Viswanathan Anand
-
ఇది స్వర్ణయుగం
ప్రతి రంగంలో కొన్ని చరిత్రాత్మక క్షణాలు ఉంటాయి. చదరంగంలో మన దేశానికిప్పుడు అలాంటి క్షణాలే. బుడాపెస్ట్‌లో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు... యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం. మన ఆటగాళ్ళు తొలిసారిగా అటు ఓపెన్, ఇటు మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలు సాధించి, దేశానికి మరువలేని కానుక ఇచ్చారు. చైనా, సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే. అలాగే, గుకేశ్, అర్జున్, దివ్య, వంతికల 4 వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. విశ్వనాథన్ ఆనందన్ బాటలో నడిచిన ఆయన శిష్యబృందం దేశాన్ని సమున్నతంగా నిలిపింది. కేవలం పదేళ్ళ క్రితం ఆశ్చర్యకరంగా కాంస్యం గెలిచి ఒలింపియాడ్‌లో బోణీ కొట్టిన దేశం, గడచిన 2022లో రెండు విభాగాల్లోనూ కాంస్యాలకే పరిమితమైన దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం. ఒక్కమాటలో నిన్న మొన్నటి దాకా చెస్‌లో సాగిన యూరోపియన్ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడింది. ఆటకు భవిష్యత్ చిరునామాగా భారత్ ఆవిర్భవించింది. చదరంగంలో అక్షరాలా మన స్వర్ణయుగం ఆరంభమైంది. ఒలింపిక్స్ పోటీల్లో స్థానం లేని చెస్‌కు సంబంధించినంత వరకు ఈ చెస్ ఒలింపియాడే... ఒలింపిక్స్. అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో... 193 దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లు పాల్గొన్న ఓపెన్ విభాగంలో, 181 దేశాలు పోటీపడ్డ మహిళా విభాగంలో మన జట్లు స్వర్ణాలు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి దేశం నుంచి అయిదుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల జట్లు ఆ యా విభాగాల్లో పోటీ పడతాయి. అలాంటి చోట ఓపెన్ విభాగంలో తొమ్మిదో రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన ఆటను డ్రా చేయడం తప్ప, మొత్తం 11 రౌండ్లకు గాను 10 రౌండ్లు మన భారత జట్టు గెలిచింది. టైటిల్ విజేతగా నిలిచింది. అంతేకాక 21 పాయింట్ల రికార్డ్ స్కోర్ సాధించి, రెండోస్థానంలో నిలిచిన 17 పాయింట్ల అమెరికా కన్నా చాలా పైన మనం నిలవడం విశేషం. మహిళా విభాగంలోనూ మొత్తం 11 రౌండ్లలో, ఒక్క 8వ రౌండ్లో పోలండ్‌తోనే మన జట్టు ఓడింది. అమెరికాతో ఆటను డ్రా చేసి, మొత్తం 19 పాయింట్లు సాధించి, స్వర్ణం సాధించింది. కనివిని ఎరుగని ఈ జంట విజయాల కారణంగానే ఇవాళ మన క్రీడా ప్రపంచం సంబరాలు చేసుకుంటోంది.మొత్తం మీద భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్ళీ పుట్టినింటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ ఒలింపియాడ్ విజయాలు దేశవ్యాప్తంగా మన యువతరంలో దాగిన చదరంగ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. గుకేశ్ దొమ్మరాజు లాంటి మన ఆటగాళ్ళు కొందరు వ్యక్తిగత స్వర్ణాలు సైతం సాధించడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ లాంటి కొందరి పేర్లే వినిపించిన దేశంలో ఇటీవల దాదాపు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉద్భవించారు. వారిలో పలువురు 20వ పడిలో వారే. అయిదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియనైన మ్యాగ్నస్ కార్ల్సెన్ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద లాంటి టీనేజ్ వండర్లు మనకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ తదితరులు మన పురుషుల జట్టులో ఉన్నారు. అలాగే, అనుభవమున్న కోనేరు హంపి జట్టులో లేకున్నా, ఒకట్రెండు తడబాట్లు ఎదురైనా సరే పట్టువదలక పోరాడి, ఒలింపియాడ్ విజయం సాధించిన ఆడపిల్లల జట్టు ఈ రోజున మనకుంది. అంతకంతకూ పెరుగుతున్న మన బలానికీ, బలగానికీ అది గీటురాయి. పోగుబడ్డ ప్రతిభావంతులకు నిరంతర సాధన, నిరుపమానమైన టీమ్ స్పిరిట్ కూడా తోడై తాజా అందలాన్ని ఎక్కించాయి. అదే సమయంలో మన ప్రస్తుత విజయ పరంపరకు స్ఫూర్తి... ప్రజ్ఞానంద, గుకేశ్ లాంటి పలువురికి చేయూతనిచ్చిన దీప్తి... శిక్షణకు ఎంతో ఖర్చయ్యే ఈ ఆటలో వర్ధిష్ణువులెందరికో స్పాన్సర్‌షిప్‌లు దక్కేలా తోడ్పడ్డ తెర వెనుక దీప్తి... 15వ వరల్డ్ చెస్ ఛాంపియనైన విశ్వనాథన్ ఆనంద్ అని మర్చిపోలేం. ప్రతిభ గల పిల్లల్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఒక వాతావరణాన్నీ, వ్యవస్థనూ కల్పించిన ఆలిండియా చెస్ ఫెడరేషన్ కృషినీ చెప్పుకొని తీరాలి. పెరిగిన సోషల్ మీడియా, హద్దులు లేని డిజిటల్ వ్యాప్తి సైతం మన యువతరాన్ని చెస్ వైపు ఆకర్షించిందీ నిజమే. భారతీయ స్ట్రీమింగ్ వేదికల్లో బాగా పాపులరైన చెస్‌బేస్ ఇండియాకు దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఆ వేదిక వివిధ టోర్నీల నిర్వహణతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పలువురు ఆటగాళ్ళకు ఆర్థికంగా అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడీ ఒలింపియాడ్ డబుల్ ధమాకా స్వర్ణాలు చెస్ ప్రాచుర్యంతో పాటు పిల్లల్లో ఆసక్తి పెంచడం ఖాయం. భారత చదరంగానికి ఇది శుభతరుణం. త్వరలో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చైనీస్ ఛాంపియన్‌తో 18 ఏళ్ళ మన గుకేశ్ పోరు కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు కాక, కనీసం మరో అరడజను మంది ఒలింపియాడ్‌లో స్థానం కోసం పోటీపడుతున్న స్థాయికి చేరాం. అయితే, ఇది చాలదు. ఆడపిల్లల్లో మన చెస్ బలగం ఇంకా పెరగాల్సి ఉంది. ఇదే అదనుగా కేంద్రం, రాష్ట్రాలు మరింత ప్రోత్సాహం అందించాలి. పాఠశాలల స్థాయి నుంచే చెస్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. బడుల్లోనే కాక గ్రంథాలయాల్లో, స్థానిక పట్టణ కేంద్రాల్లోనూ చెస్‌కు వసతులు కల్పించాలి. అలాగే మన దేశంలోనూ అగ్రశ్రేణి టోర్నీలు జరిగేలా చూడాలి. చెన్నై ఇవాళ చదరంగ ప్రతిభకు కేంద్రంగా మారిందంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చేయూత కారణం. అందరికీ అది ఆదర్శప్రాయం. స్వర్ణయుగం సుదీర్ఘంగా కొనసాగాలంటే ఇలాంటి చర్యలే కీలకం. -
భారత చెస్‌పై ఆనంద్ ఎఫెక్ట్
‘చదరంగపు సంస్కృతి కనిపించని దేశం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రపంచ చాంపియన్ కావడమే కాదు, ఆటపై ఆసక్తి పెంచుకొని దానిని ముందుకు తీసుకెళ్లగలిగేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా నమ్మలేని విషయం, అసాధారణం. ఆ దిగ్గజమే విశ్వనాథన్ ఆనంద్’... భారత జట్టు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన తర్వాత టాప్ చెస్ ప్లేయర్, ప్రపంచ 2వ ర్యాంకర్ నకముర ఆనంద్ గురించి చేసిన ప్రశంస ఇది. భారత చెస్ గురించి తెలిసిన వారెవరైనా ఈ మాటలను కాదనలేరు. ఆటగాడిగా మన చదరంగంపై ఆనంద్ వేసిన ముద్ర అలాంటిది. చెస్ క్రీడను పెద్దగా పట్టించుకోని సమయంలో 19 ఏళ్ల వయసులో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన ఆనంద్... ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్త తరానికి బ్యాటన్‌ను అందించి సగర్వంగా నిలిచాడు. ఆనంద్ జీఎంగా మారిన తర్వాత ఈ 36 ఏళ్ల కాలంలో మన దేశం నుంచి మరో 84 మంది గ్రాండ్మాస్టర్లుగా మారగా... ఇందులో 30 మంది తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం. ‘వాకా’తో విజయాలు... నాలుగేళ్ల క్రితం ఆనంద్ తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మెల్లగా తాను ఆడే టోర్నీల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయమది. తన ఆట ముగిసిపోయాక భవిష్యత్తులో ప్రపంచ చెస్‌లో భారత్ స్థాయిని కొనసాగించేలా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భావించాడు. ఈ క్రమంలో వచ్చి0దే చెస్ అకాడమీ ఏర్పాటు ఆలోచన. చెన్నైలో వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)ని అతను నెలకొల్పాడు. ఇక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అద్భుత ఫలితాలను అందించి ఆనంద్ కలలకు కొత్త బాట వేసింది. దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి ఇందులో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి కూడా ఇక్కడ శిక్షణ పొందాడు. ‘విషీ సర్ లేకపోతే ఇవాళ మేం ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదు’... గుకేశ్, ప్రజ్ఞానంద తరచుగా చెబుతూ రావడం వారి కెరీర్ ఎదుగుదలలో ఆనంద్ పాత్ర ఏమిటో చెబుతుంది. యువ చెస్ ఆటగాళ్ల కెరీర్ దూసుకుపోవడంలో తల్లిదండ్రులు, ఆరంభంలో కోచింగ్ ఇచ్చిన వారి పాత్రను ఎక్కడా తక్కువ చేయకుండా వారిపైనే ప్రశంసలు కురిపించిన ఆనంద్ ‘వాకా’తో తాను ఎలా సరైన మార్గ నిర్దేశనం చేశాడో ఒలింపియాడ్ విజయానంతరం వెల్లడించాడు. జూనియర్ దశను దాటుతూ... యువ ఆటగాళ్లను విజయాల వైపు సరైన దిశలో నడిపించడం అకాడమీ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమని అతను చెప్పాడు. తన కెరీర్ ప్రారంభంలో సోవియట్ యూనియన్‌లో ఉన్న చెస్ సంస్కృతిని చూసి అకాడమీ ఆలోచన వచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నాడు. అక్కడ దిగువ స్థాయికి పెద్ద ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఈ అకాడమీలు సంధానకర్తలుగా వ్యవహరిస్తాయని అతను వెల్లడించాడు. ‘భారత ఆటగాళ్లు ర్యాంకింగ్‌పరంగా తరచుగా టాప్–200లోకి దూసుకొస్తున్నారు.కానీ టాప్–100లోకి మాత్రం రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతిభావంతులను ఆ దిశగా సాధన చేయించడం ముఖ్యమని భావించా. వారి విజయాల్లో మా పాత్రను పోషించడం సంతృప్తినిచ్చే విషయం’ అని ఆనంద్ తన అకాడమీ ప్రాధాన్యతను గురించి పేర్కొన్నాడు. 14 ఏళ్ల కంటే ముందే గ్రాండ్మాస్టర్లుగా మారిన ఆటగాళ్లను ఆనంద్ తన అకాడమీలోకి తీసుకున్నాడు. జూనియర్ స్థాయిలో సంచలనాలు సాధించి సీనియర్‌కు వచ్చేసరికి ఎక్కడా కనిపించకపోయిన ప్లేయర్లు చాలా మంది ఉంటారు. అలాంటిది జరగకుండా జూనియర్ స్థాయి విజయాలను సీనియర్‌లోనూ కొనసాగిస్తూ పెద్ద విజయాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని ఆనంద్ చెప్పుకున్నాడు. అనూహ్య వేగంతో... ‘నా తొలి గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లంతా గొప్పగా రాణిస్తున్నారు. నిజానికి వీరు తొందరగా శిఖరానికి చేరతారని నేనూ ఊహించలేదు. వారు మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నా గానీ అదీ ఇంత వేగంగా, నమ్మశక్యం కానట్లుగా జరిగింది’ అంటూ యువ ఆటగాళ్లపై ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్ను ప్రకటించలేదు. తనకు నచ్చిన, ఎంపిక చేసిన టోర్నీల్లోనూ అతను ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితం స్పెయిన్‌లో జరిగిన లియోన్ మాస్టర్స్‌లో అతను విజేతగా కూడా నిలిచాడు. ఒకవైపు ప్లేయర్‌గా కొనసాగుతూ మరో వైపు యువ ప్లేయర్లకు అతను మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా భారత జట్టుకు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచే సత్తా ఉందంటే అది ఈ జట్టుతోనే సాధ్యం అని ఒలింపియాడ్‌కు వెళ్లే ముందే ఆనంద్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించాడు. టీమ్‌లోని ఆటగాళ్లపై అతను చూపిన విశ్వాసం అది. దానిని వారంతా నిజం చేసి చూపించారు. ‘భారత చెస్‌లో అద్భుత సమయం నడుస్తోంది. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మనం కచ్చితంగా మంచి విజయాలు ఆశిస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే వారు మనందరి అంచనాలకు మించి రాణించారు. మున్ముందు ఇవి కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ఆనంద్ భావోద్వేగంతో అన్నాడు.ఒలింపియాడ్ బహుమతి ప్రదానోత్సవంలో ఆనంద్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. అతడిని వేదికపైకి ఆహా్వనిస్తూ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆనంద్‌ను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ చెస్ బూమ్’ అంటూ ప్రశంసలు కురిపించడం అతని విలువను చాటి చెప్పింది. ప్రధానమంత్రి ప్రశంస చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణాలు సాధించిన పురుషుల, మహిళల జట్ల ఘనతను ఆయన కొనియాడారు. ‘45వ చెస్ ఒలింపియాడ్‌లో అటు ఓపెన్, ఇటు మహిళల విభాగాల్లో టైటిల్స్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ రెండు టీమ్‌లకు కూడా నా అభినందనలు. భారత క్రీడల్లో ఇదో సరికొత్త అధ్యాయం. చెస్‌లో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉన్న ఉత్సాహవంతులకు కొన్ని తరాల పాటు ఈ ఘనత స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ అన్నారు. -
‘విషీ’ని దాటిన గుకేశ్
చెన్నై: 1986 జులై 1... చదరంగ మేధావి విశ్వనాథన్ ఆనంద్ భారత నంబర్‌వన్ ఆటగాడిగా మొదటిసారి గుర్తింపు తెచ్చుకున్న రోజు. నాటినుంచి ఇప్పటి వరకు అతనిదే అగ్ర స్థానం. అతని తర్వాత భారత్‌నుంచి పెద్ద సంఖ్యలో కుర్రాళ్లు సత్తా చాటుతూ వచ్చినా... వారితో పోటీ పడుతూ సత్తా చాటిన ఆనంద్ 37 సంవత్సరాలుగా ‘టాప్’లోనే నిలిచాడు. ఒక తరం పాటు ఆటను శాసించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆనంద్ ఇప్పుడు తొలిసారి తన భారత నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. 17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ఇప్పుడు టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) శుక్రవారం అధికారికంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రకటించింది. ఇందులో గుకేశ్ 8వ ర్యాంక్‌లో నిలవగా... విశ్వనాథన్ ఆనంద్ 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. గుకేశ్ రేటింగ్ 2758 కాగా, ఆనంద్ రేటింగ్ 2754గా ఉంది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సమయంలోనే ‘లైవ్ రేటింగ్’లో ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. అయితే ఇప్పుడు ‘ఫిడే’ ర్యాంకింగ్ ద్వారా అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. టాప్–30 ర్యాంకింగ్స్‌లో వీరిద్దరితో పాటు భారత్ నుంచి ఆర్. ప్రజ్ఞానంద (19), విదిత్ గుజరాతీ (27), అర్జున్ ఎరిగైశి (29) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేశ్ అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. -
విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్‌గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్‌కప్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023 -
చదరంగ విప్లవం ముంగిట్లో భారత్!
దశాబ్ద కాలంలోనే భారత్‌లో యాభై మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు అవతరించారు. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. చెస్‌కు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. అయితే దేశంలో చదరంగ విప్లవానికి ఇది నాంది మాత్రమే. మున్ముందు జరగాల్సింది చాలా మిగిలి ఉంది. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఇంకో భారతీయుడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడా? ఏమైనా, భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందని మాత్రం తప్పక చెప్పవచ్చు. బిందువు బిందువు సింధువైనట్లు... ముందు కొంతమంది యువ ప్రతిభావంతులు చెస్ గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగారు. ఆ తరువాత పరిపక్వత లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. భారతీయ చదరంగ చరిత్రలో డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద నేతృత్వంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. వీరితోపాటు ఎంతోమంది యువ కులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులను అధిరోహిస్తున్నారు. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ సందర్భంగా భారతీయ క్రీడా కారుల ఆటతీరును గమనించినప్పుడు ఇలాంటిది ఏదో జరగాలని మనం ఆశించాము. ఆ పోటీల్లో ఇండియా–బి బృందం ఓపెన్ కేటగి రిలో కాంస్య పతకం సాధించింది. మహిళా క్రీడాకారులు కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. అయితే ఫైడ్ చెస్ ర్యాంకింగ్‌లో గుకేశ్ టాప్–10లో ఒకడిగా ఎదగడంతో మిగిలిన వారు కూడా ఇప్పుడు మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదరంగంలో అతితక్కువ కాలంలో వచ్చిన ఈ గుణాత్మక మార్పునకు కారణాలు ఎన్నో. చెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. ఆటగాళ్లకూ, ఆటకూ ఎక్స్ పోజర్ కూడా బాగుంది. అత్యున్నతస్థాయి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యానికి కొరతే లేదు. దేశంలో చదరంగం మరింత ఎదిగేందుకు ఈ నైపుణ్యమే కీలకం. విస్తృతస్థాయిలో నైపుణ్యం ఉండటం పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కాస్తా ఆటగాళ్లు మరింత రాటుదేలేందుకు ఉపయోగ పడుతుంది. భారత్ తరఫున ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లేదా వరల్కప్ పోటీల్లో పాల్గొనాలంటే అత్యున్నత స్థాయి ఆట ఆడాల్సి ఉంటుంది. మనకేం ఫర్వాలేదు అనుకునే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. అందరూ ముంగాళ్లపై నుంచోవాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే. ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూంటారు. మంచి మిత్రులే కానీ, ఆట విషయానికి వస్తే మాత్రం ఎవరి గుట్లు వారి వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆ రహస్యాలే వారికి ఏదో ఒక రోజు విజయాన్ని సంపాదించి పెట్టవచ్చు. ఇక్కడ చాలామంది టాప్ ర్యాంకింగ్ ఆటగాళ్లను మాత్రమే చూస్తున్నారు. కానీ కింది స్థాయిలోనూ చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నేను భారతదేశంలో నంబర్ వన్ (1986 జూలై ఒకటవ తేదీన 2405 ఎలో రేటింగ్‌తో ప్రవీణ్ థిప్సే కంటే ముందుకు వెళ్లినప్పుడు)గా మారినప్పుడు దరిదాపుల్లో ఇంకో ఆటగాడు కనిపించలేదు. 1988లో ఇరవై ఏళ్ల వయసులో నేను గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు పోటీల గురించి కాకుండా, రానున్న మూడేళ్లలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎలా అని ఆలోచించాను. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి! 1988లో నేను గ్రాండ్ మాస్టర్‌గా అవతరిస్తే, మూడేళ్ల తరువాత 1991లో దివ్యేందు బారువా ఆ ఘనత సాధించాడు. ప్రవీణ్ థిప్సే 1997 నాటికి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు పరిస్థితిలో చాలామార్పు వచ్చింది. 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు 50 మంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగారు. ఎలో రేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉన్న భారతీయ గ్రాండ్ మాస్టర్లు (పాక్షికంగా రిటైరైన నాతో కలిపి) ఆరుగురు ఉన్నారిప్పుడు. గ్రాండ్ మాస్టర్ కావడం చాలా గొప్పవిషయమే అయినప్పటికీ ప్రస్తుతం సాధారణమైపోయింది. మారుతున్న కాలానికి నిదర్శనం ఇది. ఈ తరానికి ఇంకో సానుకూల అంశమూ ఉంది. నాకున్న దశాబ్దాల అనుభవంపై వారు ఆధారపడవచ్చు. అలాగే ఎందరో చెస్ గురు వుల ప్రస్థానాల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చాలా కీలకం. కానీ మాలాంటివాళ్లం ఈ తరం ఆటగాళ్లకు మార్గ దర్శనం మాత్రమే చేయించగలం. టాప్ లెవల్ ఆటగాళ్లందరికీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి ఆటగాళ్లను వేరు చేసే అంశాలు వారి ప్రవర్తన, నిత్యం ఉన్నతస్థాయి ఆటను కొనసాగించగలగడం, శారీరక దారుఢ్యం, ఒత్తిడికి లోనుకాకపోవడం. అంతేకాదు... ఆట విషయంలో సమగ్రత కూడా చాలా అవసరం. ప్రత్యర్థి ఎప్పుడు ఏ రకమైన సవాలు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండటం అవసరం. కొంతమంది ప్రత్యర్థులు మీరు తయారైన దానికంటే భిన్నమైన రీతిలో దాడికి దిగవచ్చు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? దేనిపై ఆధారపడతారు? మీ లెక్కకు చిక్కని విషయమని భావిస్తారా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే బాగా శ్రమించడం అన్నదానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎలో రేటింగ్ 2700కు చేరుకోవడం కూడా ఈ శ్రమలో భాగమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. భారతీయ చదరంగం కేవలం పురుషులకు మాత్రమే చెందింది కాదు. దేశంలో చదరంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే మహిళా క్రీడాకారులు కూడా బాగా రాణించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్యలో చాలా అంతరం ఉంది. భారత్‌లోనే కాదు... ప్రపంచం మొత్తమ్మీద ఇదే పరిస్థితి. ఈ అంత రాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాడమీ ఏర్పాటు ద్వారా మేమీ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తామన్న నమ్మ కమూ ఉంది. కోనేరు హంపి, డి.హారిక, ఇతరుల స్థాయుల మధ్య చాలా అంతరం ఉంది. ఉన్నత స్థానంలో ఏళ్ల తరబడి కొనసాగేందుకు తగిన జ్ఞానం హారిక, హంపికి ఉంది. అయితే మిగిలిన వారు సమీప భవిష్యత్తులోనే వీరికి సవాలు విసరగలరని ఆశిస్తున్నా. ఒకే ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు కదా! అసలైన విప్లవం అందరినీ తోడుతీసుకునే మొదలవుతుంది. గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ చదరంగంలో మారుతున్న తరానికి ప్రతినిధులు. నా అనుభవం వారికి ఉపయోగపడుతుంది కానీ, వారు తమ సొంత మార్గంలో మరింత దూరం ప్రయాణించడం అలవర్చు కోవాలి. తమ సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. కొత్త హోదా, హంగు ఆర్భాటాలకు వారిప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. ఎదురుదెబ్బలూ వారికి ఎదురు కావచ్చు. ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కాకపోతే వీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం సరైందనే చెప్పాలి. మిగిలినవి ఎలా ఉన్నా ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత దేశ చదరంగం ఒక్కో అడుగే ముందుకేయాలి. ఎదుగుతున్నప్పటికీ అందుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. విçస్తృతమైన, లోతైన వ్యవస్థ అక్కరకొచ్చే అంశం. కాలం గడుస్తున్న కొద్దీ ఒకదానికి ఒకటి పూరకంగా వ్యవహరిస్తాయి. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారా? ఇంకో భారతీ యుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఒకే మాట చెప్పవచ్చు. భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందీ అని! విశ్వనాథన్ ఆనంద్ వ్యాసకర్త ప్రపంచ ఛాంపియన్ షిప్ ఐదుసార్లు నెగ్గిన చదరంగ క్రీడాకారుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రపంచకప్‌లో అదుర్స్.. ఇదో చారిత్రక ఘట్టం: భారత చెస్ దిగ్గజం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్ చేరతాడు. తొలి గేమ్‌లు డ్రా మరో క్వార్టర్స్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 48 ఎత్తులో గుకేశ్ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్ ఫైనల్ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విదిత్ గుజరాతీ (భారత్), నిజాత్ అబసోవ్ (అజర్ బైజాన్) మధ్య గేమ్ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్ డొమినెగ్వెజ్ పెరెజ్ (అమెరికా) మధ్య గేమ్ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి. ఇదో చారిత్రక ఘట్టం మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్‌గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్‌కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే?
ప్రతి ఆటకూ ఒకరు టార్చ్‌బేరర్ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్ని ఇస్తుంది.. భారత్ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్ ఆనంద్.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్ లేకుండా భారత చెస్ లేదు..ఇప్పుడు భారత్‌లో 79 మంది గ్రాండ్‌మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’.. ‘ఆనంద్‌లాంటి వ్యక్తులు చాలా అరుదు. రోజుకు 14 గంటలు కష్టపడితే చెస్‌లో నైపుణ్యం సంపాదించవచ్చు. కొన్ని విజయాలూ అందుకోవచ్చు. కానీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలంటే అసాధారణ, సహజ ప్రజ్ఞ ఉండాలి. అది ఆనంద్‌లో ఉంది. అందుకే ఆయన ఆ స్థాయికి చేరారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’.. ఆనంద్ తర్వాత భారత రెండో గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు బారువా చేసిన వ్యాఖ్య ఇది. దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్ క్రామ్నిక్.. మొదలైన వారికి సవాల్ విసురుతూ ఆనంద్ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు. ఆమె అండగా.. అమ్మ సుశీల ఆనంద్‌కు చెస్‌లో ఆది గురువు. 80ల్లో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్ అంటే ‘ఏం భవిష్యత్ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్ తల్లికి చదరంగం అంటే ఇష్టం ఉన్నా.. కొడుకును బలవంతపెట్టలేదు. కానీ ‘చైల్డ్ ప్రాడజీ’లాంటి తన కొడుకులో చురుకుదనాన్ని ఆమె గుర్తించింది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఆనంద్‌ను చెస్‌లోకి తీసుకొచ్చింది. తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది. తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్‌లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు. ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్ కిడ్’ అంటూ చెస్ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. వరుస విజయాలతో.. 14 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియ¯Œ గెలవడం మొదలు ఆనంద్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్ చాంపియన్, 18 ఏళ్ల వయసులో వరల్డ్ జూనియర్ చాంపియన్ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది. ఆనంద్ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా విశ్వనాథన్ ఆనంద్ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపింది. అందరికీ ఇష్టుడు.. ‘వై దిస్ నైస్ గై ఆల్వేస్ విన్ ’.. విశ్వనాథన్ ఆనంద్ గురించి చెస్ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు. అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్‌గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్ ఆడాడు. నిర్వాహకులు కూడా అమితాశ్చర్యంతో ‘మ్యాచ్‌ను వాయిదా వేసేవాళ్లం కదా’ అన్నా వారికీ చిరునవ్వే సమాధానమైంది. రష్యా రాజకీయాల్లో కాలు పెట్టి తీవ్ర వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న కాస్పరోవ్లా ఆనంద్ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది. సాధించిన ఘనతలెన్నో.. 2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్‌ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్’ ఈవెంట్లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. ర్యాపిడ్ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్‌లో తన ముద్ర వేయడం ఆనంద్‌కే చెల్లింది. 2000లో వరల్డ్ బ్లిట్జ్ కప్ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్ ఫార్మాట్, మ్యాచ్ ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్, ర్యాపిడ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లు మాత్రమే కాదు కోరస్ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్ మెమోరియల్, లినారెస్ చెస్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్‌రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్’ అంటూ తన అనుభవాలతో భారత్ చెస్‌కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్ కెరీర్ ఆద్యంతం స్ఫూర్తిదాయకం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
స్వతంత్ర భారతి1988/2022
తొలి గ్రాండ్ మాస్టర్ భారతదేశపు తొలి గ్రాండ్ మాస్టర్‌గా మద్రాసుకు చెందిన విశ్వనాథన్ ఆనంద్ అవతరించారు. అప్పటికి ఆయన వయసు 18. ఆ ముందు ఏడాదే ఆనంద్, భారతదేశపు తొలి ‘వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్’ అయ్యారు. గ్రాండ్ మాస్టర్ పోటీలు కోయంబత్తూరులో జరిగాయి. ‘సాక్షి ఫైనాన్స్’ ఆ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించింది. ఆ టోర్నమెంట్లో రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఎఫిమ్ గెల్లర్ మీద ఆనంద్ విజయం సాధించడం విశేషం. ఆనాటి నుంచే భారతదేశంలో చెస్‌కు ఒక గుర్తింపు వచ్చింది. ప్రపంచ చెస్‌లో భారతదేశానికీ ఒక గుర్తింపు వచ్చింది. ఇదే ఏడాదికి మరికొన్ని పరిణామాలు – ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. – జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పడింది. – ఖాతాదారుల క్రెడిట్ రికార్డును అనుసరించి ఛార్జీలు విధించే -వెసులుబాటు బ్యాంకులకు లభించింది -
చైతన్య భారతి: చిచ్చర పిడుగు... విశ్వనాథ్ ఆనంద్ / 1969
ఢిల్లీలో జాతీయ జూనియర్ సంఘం చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అది 1983. విశ్వనాథ్ ఆనంద్‌ను నేను మొదటిసారిగా కలుసుకున్న సందర్భం కూడా అదే. టోపీ పెట్టుకున్న ఓ సన్నటి కుర్రాడు పోటీలు జరుగుతున్న ఆవరణలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతని చదరంగం ఆటను మొట్టమొదటిసారిగా నేను అక్కడే చూశాను. అతను మెరుపు వేగంతో ఆడుతున్నాడు. నాకతని ఆట చూడగానే కలిగిన అభిప్రాయం అది. అతను అతి చురుకుగా, నిర్దుష్టంగా, ఆట ఆడుతున్నాడు. అతనికి మేమంతా వెంటనే ‘చిచ్చర పిడుగు’ అని పేరు పెట్టేశాం. ఆ వేగం అతని హావభావాల్లో కూడా కనిపిస్తోంది. అతను ఒక చోట నిలకడగా కూర్చొని ఆడడు. ఆడుతున్నంత సేపూ అలా తిరుగుతూనే ఉంటాడు. 1992లో నేనతన్ని మరోసారి కలిశాను. అప్పుడు నేనే అతనితో ఆడాను. 1980లలో, 1986 వరకు అతను ఓడించలేని వ్యక్తేమీ కాదు. అతనితో నేడు ఆడటమే కాదు, కొన్ని ఆటల్లో గెలిచాను కూడా! 1992లో అతన్ని నేను చూసినప్పుడు మాత్రం అతను తన ఆటలో బాగా పురోగతి సాధించాడనిపించింది. అతను మారినట్లే అతని ఆట కూడా మరో స్థాయికి చేరుకుంది. చిచ్చర పిడుగు దశ నుంచి అతను మరింత నిబ్బరంగా ఆడే స్థాయికి చేరుకున్నాడు. అసలు సిసలు గ్రాండ్ మాస్టర్‌గా మారిపోయాడు. ఆ మార్పు 1986 లోనే వచ్చిందనిపించింది. 1987 నాటికి అది స్థిరపడింది. అప్పుడు అతను ప్రపంచ జూనియర్ చాంపియన్ అయ్యాడు. అతనిలో అంతర్లీనంగా గ్రాండ్ మాస్టర్ కాగల లక్షణాలన్నీ ఉన్నాయి. ఆనంద్ అక్షరాలా బాల మేధావి. ఈ రంగంలో రష్యా ఆధిపత్యానికి ఆనంద్ చరమ గీతం పాడాడు. అంతకు ముందు ఆ పని బాబీఫిషర్ చేశాడు. గ్యారీ కాస్పరోవ్, అనాతొలి కార్పోవ్, లాదిమర్ క్రామ్నిక్ల ఆధిపత్యాన్ని నిలదీసిన వ్యక్తి ఆనంద్. ఆ రోజుల్లో చదరంగంలో భారత్‌కు అంతగా పేరు లేదు. అందువల్ల ఆనంద్ విజయం భారత ప్రతిష్టను ఆకాశానికెత్తేసింది. అతని విజయానికి అతని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కారణం. విశ్వనాథ్‌కి వచ్చిన అవార్డులు దివ్యేందు బారువా, చదరంగంలో గ్రాండ్ మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత తదితరాలు. (చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833) -
Norway Chess 2022: ఆనంద్‌కు మూడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానంతో ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 52 ఏళ్ల ఆనంద్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్, కార్ల్సన్ (నార్వే) 16.5 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకోగా... మమెదైరోవ్ (అజర్బైజాన్) 15.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. చాంపియన్ కార్ల్‌సన్‌కు 7,50,000 నార్వే క్రోన్లు (రూ. 60 లక్షల 36 వేలు), రన్నరప్ మమెదైరోవ్కు 4,00,000 నార్వే క్రోన్లు (రూ. 32 లక్షల 19 వేలు), మూడో స్థానంలో నిలిచిన ఆనంద్‌కు 2,50,000 నార్వే క్రోన్లు (రూ. 20 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Norway Chess: ఆనంద్ అదరహో
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ఆనంద్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం సాధించాడు. క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటిస్తారు. రెగ్యులర్ గేమ్‌లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్‌లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్సన్తో అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్‌లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్‌లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్సన్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో విజయం
Norway Chess tournament: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ఆనంద్–వాంగ్ హావో (చైనా) మధ్య మూడో గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం కోసం ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ 44 ఎత్తుల్లో వాంగ్ హావోను ఓడించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంజుమ్ రజత గురి బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మూడో రజత పతకం చేరింది. శుక్రవారం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల అంజుమ్ 12–16 పాయింట్ల తేడాతో రికీ ఇబ్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఎని మిది మంది షూటర్ల మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో రికీ ఇబ్సెన్ 411.4 పాయింట్లు, అంజుమ్ 406.5 పాయింట్లు స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. చదవండి: Sakshi Malik: ఐదేళ్ల తర్వాత పసిడి పతకంతో మెరిసింది! -
Superbet Rapid Chess: సూపర్‌బెట్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్‌బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. శనివారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్ రాపోట్ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్ క్రిస్టాఫ్ (పోలాండ్) మూడో స్థానంలో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్ విభాగంలో టోర్నీ జరుగుతుంది. -
Superbet Rapid Chess: ఆధిక్యంలో ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరు రౌండ్ల తర్వాత ఆనంద్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. శుక్రవారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ రెండు విజయాలు (షెవ్చెంకో, లెవాన్ అరోనియన్), ఒక ‘డ్రా’ (జాన్ క్రిస్టాఫ్ డూడా) నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయిస్తున్నారు. -
చెస్ ఒలింపియాడ్‌కు జట్లను ప్రకటించిన భారత్..
చెన్నై: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత జట్లను అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్’ హోదాలో మార్గనిర్దేశనం చేయనుండటం విశేషం. ‘గత కొంత కాలంగా నేను చాలా తక్కువ టోర్నీల్లోనే పాల్గొంటున్నాను. పైగా ఎన్నో ఒలింపియాడ్స్ ఆడాను కాబట్టి కొత్తతరం ఆటగాళ్లు బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లతో టీమ్ ‘ఎ’ను, వర్ధమాన ఆటగాళ్లతో టీమ్ ‘బి’ను ఎంపిక చేశారు. 2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్లైన్లో జరిగిన టోర్నీలో రష్యాతో భారత్ సంయుక్త విజేతగా (2020) నిలువగా... 2021లో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది. భారత జట్ల వివరాలు ఓపెన్: భారత్ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్ఎల్ నారాయణన్. భారత్ ‘బి’: నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని. మహిళలు: భారత్ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. భారత్ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్. -
చెస్ ఒలింపియాడ్: అగ్ర స్థానంలో భారత్
చెన్నై: ‘ఫిడే’ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ గురువారం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. మాజీ ప్రపంచ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వంలోని భారత్ నాలుగో రౌండ్లో 5–1తో చైనాపై, ఐదో రౌండ్లో 4–2తో అజర్‌బైజాన్‌పై, ఆరో రౌండ్లో 3.5–2.5తో బెలారస్‌పై విజయం సాధించింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి ఓడిపోగా... పెంటేల హరికృష్ణ సహా మరో నలుగురు గెలుపొందారు. అజర్‌బైజాన్‌తో జరిగిన పోరులో హంపి గెలుపొందగా, ఆనంద్, ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకున్నారు. బెలారస్‌తో మ్యాచ్‌లో ఆనంద్, భక్తి కులకర్ణి విజయం సాధించారు. చదవండి: సౌరవ్ గంగూలీపై ‘బయోపిక్’ -
‘ఆనంద్‌ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’
ముంబై: ఆ ఆటగాడు చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆడిన చెస్ గేమ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌ను ఓడించాడు. ఈ విజయం చాలా మందిని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామత్ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV — Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 చదవండి: గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. -
విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా?
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగం పోరులో ఎత్తుకు పైఎత్తు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ గేమ్ జరగనున్నట్లు chess.com ప్రకటించింది. ఈ గేమ్‌ను chess.com తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. The moment you all have been waiting for! Superstar Aamir Khan, an ardent chess lover, will be playing an exhibition match against former world champion Vishy Anand! (@vishy64theking) Please feel free to donate generously to make this event a success. https://t.co/mgOmSwr54n pic.twitter.com/YFyK1oeka2 — Chess.com - India (@chesscom_in) June 7, 2021 'చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. చెస్ లవర్ అయిన సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి' అంటూ చెస్.కామ్ ట్వీటర్ ద్వారా పిలుపునిచ్చింది. గతంలో ఈ ఇద్దరూ చెస్ ఆడిన ఫొటోను ఓ అభిమాని కామెంట్స్‌లో షేర్ చేశాడు. ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ల మధ్య సాగబోయే ఈ గేమ్ రసవత్తరంగా సాగబోతుందంటూ ఆ అభిమాని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, కోవిడ్‌పై పోరులో భాగంగా విరాళాలు సేకరించేందుకు ఇద్దరు ప్రముఖ పర్సనాలిటీల మధ్య గేమ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్‌కు చెక్‌మేట్ కోవిడ్ అనే పేరు పెట్టారు. కోవిడ్‌తో బాధపడుతున్న చెస్ ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈవెంట్ జరిగే రోజు ఆమీర్ ఖాన్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఆనంద్‌తో చెస్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి -
చెస్ మాస్ట్రో విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్ (92 ) ఇక లేరు. స్వల్ప అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మాజీ జనరల్ మేనేజర్ (సదరన్ రైల్వే) విశ్వనాథన్‌కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉంది. తన పరిమితమైన సాలరీతోనే ఆనంద్‌కు ఏలోటూలేకుండా చూసుకున్నారు. దేశ విదేశాల్లో పలుపోటీల్లో పాల్గొనేలా శ్రద్ధ వహించారు. నిరాడంబరమైన జీవితం, ఉన్నత విలువలను పాటించిన ఆయన తన కుమారుడు ఆనంద్ కూడా అదే బాటలో పయనించేలా కృషి చేశారు. ఆనంద్ చెస్‌లో ఈ స్థాయికి చేరడంలో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉందని ఆనంద్ భార్య అరుణ ఆనంద్ చెప్పారు. అదృష్టవశాత్తూ ఆనంద్ అన్ని వరల్డ్ చాంపియన్‌షిప్ విజయాలను విశ్వనాథన్ కళ్లారా చూశారన్నారు.. తన భర్త ఉన్నతికి ఆయన ఎపుడూ గర్వపడేవారని, అలాగే చివరివరకు ప్రౌడ్ రైల్వే ఉద్యోగిగా ఉన్నారని ఆమె నివాళులర్పించారు. కాగా ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ 2015, మేలో మరణించిన సంగతి తెలిసిందే. -
హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు
న్యూఢిల్లీ: భారత చెస్ దిక్సూచి విశ్వనాథన్ ఆనంద్. చదరంగంలో ఎవరూ ఊహించలేని ఎత్తులు పైఎత్తులతో అద్భుత విజయాలు సాధించిన ఆనంద్ భారత చెస్ ప్రపంచానికి ‘కింగ్’. అంకిత భావం, క్రమశిక్షణతో మెలిగే విషీ అందరికీ ప్రపంచ చాంపియన్‌గా, మేటి చెస్ క్రీడాకారుడిగానే తెలుసు. ఆట తప్ప మరో లోకం లేని ఆనంద్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆనంద్ గురించి తెలుసుకోవాలనేది అభిమానులందరి ఆశ. అందుకే మనకెవరికీ తెలియని ఈ దిగ్గజ క్రీడాకారుడి వ్యక్తిగత జీవితం, సరదాలు, సంతోషాలు, ప్రొఫెషనల్ కెరీర్ గురించి త్వరలోనే సినిమా రాబోతుంది. ఈ బయోపిక్ ‘తనూ వెడ్స్ మనూ’ సినిమా తీసిన డైరెక్టర్ అనంద్ రాయ్ దర్శకత్వంలో రానుంది. ఈ సందర్భంగా తన బయోపిక్ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలనుకుంటున్నాడో స్వయంగా ఆనంద్ మాటల్లోనే... 25 శాతం మాత్రమే తెలుసు... నాణ్యమైన చిత్రబృందం ఈ బయోపిక్‌ను తెరకెక్కించనుంది. కెమెరాతో వారు సృష్టించే అద్భుతాలను కనీసం నేను ఊహించలేను. అందుకే సినిమా గురించి పూర్తిగా వారికే వదిలేశా. సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై నాకున్న అవగాహన కేవలం 25 శాతం మాత్రమే. తెరపై చూసినప్పుడు ఇది నా కథ అనే భావన నాకు కలిగితే చాలు. కాస్త వినోదాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాను అభిమానులు ఎలా ఆదరిస్తారో అని తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. నా బయోపిక్ చెస్‌ను సరళమైన ఆటగా చూపించాలి కానీ ఆటలోని తీవ్రతను తీసేయకూడదు అని అనుకుంటున్నా. మేం ఏలియన్స్ కాదు.. సాధారణ వ్యక్తులమే... సినిమాలో నా వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు ప్రేక్షకులకు నేను కొత్తగా కనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా నేనెప్పుడూ దాని గురించి బయటికి మాట్లాడలేదు. సినీ, క్రీడా తారలు, రాజకీయ ప్రముఖుల గురించి మనకు అంతా తెలుసు అని ప్రజలు అనుకుంటారు. నిజానికి వారి గురించి బయటివారికి ఏమీ తెలిసుండదు. చెస్ నాకెంత ముఖ్యమో తెలిసినవారంతా... నేను నిరంతరం ఆట గురించే ఆలోచిస్తా అని అనుకుంటారు. క్రీడాకారుడిగా నన్ను గమనించే వారికి వ్యక్తిగా నేనేంటో తెలియదు. ఈ చిత్రం చూశాక చెస్ ప్లేయర్లు ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) కాదు సాధారణ వ్యక్తులే అనే భావనకు వస్తారు. గ్రాండ్‌మాస్టర్ జీవితాన్ని ఆవిష్కరించాలి... భారీ ప్రేక్షక గణాన్ని దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు సినిమాలు చేస్తారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో ప్రేక్షకులు సినిమా చూస్తారు. కానీ నేను సినిమా ఎలా ఉండాలనుకుంటున్నానంటే.. సినిమా చూశాక ‘హా ఇదే కదా నేనూ అనుభవించింది’ అని నా మనసుకు అనిపించాలి. ప్రేక్షకుడికి చెస్ ప్రామాణికత, ఆటలోని తీవ్రత కచ్చితత్వంతో తెలిసేలా ఉండాలి. ఏకాగ్రత అనేది ఒక పోరాటం. అందరూ అందులో ప్రావీణ్యం సంపాదించలేరు. చెస్ ఆటగాడు బోర్డు ముందు కూర్చున్నప్పుడు అతను నిశ్శబ్ధంగా చేసే పోరాటాన్ని ప్రేక్షకుడు గ్రహించేలా సినిమా ఉండాలి. హీరో ఎవరో మరి! ఇప్పటికీ నా పాత్రను పోషించే నటుడెవరో తెలియదు. మిగతా తారాగణం, షూటింగ్ షెడ్యూల్ గురించి తెలియదు. రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా పూర్తిగా చూసింది లేదు. నిజానికి అతని సినిమాలు చూసి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా సినిమాలు పెద్దగా చూడను. వంటలకు సంబంధించిన కార్యక్రమాలకు నేను అభిమానిని. డేవిడ్ అటెన్బారో డాక్యుమెంటరీలు చూస్తా. ఈ మధ్య బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ డాక్యుమెంటరీ ‘ద లాస్ట్ డ్యాన్స్’, చెస్ వెబ్ సిరీస్ ‘ద క్వీన్స్ గాంబిట్’ వీక్షించా. (చదవండి: నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) -
ఇకనైనా గుర్తించాలి
చెన్నై: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో మనోళ్లు అడుగుపెడితే పతకాలతోనే తిరిగి రావడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ చెస్ క్రీడాకారుల విజయాలను మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని క్రీడాధికారులు గుర్తించడం లేదు. అందుకే ఏడేళ్లుగా ఒక్క చెస్ ప్లేయర్‌కు ‘ఖేల్‌రత్న’గానీ, ‘అర్జున అవార్డు’గానీ, కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డుగానీ, చెస్ క్రీడాభివృద్ధికి పాటుపడిన వారికి ‘ధ్యాన్‌చంద్’ అవార్డుగానీ రాలేదు. అయితే ఆదివారం ముగిసిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో కనబరిచిన ప్రదర్శనతో వచ్చే ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్ ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయని భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల ముఖాముఖి టోర్నీలు లేకపోవడంతో ఆన్లైన్ ఒలింపియాడ్ నిర్వహించగా భారత్... రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ ఓ ఇంటర్వూ్యలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ► ఒలింపియాడ్ విజయంతో చెస్‌పట్ల అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. చెస్ ఆటగాళ్లకు ‘అర్జున’, కోచ్‌ల ‘ద్రోణాచార్య’ అవార్డులు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. కొన్నిసార్లు కొందరికి మన ఉనికిని చాటు చెప్పాల్సి ఉంటుంది. తాజా ఒలింపియాడ్ స్వర్ణంతో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నాను. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో చెస్ క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ అస్సలు గుర్తించడం లేదు. ► ఇక అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సమాఖ్య వారు ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలపై సుదీర్ఘ లేఖలు రాసే బదులు ఇలాంటి విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించాలి. ► ఈ టోర్నమెంట్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నిజానికి నేను జట్టును ముందుండి నడిపించాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ముఖాముఖిగా జరగాల్సిన రెగ్యులర్ చెస్ ఒలింపియాడ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాని బదులు ఆన్లైన్లో నిర్వహించడం నిజంగా అద్భుతం. ఈ 2020లో ముఖాముఖి టోర్నీలకైతే చోటే లేదు. దీంతో ఈ ఏడాది ఆసాంతం ఇక ఆన్లైన్ టోర్నీలే నిర్వహించాలి. ► భారత క్రీడాకారులంతా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. నేను ఆట మధ్యలో సహచరుల ఎత్తుల్ని గమనించాను. నిజంగా ప్రతి ఒక్కరు వేసిన ఎత్తులు నన్ను ఆశ్చర్యపరిచాయి. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. -
విశ్వనాథన్ ఆనంద్ బోణీ
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్, భారత నంబర్‌వన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుసగా స్విద్లెర్, కార్ల్సన్, క్రామ్నిక్, అనీశ్ గిరి, పీటర్ లెకో, నెపోమ్నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్ ఏడో రౌండ్ గేమ్‌లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ గెల్ఫాండ్ బోరిస్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్‌లో ఆనంద్ 2.5–0.5తో బోరిస్‌పై నెగ్గాడు. -
ఆనంద్‌కు రెండో ఓటమి
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నమెంట్లో భారత దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్ పోరులో ఆనంద్ 1.5–2.5తో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) చేతిలో ఓడాడు. ‘బెస్ట్ ఆఫ్ ఫోర్’ గేమ్స్ పద్ధ్దతిన జరిగిన ఈ మ్యాచ్‌లో... ఆనంద్ తొలి మూడు గేమ్స్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే చివరి గేమ్‌లో ఓడటంతో విజయం కార్ల్సెన్ ఖాతాలో చేరింది. తొలి రౌండ్లో పీటర్ స్విడ్లర్ (రష్యా) చేతిలో ఆనంద్ ఓడాడు. మూడో రౌండ్లో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో ఆనంద్ తలపడతాడు. -
మూడు నెలల తర్వాత...
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎట్టకేలకు భారత చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ శనివారం స్వదేశానికి చేరుకున్నాడు. కరోనా నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించడంతో ఆనంద్ మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయాడు. శుక్రవారం రాత్రి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో (ఏఐ–120) బయల్దేరిన ఆనంద్ ఢిల్లీ మీదుగా శనివారం మధ్యాహ్నం బెంగళూరులోకి కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య అరుణ ధ్రువీకరించింది. చాలా రోజుల తర్వాత భారత్‌కు రావడం పట్ల ఆనంద్ సంతోషంగా ఉన్నాడని తెలిపిన ఆమె... కర్ణాటక నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసి తమ స్వస్థలమైన చెన్నైకి చేరుకుంటాడని పేర్కొంది. -
ఒక విజయం... ఒక ‘డ్రా’
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో శుక్రవారం భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2.5–1.5తో విజయం సాధించిన భారత్... ఆ తర్వాత యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ తమ గేముల్లో గెలిచారు. ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించగా... విదిత్ ఓటమి చవిచూశాడు. యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విదిత్ తన గేమ్‌లో నెగ్గగా, హరికృష్ణ ఓడిపోయాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్లు ముగిశాక భారత్ నాలుగో స్థానంలో ఉంది. -
ఆన్లైన్లో అంతర్జాతీయ చెస్ టోర్నీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్లైన్లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. మే 5 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, రష్యా, యూరప్, చైనా, అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు పాల్గొంటాయి. ర్యాపిడ్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ముందుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 10న సూపర్ ఫైనల్ జరుగుతుంది. ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఒక మహిళా క్రీడాకారిణికి స్థానం తప్పనిసరి. మొత్తం లక్షా 80 వేల డాలర్ల (రూ. కోటీ 38 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. చెస్ దిగ్గజాలు, ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్ తదితరులు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. -
కరోనా టైమ్స్: ఆనంద్‌తో చెస్ ఆడే ఛాన్స్!
అబుదాబి: కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఆరుగురు అగ్రశ్రేణి భారత చెస్ ఆటగాళ్లు ముందుకొచ్చారు. ఆన్లైన్లో చెస్ ఆడటం ద్వారా వచ్చిన సొమ్మును పీఎం కేర్స్ అందిస్తామని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా చెప్పారు. ఆనంద్‌తో పాటు మొత్తం ఐదుగురు ఆటగాళ్లు యూఏఈ వేదికగా ఏప్రిల్ 11 న (శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో చెస్ ఆడనున్నారు. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, పి.హరికృష్ణ, ద్రోణవల్లి హారికతో పాటు.. విశ్వనాథన్ ఆనంద్, బి.అధిబన్, విదిత్ గుజరాతి ఆన్లైన్ గేమ్‌లో భాగమవుతారు. chess.com పోర్టల్ ద్వారా ఈ గేమ్ నిర్వహిస్తారు. కాగా, భారత టాప్ చెస్ ప్లేయర్లతో ఆడాలనుకు వారు 25 డాలర్లతో పేరు నమోదు చేసుకోవాలి. కనీసం 150 అమెరికన్ డాలర్లు చెల్లించినవారు కచ్చితంగా ఆనంద్‌తో ఆడే అవకాశం దక్కించుకుంటారు. లేదంటే ఎవరైనా ఇద్దరు భారత ఆటగాళ్లతో (ఆనంద్ సహా) తలపడే వీలుంది. ‘నూతన ప్రయత్నాలు చేసేందుకు ఇవే మంచి సమయాలు. ఇంటి వద్ద ఉన్నప్పుడు సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. చెస్ ఫ్యామిలీ బాండ్ ఉన్న ఆట. దీనిని బోర్డుపైనా, ఆన్లైన్లో కూడా ఆడొచ్చు’అని ఆనంద్ పేర్కొన్నారు. కాగా, గతవారం ఆనంద్‌తోపాటు మరో 48 మంది క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించాలని ప్రధాని వారికి విజ్ఞప్తి చేశారు. ఇక భారత్ వ్యాప్తంగా 4 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. ఇదిలాఉండగా.. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆనంద్ జర్మనీలో చిక్కుకు పోయారు. -
విశ్వనాథన్ ఆనంద్ ‘మైండ్‌మాస్టర్’ విడుదల
చెన్నై: భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రాసిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం శుక్రవారం విడుదలైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ది హిందు’ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ లాంఛనంగా ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని దీంతో ఎలాంటి మార్పులు సంభవించాయో పేర్కొన్నట్లు చెప్పాడు. -
‘ఈడెన్‌లో గంట ఎందుకు కొట్టానో తెలీదు’
కోల్‌కతా: గత కొంతకాలంగా నగరంలోని ఈడెన్ గార్డెన్లో గంట కొట్టిన తర్వాత మ్యాచ్‌ను ఆరంభించడం జరుగుతుంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు తొలి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్ ప్రారంభానికి తెరతీశారు. కాగా, రెండో రోజు ఆటలో ఈడెన్‌లో బెల్‌ను చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్‌తో కలిసి మాగ్నస్ కార్ల్సన్(నార్వే) మోగించాడు. అయితే తాను బెల్ ఎందుకు కొట్టానో తెలీదు అంటున్నాడు కార్లసన్. వరల్డ్ చాంపియన్ అయిన కార్ల్సన్ మాట్లాడుతూ.. తాను ఒక తెలివి తక్కువ వాడిలా ఆనంద్ పక్కన నిలబడి మాత్రమే గంటను కొట్టాననన్నాడు. తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని ఈ సందర్భంగా కార్ల్సన్ తెలిపాడు. టాటా స్టీల్ ర్యాపిడ్-బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా నగరంలో ఉన్న కార్ల్సన్.. ఆనంద్‌తో కలిసి గంటను కొట్టేందుకు బీసీసీఐ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ వచ్చి రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు గంటను మోగించారు. ‘ ఆనంద్ గంట కొట్టేటప్పుడు తెలివి తక్కువ వాడిలా పక్కన నిలబడ్డాను. అదే జరిగింది. నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. నేను క్రికెట్ గురించి ఇంకా నేర్చుకోవాలి. అసలు మ్యాచ్ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా. మ్యాచ్ అయిపోయిందా.. ఇంకా జరుగుతుందా అని అడిగా. మ్యాచ్ అయిపోయిందనే సమాధానం వచ్చింది. ఇక ప్రత్యర్థి జట్టుకు చాన్స్ లేదని ఆనంద్ చెప్పాడు’ అని కార్ల్సన్ పేర్కొన్నాడు. -
ఆనంద్ వేసిన ఎత్తులు...
న్యూఢిల్లీ: భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేసే ఎత్తుకు పైఎత్తులు, విజయాలు, గెలుపోటములకు సంబంధించిన పోరాటాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆనంద్ తన అనుభవాలకు అక్షర రూపమిచ్చాడు. ఇదే పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘మైండ్‌మాస్టర్’– విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఎ చాంపియన్స్ లైఫ్ (విజేత జీవితంలోని విజయ పాఠాలు) అనే పేరుతో డిసెంబర్ నెలలో మార్కెట్లోకి రానుంది. అదే నెల 11న అధికారికంగా ‘మైండ్‌మాస్టర్’ పుస్తకాన్ని లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పబ్లికేషన్ సంస్థ తెలిపింది. జర్నలిస్ట్ సుశాన్ నినన్కు తెలిపిన తన కెరీర్ అనుభవాలను ఆ విలేకరి అక్షరగ్రంథంగా మలచగా... దీన్ని హాచెట్ ఇండియా సంస్థ ముద్రించింది. -
ఆనంద్ గేమ్ డ్రా
షంకిర్ (అజర్బైజాన్): భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’ ఫలితమే ఎదురైంది. వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో సోమవారం తైముర్ రద్జబొవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన భారత ఆటగాడు గెలుపుకోసం చేసిన ఎత్తులేవీ ఫలించలేదు. దీంతో 33 ఎత్తుల వరకు సాగిన ఈ గేమ్ చివరకు డ్రాగా ముగిసింది. తాజా ఫలితంతో ఆనంద్ 4 పాయింట్లతో తైముర్తో పాటు ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ వేటలో మళ్లీ విజయవంతమయ్యాడు. సెర్గీ కర్యాకిన్ (రష్యా 4.5)తో జరిగిన గేమ్‌లో గెలుపొందిన కార్ల్సన్ 6 పాయింట్లతో ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ (రష్యా; 4.5)... డేవిడ్ నవర (చెక్ రిపబ్లిక్; 3.5)పై నెగ్గగా, అనిశ్ గిరి (నెదర్లాండ్స్; 2.5)... షకిరియార్ (అజర్బైజాన్; 3)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. -
‘అందువల్లే కోహ్లి నియంత్రణ కోల్పోయాడు’
కోల్‌కతా: భారతదేశంలో ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఐదుసార్లు వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. ఒక వ్యక్తి పరాయిదేశాన్ని పొగుడుతూ భారత్‌ను తక్కువ చేసి చూపించడం వల్లే కోహ్లి భావోద్వేగానికి గురై ఉండవచ్చన్నాడు. ఆ క్రమంలోనే తన నియంత్రణను కోల్పోయి పరాయి దేశం వెళ్లిపోవాల్సిందిగా సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చన్నాడు. ‘విరాట్ నియంత్రణ కోల్పోయాడనుకుంటా. కాస్త భావోద్వేగానికి గురై అలా ఆవేశాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. ఆ సమయంలో కోహ్లి మూడ్ సరిగా లేదనే అనుకుంటున్నా. ఆ విమర్శ చేసినప్పుడు అతడెలాంటి పరిస్థితిలో ఉన్నాడో? కాస్త సున్నితంగా, బలహీన క్షణాల్లో ఉన్నాడేమో. ఎంత నిగ్రహంగా ఉన్నా ఎప్పుడో ఓ సారి భావోద్వేగంతో కాస్త అతిగా స్పందిస్తుంటారు. నాకూ ఇలా జరగొచ్చు. ఇప్పటికే విరాట్‌పై చాలా విమర్శలొచ్చాయి. ఇక దీన్ని ఇక్కడితో ముగిస్తే మంచిది’ అని విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. -
పతకాలతో తిరిగి రావాలని...
బటూమి (జార్జియా): గతంలో ఎన్నడూలేని విధంగా సన్నద్ధత... పదేళ్ల తర్వాత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం... రెండేళ్ల తర్వాత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి పునరాగమనం... వెరసి సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఐదో సీడ్... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టుకూ ఐదో సీడ్ లభించింది. పురుషుల విభాగంలో 185 దేశాలు... మహిళల విభాగంలో 155 దేశాలు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్లో 11 రౌండ్లు జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. పురుషుల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1927లో... మహిళల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1957లో జరిగింది. ఆనంద్, హరికృష్ణ లేకుండానే... పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్ కృష్ణన్, ఆధిబన్, లలిత్ బాబు సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 2014లో కాంస్యం సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 2012లో హారిక, ఇషా కరవాడే, తానియా, మేరీఆన్ గోమ్స్, సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా ఉన్న భారత మహిళల జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆనంద్, హరికృష్ణలతోపాటు హంపి కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండటం... టోర్నీకి శిక్షణ శిబిరాలు నిర్వహించడం... టోర్నీ సందర్భంగా సన్నాహాల కోసం భారత జట్లకు తొలిసారి సెకండ్స్ (సహాయకులు)ను ఏర్పాటు చేయడంతో రెండు జట్లూ పతకాలతో తిరిగి వస్తాయని భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో అమెరికా, రష్యా, చైనా, అజర్బైజాన్... మహిళల విభాగంలో చైనా, రష్యా, ఉక్రెయిన్, జార్జియా జట్లతో భారత్‌కు గట్టిపోటీ లభించే అవకాశముంది. -
ఆనంద్‌కు ఆరో స్థానం
న్యూఢిల్లీ: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో గ్రిష్చుక్ (రష్యా), లాగ్రెవ్ (ఫ్రాన్స్)లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ఆనంద్‌కు ఆరో స్థానం లభించింది. గ్రిష్చుక్కు ఐదో స్థానం, లాగ్రెవ్కు ఏడో స్థానం లభించాయి. -
ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మొదట విజయంతో శుభారంభం చేసిన ఆనంద్ తర్వాత రెండో రౌండ్లో ఓడిపోయాడు. మూడో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్లో అమెరికాకు చెందిన హికరు నకమురపై 35 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్... ఫ్రాన్స్ ఆటగాడు మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్‌తో జరిగిన రెండో గేమ్‌లో 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. రష్యా ఆటగాడు సెర్గెయ్ కర్జాకిన్‌తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 29 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. దీంతో తొలిరోజు మూడు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ లభిస్తుంది. మరోవైపు మూడు గేముల్లోనూ గెలిచిన ఫాబియానో కరువానా (అమెరికా) ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. -
12 ఏళ్ల తర్వాత...
చెన్నై: సుదీర్ఘ విరామం అనంతరం భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్నాడు. అతడు 2006 లో చివరిసారిగా ఈ మెగా టోర్నీలో ఆడాడు. ఈసారి తాను ఒలింపియాడ్‌లో ఆడేందుకు సిద్ధం గా ఉన్నట్లు సూచించడంతో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆనంద్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచ చెస్ ఒలింపియాడ్ కోసం ఏఐసీఎఫ్ బుధవారం ఐదుగురు చొప్పున సభ్యులున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. పురుషుల జట్టుకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ప్రస్తుత 14వ ర్యాంకర్ విశ్వనాథన్ ఆనంద్ సార థ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, బి.అధిబన్, శశికిరణ్ ఉన్నారు. భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇషా కరవాడే, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్ ఉన్నారు. ఈ మెగా టోర్నీకి రామ్‌కో గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఏఐసీఎఫ్ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి. పురుషుల్లో 2,650 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న వారికి రూ. 2 లక్షలు, 2,600 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 1.50 లక్షలు... మహిళల్లో 2,400 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 1 లక్ష, 2,000 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 80 వేలు లభించనున్నాయి. ఇవికాక టోర్నీలో జట్టు స్వర్ణం నెగ్గితే రూ. 3 లక్షలు, రజతం నెగ్గితే రూ. 1.50 లక్షలు, కాంస్యం నెగ్గితే రూ. 75 వేలు ఏఐసీఎఫ్ తరఫున ఇవ్వనున్నారు. ఈ టోర్నీకి ముందు క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు చౌహాన్ తెలిపారు. -
సంయుక్తంగా రెండో స్థానంలో ఆనంద్
ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ చివరిదైన తొమ్మిదో రౌండ్లో సెర్గీ కర్జాకిన్ (రష్యా)పై 32 ఎత్తుల్లో గెలిచాడు. ఆనంద్‌తోపాటు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), నకముర (అమెరికా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా ఐదు పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. -
ఆనంద్ ఖాతాలో మరో ‘డ్రా’
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో ఆదివారం మమెదైరోవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
అనీశ్ గిరితో ఆనంద్ గేమ్ ‘డ్రా’
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరితో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ కేవలం 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో 14 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో... ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లతో అనీశ్ గిరి, సో వెస్లీ (అమెరికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
టాప్–6లో నిలుస్తాం
ముంబై: త్వరలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చే అవకాశం ఉందని వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ‘చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలిచే అవకాశముంది. రేటింగ్ పాయింట్లలో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఒలింపియాడ్‌లో ఉండే ఫార్మాట్ ప్రకారం చూస్తే మనం స్వర్ణం గెలిచే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. అయితే ఇతర జట్లూ బలంగా ఉన్నాయి. ఒలింపియాడ్‌లో నేను కూడా పాల్గొనాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
ఒలింపియాడ్‌కూ సిద్ధం
చెన్నై: ఇటీవలే ప్రపంచ చెస్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న భారత దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటానని చెప్పాడు. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ను శుక్రవారం ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు రాష్ట్ర చెస్ సంఘం (టీఎన్‌ఎస్‌సీఏ) ఘనంగా సత్కరించాయి. ఎంతో శ్రమ తర్వాత మళ్లీ వరల్డ్ చాంపియన్ టైటిల్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విషీ అన్నాడు. ‘చాలా కాలంగా ప్రపంచ చాంపియన్ అనే పిలుపుకు దూరమయ్యా. రెండేళ్లుగా నా ప్రదర్శన అనుకున్న రీతిలో లేదు. నేనాడిన చివరి రెండు ర్యాపిడ్ టోర్నీల్లోనూ రాణించలేకపోయాను. కానీ ఈసారి గెలుపు ఇచ్చిన ఆనందం వర్ణించలేనిది. ఈ టైటిల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ టైటిల్‌తో నా పేరు కూడా మారిపోతుంది. ఇక చెస్ ఒలింపియాడ్‌లో కూడా ఆడతా’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు టీమ్ ఈవెంట్లలో పాల్గొనని ఆనంద్ ఒలింపియాడ్‌లో ఆడటంపై ఆసక్తి కనబరచడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు ఏఐసీఎఫ్ రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందజేయగా, టీఎస్‌ఎస్‌సీఏ వెండి ప్రతిమతో సత్కరించింది. -
దీనిని గొప్ప ఘనతగా భావిస్తున్నా
చెన్నై: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు. ‘ఇంతటి పెద్ద ఈవెంట్లో నేను ఒక గేమ్ మాత్రమే ఓడాను. వరుసగా మూడు రోజులు ర్యాపిడ్ ఆడి ఆ వెంటనే రెండు రోజులు 21 బ్లిట్జ్ గేమ్‌లు ఆడాల్సిన స్థితిలో దానిని పెద్ద ఘనతగా చెప్పవచ్చు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలు రెండింటిలోనూ పోడియంపై నిలబడగలిగాను. నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమైంది. గతంలో ఇలాంటి సమయంలో నేను కీలక దశలో పాయింట్లు కోల్పోయి వెనుకబడేవాడిని. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఇటీవల ఈ రెండు ఫార్మాట్లలో నాకు మంచి ఫలితాలు రాలేదు. దానిని సవరించే ప్రయత్నం చేశాను. నిజాయితీగా చెప్పాలంటే ఒకదాంట్లో బాగా ఆడగలననుకున్నాను. కానీ రెండింటిలో మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
విశ్వనాథన్ ఆనంద్‌కు రెండో స్థానం
ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆనంద్ 53 ఎత్తుల్లో మహిళల ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా)పై గెలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్, నకముర (అమెరికా) సంయుక్తంగా రెండో స్థానంలో నిలువగా... మెరుగైన ప్రోగ్రెస్సివ్ స్కోరు ఆధారంగా ఆనంద్‌కు రెండో స్థానం, నకమురకు మూడో స్థానం లభించాయి. 7.5 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
ఆనంద్‌కు ఎనిమిదో స్థానం
న్యూఢిల్లీ: సెయింట్ లూసియా ఓపెన్ బ్లిట్జ్‌చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్ల పాటు అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ఒక గేమ్‌లో గెలిచి, 12 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా ఐదు గేముల్లో ఓడిపోయాడు. రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తొమ్మిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 13.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
సింక్వీఫీల్డ్ కప్ టోర్నీలో ఆనంద్‌కు రెండో స్థానం
ప్రతిష్టాత్మక సింక్వీఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ చాంప్ కార్ల్సన్ (నార్వే) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆనంద్‌కు రెండో స్థానం, కార్ల్‌సన్‌కు మూడో స్థానం లభించాయి. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో 6 పాయింట్లతో లాగ్రెవ్ (ఫ్రాన్స్) విజేతగా నిలిచాడు. లాగ్రెవ్కు 75 వేల డాలర్లు (రూ. 48 లక్షలు), ఆనంద్‌కు 50 వేల డాలర్లు (రూ. 32 లక్షలు), కార్ల్‌సన్‌కు 40 వేల డాలర్లు (రూ. 25 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. మాక్సిమి వాచెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 5 పాయింట్లతో మాక్సిమి, అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో సో వెస్లీ (అమెరికా)తో ఆనంద్ ఆడతాడు. -
ఆనంద్‌కు తొలి విజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 29 ఎత్తుల్లో గెలుపొందాడు. తొలి నాలుగు గేమ్‌లను ‘డ్రా’గా ముగించుకున్న ఆనంద్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), ఆనంద్ ఖాతాలో మూడేసి పాయింట్లున్నాయి. -
జ్యూరిక్ చెస్ టోర్నీ: ఆనంద్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎనిమిది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ మధ్య జరిగిన జ్యూరిక్ అంతర్జాతీయ చెస్ చాలెంజ్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో క్లాసికల్ (7 రౌండ్లు), బ్లిట్జ్ (14 రౌండ్లు) విభాగాల్లో గేమ్‌లు జరిగాయి. క్లాసికల్ విభాగంలో ఆనంద్ 9 పాయింట్లు, బ్లిట్జ్ విభాగంలో 4.5 పాయింట్లు సాధించాడు. ఓవరాల్‌గా 13.5 పాయింట్లతో కంబైన్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని పొందాడు. ఆనంద్‌తోపాటు నకముర (అమెరికా), నెపోమ్నియాచి (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్), గ్రిగరీ ఒపారిన్ (రష్యా), యానిక్ పెలిటిర్ (స్విట్జర్లాండ్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 15 పాయింట్లతో నకముర విజేతగా నిలువగా... 14 పాయింట్లతో నెపోమ్నియాచి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
అమ్మే గ్రాండ్‌మాస్టర్...
మా అమ్మ విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇండియాకి మొదటి గ్రాండ్‌మాస్టర్. రాజీవ్ ఖేల్త్న్ర పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు. చదరంగాన్ని భారతీయులు మర్చిపోకుండా గుర్తు చేసి, పతాకస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆనంద్. ఆందుకే జాతి ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. తాను ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా ఎదగడంలో తల్లి సుశీల పాత్రను అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు ఆనంద్. ‘‘మా అమ్మ నాకు మాత్రమే రోల్‌మోడల్ కాదు. అమ్మదనానికే రోల్‌మోడల్. ఆమె పిల్లలకు ఒక సంగతిని చాలా నైపుణ్యంగా చెప్పేది. పిల్లల్లోని నైపుణ్యాన్ని త్వరగా గ్రహించేది. నేను అమ్మకూచిని. ఆమె వెంటే తిరిగేవాడిని. అమ్మకు చెస్ ఆడడం హాబీ. నాతో ఆడుకునేది. ఎవరైనా ‘‘ఆనంద్‌కు ఆట నేర్పిస్తున్నావా’’ అంటే... ‘‘నేను చెస్ ఆడుకోవడానికి మంచి ప్రత్యర్థిని తయారు చేసుకుంటున్నా’’ అని నవ్వేది. నాతో చెస్ ఆడేది. చెస్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పేది కాదు. ఆటలో భాగంగానే పావులు ఎలా కదపాలో చెప్పేది. ఒక ఎత్తు ఎందుకు వేయాలో చెప్తూ, ఆ ఎత్తు ఎప్పుడు వేయాలో చెప్పేది. తన దగ్గర పావులలో ఎన్ని రకాల ఎత్తులకు అవకాశం ఉందో వివరిస్తూ... తాను అప్పుడు ఏ స్టెప్ తీసుకోనుందో చెప్పేది. చెప్పాక తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నదో నన్ను ఊహించి చెప్పమనేది. అలా మా మధ్య బ్రెయిన్గేమ్ సాగేది. అలా పలక- బలపం కంటే ముందు చదరంగం పావులు కదిపాను. ఐదేళ్ల వయసులో మొదలైన నా చెస్ ప్రయాణంలో ప్రతి ఎత్తులోనూ అమ్మ ఉంది. ప్రముఖ క్రీడాకారులతో వేసిన అనేక ఎత్తులను అమ్మ దగ్గర వేసిన అనుభవం నాది. అమ్మ మంచి కోచ్! అమ్మ ఎంత మంచి కోచ్ అంటే... ప్రాక్టీస్‌తో బుర్ర వేడెక్కే పరిస్థితి ఎప్పుడూ రానిచ్చేది కాదు. ఎత్తు వేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నా, ఎక్కువ మథనం చేసినా ఇట్టే పట్టేసేది. ‘‘నువ్వు అలసిపోయావు’’ అని చెప్పకుండా ‘‘నాకు పనుంది నువ్వు కొంచెం సేపు బయట ఆడుకో’’ అని పంపించేసేది. క్రీడాకారుడిగా... నాలో చెస్ అనే బీజాన్ని వేసింది అమ్మేనంటే... చదరంగం బీజాలు మన జీన్స్‌లో ఉన్నాయనేదామె. తన పుట్టింటి వారసత్వాన్ని నా ద్వారా కొనసాగిస్తున్నానని చెప్పేది. అమ్మ వాళ్లింట్లో అందరూ కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుంటూ చెస్ బోర్డు తీస్తారు. నేను క్రీడాకారుడిగా పొరుగూళ్లకు వెళ్లాల్సినప్పుడు అమ్మ వెంట లేకుండా వెళ్లేవాడిని కాదు. మరీ చిన్నతనం కావడం, అమ్మను వదిలి ఉండడం తెలియకపోవడంతో అలా అలవాటైంది. నా కోసం అమ్మ రాజీ! మాది అత్యంత సంపన్న కుటుంబం కాదు. కానీ నాన్న రైల్వేలో ఉన్నతాధికారి. అమ్మ పుట్టింట్లో ఎక్కువ మంది లాయర్లు. అలా అమ్మ జీవితం సౌకర్యవంతంగా ఉండేది. అలాంటిది 1983లో అహ్మదాబాద్‌లో నేషనల్స్‌కి వెళ్లినప్పుడు మాకిచ్చిన బస చాలా అసౌకర్యంగా ఉంది. నాకప్పుడు పదమూడేళ్లు. ఆర్గనైజర్లని అడగగలిగిన వయసు కాదు. కానీ అమ్మ కూడా అడగలేదు. ఆ గదిలోనే సర్దుకుపోయింది. ఎందుకలా అని తర్వాత నేనడిగితే... ‘ఎవరితోనైనా గొడవపడినా, గొడవను చూసినా ఆ ప్రభావం మెదడు మీద చాలా గంటలసేపు అలాగే ఉంటుంది. మెదడు అలజడికి లోనయితే రేపు ఆట ఆడేటప్పుడు సరిగ్గా ఎత్తు వేయలేవు’ అన్నది. నా కెరియర్ కోసం ఆమె సౌకర్యాలను త్యాగం చేసింది, డిమాండ్ చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నా చిన్న బుర్ర గందరగోళానికిలోనుకాకూడదని హుందాగా వ్యవహరించింది. అమ్మలో నేను చూసిన విజ్ఞత, పరిణతి అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా అమ్మ చాలా గ్రేట్ అనిపిస్తుంది. నా కోసం ఎయిర్‌పోర్టుకి! నేను గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లు గెలిచినప్పుడు బిడ్డ ఉన్నతికి సంతోషించే అందరు అమ్మల్లాగానే మా అమ్మ కూడా సంతోషపడింది. అయితే నేను గాటాకామ్స్కీతో ఓడిపోనప్పుడు అమ్మ నాతో లేదు. ఓటమికి ఎక్కడ కుంగిపోతానేమోనని బెంగపడింది. నేను చెన్నైలో దిగేటప్పటికి ఎయిర్‌పోర్టులో నా కోసం ఎదురు చూస్తోంది. అలా కొంతకాలానికి అమ్మ జీవితం నా చదరంగమే అయింది. ఎప్పుడూ టోర్నమెంట్ల షెడ్యూళ్లు తెలుసుకోవడం, క్యాలెండర్ తయారు చేసుకోవడంలోనే కనిపించేది. అప్పట్లో ఫోన్ సౌకర్యం ఇప్పుడున్నంతగా లేదు. ఎక్కడికి ఫోన్ చేయాలన్నా ట్రంక్‌కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. ఆ కాల్ కట్ కావడం, మళ్లీ చేయడంలో చాలా డబ్బు ఖర్చయ్యేది. అప్పుడప్పుడూ ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆనంద్ ట్రంక్‌కాల్స్ కోసం ఖర్చు చేసిన డబ్బుతో సగం ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఉండవచ్చు అంటుండేది. టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్! నా సహ చెస్ క్రీడాకారులు అమ్మను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించినప్పుడు నాకు అమ్మలో అనేక కోణాలు తెలిశాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ మాన్యుయెల్ ఆరోన్ మాట్లాడుతూ ‘ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్’ అన్నాడు. కొడుకుగా నేను చూసిన అమ్మకంటే మా అమ్మ చాలా ఎక్కువ అని అప్పుడు అనిపించింది. గర్వంతో నా గుండె పొంగిపోయింది. పైగా ఆ ప్రశంసలను విన్నది అమ్మను కోల్పోయిన క్షణాల్లో కావడంతో ఉద్వేగం కన్నీళ్లుగా ఉబికింది. పేరుకు తగినట్లుగా ఆనందంగా ఉండాలని నాకు చెప్పేది. తాను కూడా పేరుకు తగ్గట్టే అత్యంత సౌశీల్యమైన వ్యక్తిత్వంతో రాణించింది. కూర్పు: వాకా మంజులారెడ్డి -
రన్నరప్ ఆనంద్
న్యూఢిల్లీ: కార్సికన్ సర్క్యూట్ నాకౌట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్‌సలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు అంతర్జాతీయ మాస్టర్లు పాల్గొన్నారు. రెండు గేమ్‌ల ఫైనల్లో ఆనంద్ 0.5-1.5తో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఆనంద్ 1.5-0.5తో తెమూర్ రద్జబోవ్ (అజర్బైజాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 1.5-0.5తో టిగ్రాన్ ఘరామియాన్ (ఫ్రాన్స)పై, తొలి రౌండ్లో 2-0తో కొయెన్ లీహుట్స్ (ఫ్రాన్స)పై గెలుపొందాడు. భారత్‌కు నాలుగు పతకాలు జార్జియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్లో భారత్‌కు నాలుగు పతకాలు లభించారుు. అండర్-12 ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, అండర్-10 ఓపెన్ విభాగంలో వి.ప్రణవ్ కాంస్య పతకాలు... అండర్-12 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ కాంస్యం, అండర్-10 బాలికల విభాగంలో మృదుల్ దేహాంకర్ రజత పతకం సాధించారు. -
హారికకు మూడో విజయం
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాంట్ అరాఖమియా (స్కాట్లాండ్)తో బుధవారం జరిగిన ఐదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో గెలిచింది. ప్రస్తుతం హారిక ఖాతాలో 3.5 పారుుంట్లు ఉన్నారుు. మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయి0ట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)తో జరిగిన మూడో రౌండ్లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయి0ది. -
హారిక రెండో గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఎలైట్ మాస్టర్స్ కేటగిరీలో పోటీపడుతున్న హారిక అమెరికా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ సో వెస్లీతో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో హారిక 24 ఎత్తుల్లో ఫెర్నాండో రొకబాడో (అర్జెంటీనా)పై గెలిచింది. పీటర్ లెకోను నిలువరించిన హర్ష ఆంధ్రప్రదేశ్ మరో గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు తొలి రౌండ్లో 30 ఎత్తుల్లో గెరార్డ్ లోర్షెడ్ (జర్మనీ)పై విజయం సాధించగా... హైదరాబాద్ ప్లేయర్ హర్ష భరతకోటి (2363 ఎలో రేటింగ్) తొలి రౌండ్లో సంచలన ప్రదర్శన చేశాడు. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న హంగేరి గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 38వ ర్యాంకర్ పీటర్ లెకో (2709 ఎలో రేటింగ్)తో జరిగిన గేమ్‌ను హర్ష 37 ఎత్తుల్లో నిలువరించాడు. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆనంద్‌కు మూడో ‘డ్రా’ మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. ఎవ్‌గెనీ తొమషెవ్స్కీ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 3.5 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు రెండో విజయం
మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)తో శనివారం జరిగిన ఐదో రౌండ్లో ఆనంద్ 58 ఎత్తుల్లో గెలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో ఆనంద్ 41 ఎత్తుల్లో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
క్రీడాకారుల అవసరాలపై దృష్టి పెట్టండి: ఆనంద్
రియో ఒలింపిక్స్‌కు మరో మూడున్నర నెలల సమయమే ఉన్నందున వివాదాలకు దూరంగా ఉంటూ... ఈ క్రీడలకు అర్హత పొందిన క్రీడాకారుల అవసరాలను గుర్తించాలని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. భారత బృందానికి హీరో సల్మాన్ ఖాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడాన్ని వివాదం చేయకూడదన్నాడు. ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు తాను అర్హత పొందనప్పటికీ... ఇప్పటికైతే తన మదిలో రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. -
చెస్ ఆడేందుకు పిల్లలు కావాలన్న స్టార్!
ముంబై: తనకు చెస్ అంటే బాగా ఇష్టమని బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ అన్నారు. 'నా చిన్నతనంలో మా నాయనమ్మ నాకు చెస్ ఆడటం నేర్పింది. చెస్ ఆడటానికి నాకు చాలా మంది పిల్లలు కావాలని ఉంది. చెస్ వల్ల పిల్లల మైండ్, ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది' అని అభిప్రాయపడ్డాడీ స్టార్ హీరో. 'నా జీవిత కాలంలో నేను ఎక్కువగా మక్కువ చూపించిన ఆట చెస్. నాతో ఆట ఆడేవారి కోసం చూడటం నాకు అలవాటు' అని చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్‌కు హృదయ్నాథ్ అవార్డును ప్రదానం చేయడానికి వెళ్లిన ఈవెంట్లో ఆమీర్ వ్యాఖ్యనించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎక్కువగా ఆడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆనంద్‌కు తానొక పెద్ద ఫ్యాన్‌నని ఆమీర్ చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ ప్లేయర్లలో ఆనంద్ ఒకరని దేశం గర్వించే విధంగా ఆనంద్ విజయాలు ఉన్నాయని అన్నారు. గత మేలో మహారాష్ట్ర చెస్ లీగ్ సందర్భంగా ఆమీర్ ఆనంద్‌తో కలిసి చెస్ ఆడారు. చెస్ మీద ఏదైనా సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. -
ఆనంద్‌కు నిరాశ
మాస్కో: పదేళ్లలో తొలిసారి భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లేకుండా పు రుషుల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుం ది. సోమవారం ముగిసిన క్యాండిడేట్స్ ఓపెన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ 7.5 పాయింట్లతో కరువానా (అమెరికా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో సెర్గీ కర్జాకిన్ (రష్యా) 8.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఏడాది నవంబరు 11 నుంచి 30వ తేదీ వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ప్రస్తుత విజేత మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో పోరుకు కర్జాకిన్ సిద్ధమయ్యాడు. చివరిదైన 14వ రౌండ్లో స్విద్లెర్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మరోవైపు కరువానాపై కర్జాకిన్ 42 ఎత్తుల్లో గెలిచి విజేతగా అవతరించాడు. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన 13వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 52 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి. -
ఆనంద్ ఓటమి
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో ఓటమి ఎదురైంది. నకముర (అమెరికా)తో శుక్రవారం జరిగిన 12వ రౌండ్లో ఆనంద్ 26 ఎత్తుల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆనంద్‌కు 6.5 పాయింట్లు ఉన్నాయి. -
ఆనంద్ పరాజయం
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ (భారత్) రెండో పరాజయాన్ని చవిచూశాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 33 ఎత్తుల్లో ఓడిపోయాడు. పదో రౌండ్ తర్వాత ఆనంద్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరు పాయింట్లతో కరువానా, కర్జాకిన్ (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆనంద్‌కు మూడో గెలుపు
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో ఆనంద్ తెల్లపావులతో ఆడుతూ 66 ఎత్తుల్లో గెలిచాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ 5.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు ఐదో ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచమాజీ చాంపియన్ వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
ఒక్క రోజు... భారత నంబర్‌వన్‌గా...
