చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. చెన్నై వేదికగా ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్‌కు టైటిల్ లభించింది. అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు.
హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 4 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన ఏడో రౌండ్‌లో గుకేశ్–హరికృష్ణ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... అర్జున్ 57 ఎత్తుల్లో సనన్ జుగిరోవ్ (హంగేరి)పై గెలుపొందాడు. టాప్–3లో నిలిచిన గుకేశ్‌కు 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల 98 వేలు), అర్జున్‌కు 12 వేల డాలర్లు (రూ. 9 లక్షల 98 వేలు), హరికృష్ణకు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment