాకిన్ అండ్రెయ్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌ను డ్రాగా ముగించిన అర్జున్ తర్వాతి రెండు గేముల్లో పరాజయాలు చవిచూశాడు. రాకేశ్ (భారత్)తో జరిగిన చివరిదైన పదోగేమ్‌ను డ్రా చేసుకున్నాడు.