• హరికృష్ణ అరుదైన ఘనత • 30 ఏళ్ల తర్వాత రెండో స్థానానికి ఆనంద్ మాస్కో: మూడు దశాబ్దాలుగా భారత నంబర్‌వన్ చెస్ ప్లేయర్‌గా కొనసాగుతున్న ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. 46 ఏళ్ల ఆనంద్‌ను తోసిరాజని... 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తేజం పెంటేల హరికృష్ణ భారత నంబర్‌వన్ క్రీడాకారుడిగా అవతరించాడు. అయితే 29 ఏళ్ల హరికృష్ణ కేవలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే భారత నంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం మాస్కోలో జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ ‘నంబర్‌వన్’ మార్పు చోటు చేసుకుంది. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఆనంద్ ఓడిపోవడంతో హరికృష్ణ క్లాసిక్ విభాగంలో భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించాడు. అయితే బుధవారం జరిగిన ఐదో రౌండ్లో ఆనంద్ 30 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. 1986లో తొలిసారి భారత నంబర్‌వన్‌గా నిలిచిన ఆనంద్ ఇప్పటివరకు అదే స్థానంలో కొనసాగాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మరో అవకాశం... క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఈనెల 29న ముగుస్తుంది. ఒకవేళ క్యాండిడేట్స్ టోర్నీలో ఆనంద్ పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం... హరికృష్ణకు మళ్లీ భారత నంబర్‌వన్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆనంద్ (2763.4 ఎలో రేటింగ్), హరికృష్ణ (2763.3 ఎలో రేటింగ్) మధ్య కేవలం .1 తేడా మాత్రమే ఉంది. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆనంద్ 13వ స్థానంలో, హరికృష్ణ 14వ స్థానంలో ఉన్నారు. -
ఆనంద్‌కు తొలి ఓటమి
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 43 ఎత్తుల్లో ఓడిపోయాడు. తాజా ఓటమితో ఆనంద్ రెండు పాయింట్లతో మరో ఇద్దరితో కలసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో ‘డ్రా’ను నమోదు చేసుకున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఒకటిన్నర పాయింట్లు ఉన్నాయి. -
ఆనంద్ శుభారంభం
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో ఆనంద్ 49 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)పై గెలుపొందాడు. కర్జాకిన్ (రష్యా)-పీటర్ స్విద్లెర్ (రష్యా); నకముర (అమెరికా)-కరువానా (అమెరికా)ల మధ్య జరిగిన ఇతర తొలి రౌండ్ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అరోనియన్ (అర్మేనియా) కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. -
మోదీ ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్రమోదీ నేటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసక్తికర ఉదాహరణలతో విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. మోదీతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. మోదీ ఏం మాట్లాడారంటే.. - నాకు తెలుసు మీరంతా మీ పిల్లల పరీక్షల గురించి కంగారు పడుతున్నారని, మీతోపాటు నేను కూడా విద్యార్థుల పరీక్షల విషయంలో కొంత ఆందోళనతోనే ఉన్నాను. - ఈ 20 నిముషాలు నేను మాట్లాడబోతున్న విషయాలు విద్యార్థులుకు తప్పక ఉపయోగపడతాయని భావిస్తున్నాను. - పరీక్షలంటే మొత్తంగా మార్కులకు సంబంధించినవి కావు, ప్రతి పరీక్ష గొప్ప ప్రయోజనానికి దారి మాత్రమే. - ఈ పరీక్షలతోనే మీకు మీరు హద్దులు ఏర్పరుచుకోకండి, గొప్ప గొప్ప ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. - తగిన విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు పడుకునేముందు ఎక్కువ సమయం ఫోన్ లో సంభాషించటం మనకు అలవాటుగా మారిపోయింది. అంతసేపు మన కలతల గురించి మాట్లాడాక ఇక ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుంది? అందుకే మనం ఆ అలవాటుని అధిగమించాలి. - క్రమశిక్షణే జీవితంలో విజయానికి పునాది అవుతుంది. - టెన్షన్ కి లోనుకాకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో పరీక్షలు రాయండి, మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి. - జె.కె.రోలింగ్ మనందరికీ మంచి ఉదాహరణ. ఎవరైనా ఏ సమయంలోనైనా ఏదైనా సాధించగలరని ఆమె నిరూపించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆమె విజయం సాధించారు. - ఉత్సుకత అనేది ఆవిష్కరణలకు తల్లి వంటిది. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితోనే ఆవిష్కరణలు సాధ్యం. 'నేషనల్ సైన్స్ డే' రోజున శాస్త్ర, సాంకేతిక రంగాలను మన జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా గుర్తిద్దాం. ఈ సందర్భంగా నేను సర్ సివి రామన్ కు ప్రణమిల్లుతున్నాను. అలాగే శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. - దేశ ప్రజలు రేపు ఆర్థిక బడ్జెట్ తో నన్ను పరీక్షించనున్నారు, నా పరీక్షతోపాటు మీ పరీక్షలు సఫలమవుతాయని ఆశిస్తున్నాను. - తల్లిందండ్రులు, ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగిన సపోర్ట్ అందించండి. వారి విజయంలో మీరూ భాగస్వాములు కండి. సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే.. - రిలాక్స్డ్గా ఉండండి, మీ టార్గెట్ ను మీరే నిర్దేశించుకుని.. సాధించేందుకు ప్రయత్నించండి. నేను ఆడుతున్నప్పుడు నా మీద ఎందరికో భారీ అంచనాలుండేవి, కానీ నా టార్గెట్ ను నేనే నిర్దేశించుకునేవాడిని. - ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధంకండి. మీకు మీరే పోటీగా భావించాలి తప్ప, పక్కవారితో పోల్చుకోకూడదు. - మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉండే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి.. గుడ్ లక్. విశ్వనాధన్ ఆనంద్ ఏమన్నారంటే.. - మౌనంగా ఉండండి, మంచి ఆహారం, తగినంత నిద్ర తప్పనిసరి. - భారీ అంచనాలు విపరీతమైన ఒత్తిడికి దారితీస్తాయి, కాబట్టి మరీ భారీ అంచనాల జోలికి వెళ్లకపోవడం మంచిది. - ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు, అలా అని నిరాశావాదులుగా కూడా ఉండొద్దు. కేవలం ఒక చాలెంజ్ గా మాత్రమే తీసుకోండి. గురు మోరారీ బాపూ.. - ప్రశాంతంగా ఉండండి, విజయం వెంట పరుగులు తీయాల్సిన పని లేదు.. పరిస్థితిని అంగీకరిస్తే చాలు. - అందరూ విజయాలే అందుకోవాల్సిన అవసరం లేదు, అపజయాలతో కూడా సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. మీకు నా ఆశీస్సులు. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు - నాకు తెలుసు.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎంతటి యాంగ్జైటీకి గురవుతారో, ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల విషయంలో.. కానీ దిగులు పడొద్దు.. మీరే విజేతలు. - దేశంలో ఎన్నెన్నో అవకాశాలున్నాయి. మీరేం చేయాలనుకుంటున్నారనేది మీరే ఆలోచించుకోండి.. డోన్ట్ గివ్ ఇట్ అప్. ఇంకా మోదీ మాట్లాడుతూ తనతోపాటు విద్యార్థులకు విలువైన సూచనలు అందించిన సచిన్ టెండూల్కర్, విశ్వనాధన్ ఆనంద్, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, మోరారీ బాపూలకు ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ డే సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. -
'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమంలో మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ముచ్చటించనున్నారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే సచిన్ తోపాటు ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా కూడా వినే అవకాశం ఉంది. Being positive and setting your own goals...Happy to join PM @narendramodi on #MannKiBaat wishing students good luck for their Board exams! — sachin tendulkar (@sachin_rt) February 28, 2016 Tune in at 11 AM. You can also hear it on the Mobile App. #MannKiBaat https://t.co/TYuxNNJfIf pic.twitter.com/jKnMs4Udal — Narendra Modi (@narendramodi) February 28, 2016 -
జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్
భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల గేమ్‌లు ముగిశాక హికారు నకముర (అమెరికా), ఆనంద్ 10.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నకముర విజేతగా అవతరించగా... ఆనంద్ రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. 9.5 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
ఆనంద్ గేమ్ డ్రా
లండన్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో ఎట్టకేలకు తన పరాజయాల పరంపరకు ముగింపు పలికాడు. వరుస మూడు ఓటముల అనంతరం జరిగిన నాలో గేమ్ ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఆదివారం ఫబియానో కరునా(అమెరికా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ లో ఆనంద్ డ్రాతో సంతృప్తి చెందాడు. దీంతో ఎనిమిదో రౌండ్ ముగిసిన అనంతరం మూడు పాయింట్లతో ఆనంద్ తొమ్మిది స్థానంలో కొనసాగుతుండగా, 3.5 పాయింట్లతో నకమురా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కాగా, 5.0 పాయింట్లతో హాలెండ్ ఆటగాడు అనిష్ గిరి , మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగడం లేదు. -
డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
దిలీప్ కుమార్ (నటుడు), ఆర్య (నటుడు), విశ్వనాథన్ ఆనంద్ (చెస్ చాంపియన్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు కాబట్టి చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమై ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరు పుట్టిన తేదీ 11 రెండు సూర్యసంఖ్యల కలయికతో ఏర్పడ్డది గనక వీరికి జన్మతః ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో టీమ్ వర్క్‌తో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హ–{దోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 4, 5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దుర్గాదేవిని ఆరాధించడం, శునకాలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం, పిల్లలకు, వృద్ధులకు తీపి par తినిపించడం.ఙ- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
హరికృష్ణపైనే ఆశలు
నేటి నుంచి ప్రపంచకప్ చెస్ బరిలో లలిత్ బాబు కూడా బాకు (అజర్బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సిద్ధమయ్యాడు. నేటి నుంచి ఇక్కడ జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 128 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. విశ్వనాథన్ ఆనంద్, కార్ల్సన్ మినహా ప్రపంచంలోని ప్రముఖ గ్రాండ్‌మాస్టర్లంతా బరిలో నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న హరి తొలి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్ ఇల్లింగ్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు. హరికృష్ణ కాకుండా మరో ఐదుగురు భారత ఆటగాళ్లు ఆదిబన్, సూర్య శేఖర్ గంగూలీ, విది త్ గుజరాతీ, సేతురామన్, ఎంఆర్ లలిత్ బాబు ఈ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. తెలుగు కుర్రాడు లలిత్ బాబుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో అతను 18వ ర్యాంకర్ వోటాసెక్ (పోలండ్)తో తలపడతాడు. -
ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో స్థానం లభించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆనంద్ వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఆడిన ఆనంద్ 36 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఆనంద్ 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా) విజేతగా అవతరించగా... ఐదు పాయింట్లతో కార్ల్సన్ రన్నరప్‌గా నిలిచాడు. -
ఆనంద్‌కు మరో డ్రా
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి రౌండ్లో తను ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎదుర్కోనున్నాడు. -
ఆనంద్‌కు మళ్లీ డ్రా
సెయింట్ లూయిస్ : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ అనంతరం విషీ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్‌కు ఈ టోర్నీలో పెద్దగా కలిసి రావడం లేదు. తొలి రెండు గేమ్‌ల్లో ఓడిన అతను తర్వాత డ్రాలతో సరిపెట్టుకుంటున్నాడు. మరోవైపు తెల్లపావులతో గిరి.. స్లావ్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో లాగ్రావి (ఫ్రాన్స్-3.5)... తపలోవ్ (బల్గేరియా-3)పై; నకమురా (అమెరికా-3.5)... వెస్లీ సో (అమెరికా-1.5)పై; గ్రిస్చుక్ (రష్యా-3)... కరుణ (అమెరికా-2)పై నెగ్గగా; ఆరోనియన్ (ఆర్మేనియా-4)... కార్ల్సన్ (నార్వే-4)ల మధ్య గేమ్ డ్రాగా ముగిసింది. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
సెయింట్ లూయీస్ (అమెరికా) : సింక్విఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరో డ్రా నమోదు చేశాడు. ఫాబియాన్ కరునా (అమెరికా) జరిగిన నాలుగో గేమ్‌ను ఆనంద్ సమం చేశాడు. ఇందులో ఆనంద్ నల్ల పావులతో బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో తొలి రెండు గేమ్‌లో ఓడిన ఆనంద్‌కు ఇది వరుసగా రెండో డ్రా. 10 మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొపలోవ్, ఆరోనియన్ చెరో 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. -
ఆనంద్‌కు తొలి ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా) : వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఖాతా తెరిచాడు. వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత ఆనంద్ అర పాయింట్‌తో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు రెండో పరాజయం
సెయింట్ లూయిస్ (అమెరికా) : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. అలెగ్జాండర్ గ్రిష్చుక్ (రష్యా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇతర గేముల్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా) 73 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా)పై, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 40 ఎత్తుల్లో ఫాబియానో (అమెరికా)పై గెలుపొందగా... మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)- అరోనియన్ (అర్మేనియా); అనీష్ గిరి (నెదర్లాండ్స్)-సో వెస్లీ (అమెరికా)ల మధ్య జరిగిన గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
ఆనంద్‌కు మూడో విజయం
స్టావెంజర్ (నార్వే) : భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మూ డో విజయాన్ని సాధించాడు. జాన్ లుడ్విగ్ హామర్ (నార్వే)తో బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆనంద్ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆనంద్ తలపడతాడు. -
ఆనంద్‌కు ఐదో ‘డ్రా’
స్టావెంజర్ (నార్వే): విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. అరోనియన్ (ఆర్మేనియా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. కామన్వెల్త్ చెస్‌లో హంపి, లలిత్‌ల శుభారంభం న్యూఢిల్లీ: కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏపీ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఎం.ఆర్. లలిత్‌బాబు శుభారంభం చేశారు. తొలి రౌండ్లో హంపి ... సోహమ్పై, లలిత్‌బాబు... ఓజస్ కులకర్ణిపై గెలిచారు. -
కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం
స్టావెంజర్ (నార్వే): రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కార్ల్సన్ (నార్వే) చేతిలో ఓడి న భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నీలో మాత్రం ప్రత్యర్థికి షాక్ ఇచ్చాడు. టోర్నీలో వరుసగా మూడు డ్రాల తర్వాత... కార్ల్సన్తో జరిగిన నాలుగో గేమ్‌లో ఆనంద్ 47 ఎత్తుల్లో విజయం సాధించాడు. ప్రస్తుతం భారత స్టార్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇతర గేమ్‌లలో అరోనియన్‌పై తొపలోవ్; హామెర్పై గ్రిష్చుక్ నెగ్గారు. కరుణ, లాగ్రెవ్; గిరి, నకమురల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. -
విశ్వనాథన్ ఆనంద్‌కు మాతృవియోగం
చెన్నై: ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. కాగా ఆమెకు భర్త కె.విశ్వనాథన్, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆనంద్ పెద్ద కొడుకు. తల్లి సుశీల.. ఆనంద్‌కు తొలి గురువు లాంటివారు. చదరంగంలో తొలి పాఠాలు ఆమె దగ్గరే నేర్చుకున్నారు. ఆనంద్ సాధించిన ప్రతి విజయం వెనుక ఆమె ఉన్నారని చెప్పొచ్చు. సుశీలా విశ్వనాథన్ మృతిపై ఆల్ ఇండియా ఛెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పిఆర్ వెంకట్రామ రాజా సంతాపం తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇంతటి ఘనత సాధించడంలో ఆయన తల్లి పాత్ర చాలా ఉందని ఆయన కొనియాడారు. -
ఈ పిడుగులకి మీ పిల్లలకి తేడా ఏంటి?
