
సాక్షి, హైదరాబాద్: ‘మేను’ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఈనెల 4 నుంచి జరుగనుంది. బండమైసమ్మ నగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో జరుగనున్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 16 లక్షలుగా నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 8 వరకు ఓపెన్ విభాగంలో, 10 నుంచి 12 వరకు ఫిడే రేటింగ్ బిలో 1350 స్థాయి క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతాయి.
ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు అతిథిగా విచ్చేసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ కార్యదర్శి కేఎస్ ప్రసాద్, కార్యదర్శి షేక్ ఫయాజ్ పాల్గొన్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం 88858 17666 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment