
ఆనంద్‌కు తొలి విజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 29 ఎత్తుల్లో గెలుపొందాడు. తొలి నాలుగు గేమ్‌లను ‘డ్రా’గా ముగించుకున్న ఆనంద్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), ఆనంద్ ఖాతాలో మూడేసి పాయింట్లున్నాయి.