చిన్నప్పుడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ప్రోత్సహించేది. తను నాతో ఎప్పుడూ ఒకటే చెప్పేది. ‘నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అందులో గొప్పవాడివి మాత్రం కావాలి. బాత్రూములు కడిగేవాడివి అయినా సరే, అందులో నువ్వే నంబర్‌వన్ కావాలి’ అని! - కమల్ హాసన్ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న టాలెంట్స్‌ని గుర్తించడంలో విఫలమవుతుంటారు. ప్రతి ఒక్కరికీ దేవుడు పుట్టుకతోనే ఒక టాలెంట్ ఇస్తాడు. దాన్నిబట్టే పిల్లలకు ఆయా అంశాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. - విశ్వనాథన్ ఆనంద్ చిన్నప్పుడే పిల్లలు వారిలోని ప్రతిభను, ఆసక్తిని కనబరుస్తారు. కొందరు తల్లిదండ్రులు వాటిని గుర్తిస్తారు. మరి కొందరు తల్లిదండ్రులైతే వాటిని ప్రోత్సహిస్తారు. మన పిల్లల్లో ఓ టెండూల్కర్ ఉన్నాడో, ఓ సానియా ఉందో, ఓ మైఖేల్ జాక్సన్ ఉన్నాడో, ఓ బిల్ గేట్స్ ఉన్నాడో మనకు తెలీదు. అది తెలియాలంటే ప్రతిభను గుర్తించే విధానం కావాలి. ఆ ప్రతిభకు పదునుపెట్టే ఓ అవకాశం కావాలి. సాక్షి, భాష్యం గ్రూప్‌తో కలిసి ‘క్రియేటివ్ కిడ్స్’ క్యాంప్‌ను మీ పట్టణాల్లో నిర్వహించనుంది. యోగా, చెస్, పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కుకరీ, పియానో, గిటార్ తదితర అంశాలలో ఉత్తమమైన శిక్షణ! మే 7 నుంచి 30 వరకూ సమ్మర్ క్యాంప్! రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ: 06-05-2015. వివరాలకు 04023256138కు ఫోన్ చేయండి. -
రన్నరప్ ఆనంద్
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆనంద్ ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఏడు పాయిం ట్లతో విజేతగా అవతరించాడు. కరువానా (ఇటలీ)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది మేటి గ్రాం డ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ మిగతా మూడు గేముల్లో గెలుపొందాడు. -
ఆనంద్‌కు తొలి గెలుపు
షామ్‌కిర్ (అజర్బైజాన్) : వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని సాధించాడు. వరుసగా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్‌కు ఐదో రౌండ్లో విజయం దక్కింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోతో మంగళవారం జరిగిన ఐదో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ఆనంద్ 45 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ టోర్నీలో వెస్లీ సోకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం జరిగే ఆరో రౌండ్లో రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్)తో ఆనంద్ తలపడతాడు. -
ఆనంద్ ‘డ్రా’ల పర్వం
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు ‘డ్రా’లు నమోదు చేసిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ నాలుగో రౌండ్లోనూ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
మియామీ టైటిల్ సెరెనా కైవసం
క్రీడలు గ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరు ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరును ఒక చిన్న గ్రహానికి 4538 విషీ ఆనంద్ అని పెట్టినట్లు ఏప్రిల్ 1న మైనర్ ప్లానెట్ సెంటర్ తెలిపింది. ఈ గ్రహాన్ని 1998వ సంవత్సరంలో అక్టోబర్ 10న కెంజో సుజుకీ గుర్తించారు. ఇది అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో ఉంది. సాధారణంగా కొత్తగా గుర్తించిన గ్రహాలకు వాటిని కనుగొన్న వారి పేర్లే పెడతారు. పదేళ్ల పాటు గ్రహానికి పేరు పెట్టకపోతే వేరే పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఖరారు చేస్తుంది. విశ్వనాథన్ కన్నా ముందు రోజర్ ఫెదరర్, జెస్సీ ఓవెన్స్, డొనాల్డ్ బ్రాడ్‌మెన్‌లకు ఈ గౌరవం దక్కింది. చెన్ లాంగ్, మారిన్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్ మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, కరోలినా మారిన్ (స్పెయిన్) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో లిన్ డాన్ (చైనా)ను చెన్ ఓడించాడు. భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో జురుయ్ లీ చేతిలో ఓడిపోయింది. మియామీ టైటిల్ సెరెనా కైవసం మియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫ్లోరిడాలో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)ను ఓడించింది. సెరెనా ఎనిమిదోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. ఇది తన కెరీర్లో 66వ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: టైటిల్‌ను భారత్‌కు చెందిన సానియా మిర్జా.. మార్టీనా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి రష్యాకు చెందిన ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నియాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్: టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ ఆండీ ముర్రేను ఓడించి గెలుచుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఐదో మియామి మాస్టర్స్ టైటిల్. విశ్వవిజేత మరియా అంతర్జాతీయ మాస్టర్ మరి యా ముజిచిక్ (ఉక్రెయిన్) ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. సోచి (రష్యా)లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో నటాలియా పోగోనియా (రష్యా)ను మరియా ఓడించింది. సెమీఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్)కు కాంస్య పతకం దక్కింది. ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ కొత్త చైర్మన్‌గా రంజీబ్ బిస్వాల్ స్థానంలో రాజీవ్ శుక్లా ఎంపికయ్యారు. ఇందులో మాజీ ఆటగాళ్ల హోదాలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి ఉన్నారు. జాతీయం రిజర్వ్ బ్యాంకు 80వ వార్షికోత్సవం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 80వ వార్షికోత్సవం ఏప్రిల్ 2న జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేద రైతులకు రుణాలు ఇవ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను కోరారు. ఆర్థిక సమ్మిళితం సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్బీఐకి ప్రధాని సూచించారు. కీలకమైన సంఘటనలు నిర్దేశించుకొని లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. 2015-20 వాణిజ్య విధానం 2015-20 వాణిజ్య విధానాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1న ప్రకటించారు. ఇందులోని ముఖ్యాంశాలు: వస్తు, సేవల ఎగుమతులను 2020 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం. ఇవి 2013-14లో 465.9 బిలియన్ డాలర్లుగా ఉన్నా యి. విదేశీ వాణిజ్య విధానాన్ని ఇకపై రెండేళ్లకొకసారి సమీక్షించడం. ఇప్పటివరకు ఈ విధానంపై వార్షిక సమీక్ష జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడం. ఆం ధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ జాబితాలో చేర్చడం. దీంతో ఈ హోదా గల నగరాల సంఖ్య 23కు చేరుకుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉగ్రవాద నిరోధక బిల్లుకు ఆమోదం వివాదాస్పద గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లును గుజరాత్ శాసనసభ మార్చి 31న ఆమోదించింది. వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం అవసరమని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం బాగా పెరిగిపోవడంతో ఫోన్ సంభాషణలు కీలకమైన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయని తెలిపింది. సీఎంలు, సీజేల జాతీయ సదస్సు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్గత స్వీయ మదింపు చర్యను ఏర్పాటు చేసుకోవాలని న్యాయమూర్తులను మోదీ కోరారు. వందకు పైగా ట్రైబ్యునళ్లకు అధిక నిధులు వ్యయమవుతున్నాయని, వాటి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు లో న్యాయవాద పదకోశాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అంతర్జాతీయం మయన్మార్‌లో శాంతి ఒప్పందం మయన్మార్‌లో జాతీయ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 31న కుదిరింది. ఈ ముసాయిదా ఒప్పందంపై ఆ దేశ అధ్యక్షుడు థీన్‌సేన్ సంతకం చేశారు. సాయుధ తిరుగుబాటు గ్రూపులతో జరిగిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. దేశ వ్యాప్తంగా కాల్పుల విరమణకు తోడ్పడే ఈ ముసాయిదా ఒప్పందాన్ని తిరుగుబాటు దళాల ప్రతినిధులు, సైన్యం, ప్రభుత్వం అంగీకరించాయి. ఈ శాంతి సంప్రదింపులకు ఐక్యరాజ్యసమితి పరిశీలక సంస్థగా వ్యవహరించింది. నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి విజయం నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ఆర్మీ జనరల్ మహ్మద్ బుహారీ విజయం సాధించారు. మార్చి 31న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు గుడ్‌లక్ జోనథాన్పై 25 లక్షల ఓట్ల మెజారిటీతో బుహారి భారీ విజయం సాధించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా (173 మిలియన్) కలిగిన నైజీరియాలో ప్రజాస్వామ్యయుతంగా అధికార మార్పిడి జరిగింది. అవినీతి కుంభకోణాలు, ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిస్ట్‌కు చెందిన బోకోహారమ్ ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడం లాంటి వాటి వల్ల పీడీపీ ప్రజల మద్దతు కోల్పోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై సఫలమైన చర్చలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇందుకు సంబంధించిన చర్చలు స్విట్జర్లాండ్‌లోని లసానేలో ఏప్రిల్ 2న జరిగాయి. ఈ చర్చల్లో ఇరాన్‌తో పాటు ఆరు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పాల్గొన్నాయి. రెండు వర్గాల మధ్య కుదిరిన కార్యచరణ ఒప్పందం జూన్ 30 నాటికి సమగ్రంగా పూర్తవుతుంది. ప్రస్తుత అంగీకారం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై పదేళ్లు పరిమితులు ఉంటాయి. ఇందుకు బదులుగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పలు దేశాలు ఎత్తివేశాయి. ఆపరేషన్ రాహత్ సఫలం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ రాహత్ ద్వారా ఎయిర్ ఇండియా ఏప్రిల్ 5 నాటికి 2,300 మందిని భారత్‌కు చేర్చింది. ఉగ్రవాదుల దాడిలో 150 మంది మృతి కెన్యాలో ఈశాన్య ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఏప్రిల్ 2న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 150మంది విద్యార్థులు మరణించగా, 79 మంది గా య పడ్డారు. సోమాలియాకు చెందిన ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఈ దాడులకు పాల్పడింది. రాష్ట్రీయం నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 1న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తూ అమరావతికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని 400 ఏళ్లు శాతవాహనులు పాలించారు. పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయం పేరుతోనే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇటీవల వారసత్వ నగరాల్లో కేంద్రం ఎంపిక చేసిన వాటిలో అమరావతి ఒకటి. శ్రీసిటీలో పెప్సికో ఉత్పత్తి కేంద్రం ప్రారంభం పెప్సికోకు చెందిన సింగల్ లైన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏప్రిల్ 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పెప్సికో చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో కలిసి ప్రారంభించారు. 86 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1200 కోట్లతో చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రం.. దేశంలోనే ఆ సంస్థకు చెందిన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం కానుంది. పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి పర్వతారోహకుడు మల్లె మస్తాన్ బాబు (40) అర్జెంటినా, చీలీ మధ్యనున్న ఆండీస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. నల్గొండలో సిమి ఉగ్రవాదుల కాల్చివేత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ-సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరిని తెలంగాణలోని నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం గ్రామంలో ఏప్రిల్ 4న పోలీసులు కాల్చి చంపారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు, ఎస్సై సిద్ధయ్య మరణించారు. గుంటూరులో స్పైసెస్ పార్క్ ప్రారంభం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో నిర్మించిన స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల) పార్కును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 6న ప్రారంభించారు. 124 ఎకరాల్లోని ఈ పార్క్‌లో రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ 18 మంది పారిశ్రామికవేత్తలకు యూనిట్లు కేటాయించారు. ఈ పార్క్‌లో ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీ 2015-20 పారిశ్రామిక విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2015-20 పారిశ్రామిక విధానాన్ని ఏప్రిల్ 1న ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యాంశాలు: తయారీ రంగ వృద్ధిరేటు 15 నుంచి 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధిరేటు 20.7 నుంచి 25 శాతానికి పెంచడం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 15-20 లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు - పరిశ్రమలకు 21 రోజుల్లోగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో ఏర్పాటు. పరిశ్రమల కోసం తీసుకునే భూమికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు. అవార్డులు ఆఫ్రికా గ్రూపునకు ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహిస్తున్న ఆఫ్రికన్ గ్రూపు ప్రాజెక్టు ఫర్ ద స్టడీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా (పిఆర్ఎఇఎస్ఎ-ప్రయిసా)కు తొలిసారి పిల్లల సాహిత్యంలో అందజేసే ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ దక్కింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఏప్రిల్ 5న ప్రకటించారు. ఈ అవార్డును యూఏఈ మినిస్టర్ ఆఫ్ కల్చర్ దుబాయ్‌లో ఏప్రిల్ 20న ప్రదానం చేస్తారు. -
అపజయాలే ముందుకు నడిపాయి
ముంబై: దశాబ్దాల తన కెరీర్లో చెస్ మేధావి విశ్వనాథన్ ఆనంద్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అయితే ఎలాంటి ఫలితాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగడమే తనకు తెలుసని చెబుతున్నాడు. సాధించిన విజయాలను మర్చిపోయి మరో కొత్త లక్ష్యం కోసం ఎదురుచూడాలని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 45 ఏళ్ల ఆనంద్ అన్నాడు. ‘అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తొలి నిబంధన స్వయం తృప్తి పొందకపోవడం. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన, వినయం ఎవరికైనా ఉండాలి. నేను మూడుసార్లు ప్రయత్నించాకే ప్రపంచ చాంపియన్ కాగలిగాను. అపజయాలు నాలో ప్రేరణను కలిగించాయి. ఆ తర్వాత ప్రయత్నాలన్నీ అనుకూలంగా వచ్చాయి. తొలిసారిగా విశ్వ చాంపియన్ అయ్యాక కాస్త సంతృప్తి చెందాను. ఇది ఆ తర్వాత పోటీలపై ప్రభావం పడింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడితేనే బావుంటుంది. నిజానికి ఎవరు ఏ విషయంలోనూ మాస్టర్ కాలేరు’ అని ఆనంద్ అన్నాడు. -
జ్యూరిచ్ చెస్ టోర్నీ చాంప్ ఆనంద్
జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ విజేతగా నిలిచాడు. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 42 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని మొత్తం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హికారు నకముర (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
ఆనంద్‌కు రెండో విజయం
జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయం సాధించాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో ఆనంద్ 41 ఎత్తుల్లో గెలుపొందాడు. అంతకుముందు ఫాబి యానా కరుఆనా (ఇటలీ)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఇప్పటికైతే ఆ యోచన లేదు
విశ్వనాథన్ ఆనంద్.. అరవైనాలుగు గళ్ల సామ్రాజ్యానికి రారాజుగా అందరికీ తెలుసు. తెలుపు, నలుపు పావులతో ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ మాస్టర్ తనకు చెస్ నేర్పింది మాత్రం అమ్మే అని చెబుతున్నాడు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్.. సిటీతో తనకున్న అనుబంధాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నాడు. - కంచుకట్ల శ్రీనివాస్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన రెండు మెగా టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది హైదరాబాద్‌లోనే. అంతేకాదు జూనియర్ చాంపియన్ ట్రోఫీలో కూడా ఇక్కడ పాల్గొన్నాను. అందుకే హైదరాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. చారిత్రక సంపదకు నిదర్శనంగా కనిపించే భాగ్యనగరంలో అన్ని టూరిస్ట్ స్పాట్లు ఇష్టమే. చార్మినార్ అంటే చాలా ఇష్టం. ఇక హైదరాబాద్ వస్తే ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లను. ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు. ఇప్పట్లో సిటీలో చెస్ ట్రేనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనైతే లేదు. బ్రెయిన్ గేమ్.. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది విద్యార్థులు చెస్‌ను ప్రత్యేక హాబీగా ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో చెస్ క్రీడకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి స్కూల్లో విద్యార్థులు ఈ క్రీడను ప్రత్యేకంగా ఎంచుకోవడం శుభపరిణామం. చెస్ అనేది బ్రెయిన్ గేమ్ అని మరచిపోవద్దు. ఈ క్రీడను ఎంచుకుంటే అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఫిట్నెస్ కూడా చాలా అవసరం. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే మన మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. అప్పుడే ఈ రంగంలో రాణించగలం. ఇక తెలుగుతేజం కోనేరు హంపికి మంచి భవిష్యత్తు ఉంది. -
'నా జూదం ఫలించలేదు'
సోచి: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్నకలలు కల్లలు కావడంతో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఆటపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'చాలా ఉద్వేగభరిత క్షణాలు అవి. 27వ ఎత్తును బీజీ7 వేస్తే పరిస్థితి సమంగా ఉండేది. అయితే నా జూదం ఫలించలేదు. అందుకు తగిన శిక్ష పడింది. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమది. మొత్తంగా చూస్తే నల్ల పావులతో నేను బాగానే ఆడాను. అయితే మాగ్నస్ కార్ల్ సన్ మెరుగ్గా ఆడాడని అంగీకరించాలి' ఆనంద్ తెలిపాడు. అతను ఒత్తిడిని తనకంటే బాగా ఎదుర్కొన్నాడని,. అతనితో పోలిస్తే ఎక్కువ సార్లు తానే బలహీనంగా కనిపించానన్నాడు. ఈ ఓటమితో తాను చెస్ మానేయాలని అనుకోవడం లేదని ఆనంద్ తెలిపాడు. -
ఆనందం ఆవిరి
ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కలలు కల్లలయ్యాయి. ఏడాదిలోపు అదే ప్రత్యర్థి చేతిలో ఆనంద్‌కు మరో షాక్... పాయింట్లలో తేడా మినహా అదే ఫలితం పునరావృతం... మ్యాచ్‌ను ఆఖరి గేమ్ వరకు నడిపించాలంటే ఓడకుండా ఉండాల్సిన మ్యాచ్‌లో ఆనంద్ తప్పటడుగు వేశాడు. సాహసం చేయబోయి తాను వేసిన ఎత్తులో తానే చిక్కుకున్నాడు. ఫలితమే... మాగ్నస్ కార్ల్సన్ మోముపై మరోసారి చిరునవ్వు మెరిసింది. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చదరంగపు వేదికపై ‘కింగ్’ అనిపించుకున్నాడు. సోచి: విశ్వనాథన్ ఆనంద్-మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోరు ఒక గేమ్ ముందుగానే ముగిసింది. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో కార్ల్సన్ 45 ఎత్తులో ఆనంద్‌ను చిత్తు చేశాడు. ఫలితంగా 6.5-4.5 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే 27వ ఎత్తులో వేసిన ఎత్తు అతడిని విజయానికి దూరం చేసింది. ఈ పొరపాటును ఉపయోగించున్న మాగ్నస్, మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను విజయం వైపు తీసుకుపోయాడు. ఈ గేమ్ గెలిస్తే అవకాశాలు నిలిచి ఉంటాయని భావించిన ఆనంద్, అనవసరపు దూకుడు ప్రదర్శించాడు. ‘డ్రా’కు కూడా మంచి అవకాశం ఉన్న దశలో ధైర్యం చేసి భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అయితే అది పని చేయకపోగా, ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ 3 గేమ్‌లు, ఆనంద్ 1 గేమ్ గెలవగా, మిగతా 7 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఫలితం తేలిపోవడంతో మంగళవారం జరగాల్సిన 12వ గేమ్ ఇక నిర్వహించరు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్ల్సన్
సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో కార్ల్సన్ విజేతగా నిలిచారు. 11వ గేమ్‌లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌పై కార్ల్సన్ విజయం సాధించారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ** -
ఆనంద్‌కు చావోరేవో!
సోచి (రష్యా): పాయింట్ తేడాతో వెనుకంజ.. మిగిలినవి మరో రెండు గేమ్‌లు మాత్రమే... ఎలాంటి ఎత్తుగడ వేసినా ప్రత్యర్థి వద్ద నుంచి వస్తున్న దీటైన సమాధానం... మొత్తానికి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగే కీలకమైన 11వ గేమ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో ఆడనుండటం ఆనంద్‌కు ప్రతికూలాంశమే. ఈ గేమ్‌లో గనుక ఆనంద్ ఓడితే కథ ముగిసినట్టే. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరిదైన 12వ గేమ్‌లో ఆనంద్ తప్పనిసరిగా గెలవాలి. ఈ నేపథ్యంలో ఆనంద్‌కు 11వ గేమ్ తాడోపేడో లాంటిది. ‘డ్రా’గా ముగిసిన చివరి నాలుగు గేముల్లో ఆనంద్ పైచేయి సాధించినా వాటిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయాడు. -
మళ్లీ పంచుకున్నారు
సోచి (రష్యా): టైటిల్ ఆశలు నిలవాలంటే విజయం అవసరమైన చోట భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. ఆనంద్ వ్యూహాలకు తగిన సమాధానమిస్తూ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య శుక్రవారం జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. ప్రస్తుతం కార్ల్సన్ 5.5-4.5తో ఆధిక్యంలో ఉన్నాడు. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే 11వ గేమ్‌లో తెల్లపావులతో ఆడనున్న కార్ల్సన్ గెలిస్తే మరో గేమ్ మిగిలి ఉండగానే అతనికి టైటిల్ ఖాయమవుతుంది. ఈ ఈవెంట్లో ఐదోసారి తెల్లపావులతో ఆడిన ఆనంద్ గ్రున్‌ఫెల్డ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. తొలి 11 ఎత్తుల్లో వీరిద్దరూ దేనికి కూడా నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోలేకపోవడం వారిద్దరు ఎంత పక్కాగా సిద్ధమై వచ్చారో తెలుపుతోంది. ఒక దశలో ఆనంద్ కాస్త పైచేయి సాధించినట్లు కనిపించింది. 19వ ఎత్తులో ఆనంద్ గుర్రాన్ని జీ5 గడిలోకి పంపించాడు. ఆనంద్ వ్యూహమేమిటో అర్థంకాని కార్ల్సన్ దీనికి సమాధానం ఇవ్వడానికి ఏకంగా 33 నిమిషాల 49 సెకన్లు వెచ్చించి... తన ఒంటెను బీ4 గడిలోకి పంపించాడు. ఆ తర్వాత రెండు ఎత్తులకు... కార్ల్సన్ ఘోరమైన తప్పిదం చేస్తే తప్ప ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గడం సాధ్యం కాని పరిస్థితి తలెత్తింది. దాంతో 32 ఎత్తుల తర్వాత ఇద్దరూ ‘డ్రా'కు అంగీకరించారు. -
6 గంటలు... 122 ఎత్తులు... ‘డ్రా'
ఏడో గేమ్‌లో కార్ల్‌సన్‌ను నిలువరించిన ఆనంద్ సోచి (రష్యా): సహనానికి పరాకాష్టగా నిలిచిన గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లోని ఏడో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఈ గేమ్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తెల్లపావులతో ఆడి ఆధిపత్యం చలాయించినా ఆనంద్‌ను ఓడించలేకపోయాడు. సుమారు ఆరు గంటలకుపైగా 122 ఎత్తులపాటు సాగిన ఈ గేమ్‌ను ‘డ్రా’గా ముగించడంద్వారా ఆనంద్ తదుపరి గేమ్‌కు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత కార్ల్సన్ 4-3తో ఆధిక్యంలో ఉన్నాడు. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. బెర్లిన్ డిఫెన్స్‌లో ఏడో గేమ్‌ను మొదలుపెట్టిన కార్ల్సన్ ఆటతీరును విశ్లేషిస్తే కొన్నిసార్లు ఈ నార్వే ఆటగాడినే విజయం వరించేలా అనిపించింది. కానీ బెర్లిన్ డిఫెన్స్‌నే ఎంచుకున్న ఆనంద్ ఆద్యంతం పోరాడాడు. కార్ల్సన్ సహనాన్ని పరీక్షించాడు. ఒకదశలో ఎత్తులతో వీరిద్దరికి ఇచ్చిన స్కోరు షీట్ కూడా నిండిపోవడంతో కొత్త షీట్‌ను తీసుకున్నారు. ఆఖరికి ఆనంద్ వద్ద కేవలం రాజు... కార్ల్సన్ వద్ద గుర్రం, రాజు మిగిలాయి. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ‘సాధారణంగా ఇంత సుదీర్ఘంగా 122 ఎత్తుల పాటు గేమ్ సాగడం అరుదు. 80 ఎత్తుల తర్వాత డ్రా అని అర్థం అయింది. ఎప్పుడైనా పావులు ఎక్కువగా ఉన్నవారే డ్రాకు ప్రతిపాదిస్తారు. ఈ గేమ్ మొత్తం కార్ల్‌సన్‌కు పావులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక ఫలితం రాదు అనే వరకు తను డ్రా ప్రతిపాదించలేదు. ఇంత సుదీర్ఘంగా ఆడటం వల్ల ఆనంద్ అలసిపోయేలా చేయాలనేది బహుశా కార్ల్సన్ ఆలోచన కావచ్చు. ఈ గేమ్‌లో మొదటి 24 గేమ్‌ల వరకూ ఇద్దరు ప్రిపేర్ అయి వచ్చారు. అయితే ఆనంద్ ఆ తర్వాత క్రమంగా మైనస్‌లోకి వెళ్లాడు. ఏమైనా చాలా కష్టం అనుకున్న గేమ్‌ను ఆనంద్ డ్రా చేయగలిగాడు. కార్ల్సన్ చాలా రకాలుగా విజయం కోసం ప్రయత్నించినా ఆనంద్ పోరాడాడు.’ - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ -
చేజేతులా ఓడిన ఆనంద్
సోచి (రష్యా): నల్ల పావులతో ఆడుతున్నపుడు విజయావకాశాలు తక్కువగా వస్తాయి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తగిన ఫలితం వస్తుంది. సువర్ణావకాశం చేజారిందని తెలిస్తే... ఆ ప్రభావం ఆటపై పడి మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఆరో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఎదురైంది. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో ఆనంద్ చేజేతులా ఓడిపోయాడు. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ 37 ఎత్తుల్లో ఆనంద్‌పై గెలిచాడు. ఆరు గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 3.5-2.5తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం ఏడో గేమ్ జరుగుతుంది. ఇందులోనూ ఆనంద్ నల్లపావులతోనే ఆడతాడు. ఆనంద్‌తో జరిగిన ఆరో గేమ్‌లోని 26వ ఎత్తులో కార్ల్సన్ ఘోరమైన తప్పిదం చేశాడు. తన రాజును డి2 గడిలోకి పంపాడు. కార్ల్సన్ చేసిన పొరపాటును ఆనంద్ గ్రహించి తదుపరి ఎత్తులో తన గుర్రంతో ఈ5లోని కార్ల్సన్ బంటును చంపిఉంటే ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తప్పకుండా గెలిచేవాడు. కానీ ఆనంద్ ఈ సువర్ణావకాశాన్ని పసిగట్టకుండా కేవలం నిమిషంలోపే తన బంటును ఏ4లోకి పంపించి గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. ఆనంద్ చేసిన పొరపాటుతో కార్ల్సన్ ఊపిరి పీల్చుకొని మళ్లీ పుంజుకోవడమే కాకుండా గేమ్‌లోనూ విజయం సాధించాడు. ‘ప్రత్యర్థి నుంచి బహుమతి వస్తుందని ఆలోచనే లేనపుడు అది మనకు కనిపించదు’ అని తాను చేసిన తప్పిదంపై గేమ్ ముగిసిన తర్వాత ఆనంద్ వ్యాఖ్యానించాడు. వేగమే ఆనంద్‌ను ముంచింది గేమ్ ఆరంభంలో ఆనంద్ చాలా వేగంగా ఆడాడు. కార్ల్సన్ ఎత్తులకు బాగా సన్నద్ధమై వచ్చాడని అనిపించింది. అయినా గేమ్ మొదటి నుంచి కూడా వైట్స్‌తో ఆడిన కార్ల్సన్ ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. 26వ మూవ్ దగ్గర కార్ల్సన్ చాలా పెద్ద తప్పు చేశాడు. కానీ ఆనంద్ దానిని చూసుకోకుండా వేగంగా ఆడాడు. అక్కడ నైట్‌ను ఈ5లోకి పంపితే ఆనంద్ గేమ్ గెలిచేవాడు. ఆనంద్ స్థాయి ఆటగాడు కనీసం మూడు, నాలుగు నిమిషాలు ఆలోచించి ఉంటే సులభంగా దానిని కనిపెట్టేవాడు. కానీ ఎందుకో వేగంగా మూవ్ ఆడి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కార్ల్సన్ వెంటనే తప్పు తెలుసుకుని మళ్లీ పుంజుకున్నాడు. గెలిచే అవకాశాన్ని వదులుకున్న విషయం ఆనంద్‌కు తర్వాత తెలిసింది. బహుశా ఇది ప్రభావం చూపిందేమో... అక్కడి నుంచి క్రమంగా పట్టు కోల్పోయి గేమ్ ఓడాడు. - హరికృష్ణ -
ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం
సోచి: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఆరోగేమ్ లో ఆనంద్ పై ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ రోజు తెల్లపావులతో ఆడిన కార్ల్ సన్ ఎత్తులకు ఆనంద్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో 12 గేమ్ ల చాంపియన్ షిప్ లో కార్ల్ సన్ 3.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆనంద్ 2.5 పాయింట్లతో వెనుకబడ్డాడు. అంతకుముందు కార్ల్ సన్ రెండో గేమ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన గేమ్ లలో తొలి, నాలుగు, ఐదు గేమ్ లు డ్రా అవ్వగా, మూడో గేమ్ లో మాత్రమే ఆనంద్ కు విజయం దక్కింది. -
ఐదో గేమ్ డ్రా
ఆనంద్-కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌ను డ్రాగా ముగించాడు. సోచిలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డిఫెండింగ్ చాంప్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడుతున్న ఆనంద్‌కు గెలిచే అవకాశం వ చ్చినా వినియోగించుకోలేకపోయాడు. 39 ఎత్తుల అనంతరం ఈ గేమ్ డ్రాగా ముగిసింది. కీలకమైన ఈ గేమ్‌లో ఆనంద్ నెగ్గితే కార్ల్‌సన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచినట్టయ్యేది. ఇప్పటిదాకా జరిగిన ఐదు గేమ్‌ల్లో ఇది మూడో డ్రా. దీంతో చెరో విజయంతో ఇరువురు ఆటగాళ్లు 2.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఏడు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. తెల్ల పావులతో బరిలోకి దిగిన ఆనంద్ డి4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. 20వ ఎత్తు వరకు గేమ్‌లో ఆనంద్ కాస్త ఆధిక్యాన్నే ప్రదర్శించాడు. టోర్నీలో మూడోసారి క్వీన్ పాన్‌తో ఆటను ఆరంభించిన కార్ల్సన్ ఈ గేమ్ కోసం బాగానే సన్నద్ధం అయినట్టు కనిపించింది. తొలి గేమ్‌లో గ్రన్ఫీల్ట్ డిఫెన్స్‌ను ఉపయోగించుకున్న తను ఈ గేమ్‌లో మాత్రం క్వీన్ ఇండియన్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నాడు. 27వ ఎత్తు వద్ద ఆనంద్ రూక్‌ను ఎ4లోకి జరిపాడు. అలా కాకుండా బి7లోకి జరిపితే కొన్ని అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఉండేది. ఇక ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో గేమ్ డ్రాగా ముగిసింది. శనివారం ఆరో గేమ్‌లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు. ‘ఆనంద్ తాను గెలిచిన మూడో గేమ్ తరహాలోనే ఐదో గేమ్‌ను ఆరంభించాడు. అయితే కార్ల్సన్ మాత్రం కొత్తదనాన్ని ప్రయతిస్తూ క్వీన్స్ ఇండియన్ డిఫెన్స్‌తో ఆరంభించాడు. గేమ్‌లో ఆనంద్ మరోసారి దూకుడుగా ఆడుతూ విజయం కోసమే ప్రయత్నించాడు. అయితే కార్ల్సన్ ఎండ్ గేమ్‌లో బాగా ఆడి ఆనంద్‌ను నిలువరించగలిగాడు. ఒకసారి మినహా గేమ్ మొత్తంలో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. టోర్నమెంట్లో ఎప్పుడైనా మధ్య గేమ్‌లు కీలకం. ఇవే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు 6, 7 గేమ్‌లలో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడనున్నాడు. అతను దీనిని పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆనంద్ జాగ్రత్తతో ఉండటం అవసరం. ఇక్కడ తేడా వస్తే కోలుకోవడం కష్టం.’ - హరికృష్ణ -
‘డ్రా'నందం
సోచి (రష్యా): మూడో గేమ్‌లో విజయం అందించిన ఉత్సాహంతో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం ఐదో రౌండ్ గేమ్ జరుగుతుంది. మూడో గేమ్‌లో ఎదురైన ఓటమితో ఈసారి కార్ల్సన్ ఆచితూచి ఎత్తులతో స్పందించాడు. మరీ దూకుడుగా ఆడకుండా సంయమనంతో ఎత్తులు వేశాడు. కార్ల్సన్ ప్రతి ఎత్తుకు ఆనంద్ తగిన సమాధానమిస్తూ ముందుకుసాగాడు. ఈ గేమ్‌లో ఏదశలోనూ ఇద్దరికీ విజయావకాశాలు లభించలేదు. -
ఆనంద్, కార్ల్సన్ నాలుగో గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ మధ్య బుధవారం జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. నల్లపావులతో ఆడగా, కార్ల్సన్ తెల్లపావులతో పోటీ పడ్డాడు. నాలుగో గేమ్ ఫలితం తేలకపోవడంతో ఇరువురు క్రీడాకారులు రెండేసి పాయింట్లతో సముజ్జీలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో కార్ల్సన్, మూడో గేమ్ లో ఆనంద్ విజయం సాధించారు. -
దెబ్బకు దెబ్బ
సోచి (రష్యా): శక్తివంతమైన ప్రారంభం... స్పష్టమైన అం చనా... మంచి సాంకేతికత... శ్రేష్టమైన సమయపాలన.. వెర సి ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి విజయం. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో మంగళవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో ఆనంద్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తెల్లపావులతో ఆడుతూ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. నాలుగేళ్ల తర్వాత ఆనంద్ క్లాసిక్ విభాగంలో కార్ల్‌సన్‌పై తొలిసారి గెలిచాడు. 2010 లండన్ క్లాసిక్ టోర్నీలో భాగంగా కార్ల్‌సన్‌పై చివరిసారి 77 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్ ఆ తర్వాత ఈ నార్వే ప్లేయర్‌పై ఈ విభాగంలో నెగ్గలేకపోయాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్, కార్ల్సన్ 1.5-1.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నాలుగో గేమ్ బుధవారం జరుగుతుంది. తొలి రెండు గేముల్లో మంచి ఓపెనింగ్ చేసినా స్వయం తప్పిదాలతో తడబడిన ఆనంద్ ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం చేయలేదు. ఒకదశలో ఆనంద్ వేసిన ఎత్తులను కార్ల్సన్ అర్థం చేసుకోలేకపోయాడు. -
కొత్త వ్యూహాలతో...
కార్ల్సన్తో ఆనంద్ మూడో గేమ్ నేడు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ప్రపంచ పోరుకు పక్కాగా సిద్ధమైనా... తొలి రెండు గేముల్లో అనుకున్నరీతిలో రాణించలేకపోయిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త వ్యూహాలపై దృష్టి సారించనున్నాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో మంగళవారం జరిగే మూడో గేమ్‌లో ఆనంద్ ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి రెండు గేముల్లో ఆరంభంలో చక్కగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత ప్రత్యర్థి కార్ల్సన్ ఎత్తులకు తగిన సమాధానం ఇవ్వలేకపోయాడు. తదుపరి గేముల్లోనూ కార్ల్సన్ ఎత్తులకు దీటుగా జవాబు ఇవ్వకపోతే ఆనంద్ ఈ 12 గేమ్‌ల ఈవెంట్లో కోలుకోవడం కష్టమే. -
రెండో గేమ్‌లో కార్ల్సన్ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రెండోగేమ్‌లో భారత్ ఆటగాడు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో 12 గేమ్‌ల టోర్నీలో కార్ల్సన్ ఆధిక్యం లభించింది. ఆనంద్‌పై 35 ఎత్తుల్లో కార్ల్సన్ విజయం సాధించాడు -
‘డ్రా'తో మొదలైంది...
-
‘డ్రా'తో మొదలైంది...
సోచి (రష్యా): కొత్త ప్రయోగాలు చేయకుండా... సాహసోపేత ఎత్తులు వేయకుండా... ఆద్యంతం ఆచితూచి ఆడటంతో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ (భారత్), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ల మధ్య తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 48 ఎత్తుల ఆనంతరం గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేదని భావించిన ఆనంద్, కార్ల్సన్ ‘డ్రా’కు అంగీకరించారు. గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కార్ల్‌సన్‌పై ఒక్క గేమ్ కూడా గెలువలేకపోయిన ఆనంద్ ఈసారి తన వ్యూహాలకు మరింత పదును పెట్టుకొని బరిలోకి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెల్లపావులతో ఆరంభంలో ఆనంద్ వేసిన కొన్ని ఎత్తులకు సమాధానం ఇవ్వడానికి కార్ల్సన్ చాలా సమయమే తీసుకున్నాడు. గేమ్ మొదట్లో ఆనంద్‌దే పైచేయి కనిపించినా... పట్టుదలకు మారుపేరైన కార్ల్సన్ నెమ్మదిగా గేమ్‌లోకి వచ్చాడు. 24 ఎత్తులు ముగిసేసరికి కార్ల్‌సన్‌కే కాస్త అనుకూలత ఉన్నప్పటికీ ఆనంద్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో గేమ్ ‘డ్రా’ దిశగా సాగింది. తన ప్రత్యర్థి పొరపాట్లు చేయాలని, దాని ద్వారా తాను లాభం పొందాలని కార్ల్సన్ శతవిధాలా ప్రయత్నించాడు. చివర్లో ఆనంద్‌కు ఇబ్బందికర పరిస్థితి తప్పదేమో అనిపించింది. అయితే కార్ల్సన్ 42వ ఎత్తులో తన ఏనుగును ఈ3 గడిలో బదులు ఈ2 గడిలోకి పంపించడంతో ఆనంద్‌కు ఊరట లభించింది. గేమ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో కార్ల్సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు. -
పైచేయి ఎవరిదో!
సోచి (రష్యా): సొంతగడ్డపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విశ్వనాథన్ ఆనంద్... మళ్లీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచ చదరంగంపై పట్టు సాధించాలని మాగ్నస్ కార్ల్సన్.... ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య శనివారం ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు తొలి గేమ్‌తో తెరలేవనుంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకుండా కార్ల్సన్ నెగ్గినతీరు అందర్నీ అబ్బురపరిచింది. అదే సమయంలో ఆనంద్ ఓడిన విధానం ఆందోళన కలిగించింది. ఏడాది తిరిగేలోపు మళ్లీ వీరిద్దరూ ప్రపంచ టైటిల్ కోసం సిద్ధమయ్యారు. ఈసారీ కార్ల్‌సన్‌ను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నప్పటికీ... ఆనంద్‌ను మాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. గత ఏడాది మాదిరిగా ఏకపక్షంగా కాకుండా... ఈసారి పోరు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. {పపంచ చాంపియన్ అయ్యాక... క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి మళ్లీ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందిన రెండో క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. గతంలో అనతోలి కార్పోవ్ (రష్యా-1987, 1990లో) రెండుసార్లు ఈ విధంగా అర్హత సాధించాడు. విక్టర్ కార్చునోయ్ తర్వాత పెద్ద వయస్సులో క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన రెండో ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. కార్చునోయ్ 46 ఏళ్లకు (1977లో), ఆనంద్ 44 ఏళ్లకు ఈ టోర్నీని గెలిచారు. ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి చెస్ ప్లేయర్‌గా మాగ్నస్ కార్ల్సన్ గుర్తింపు పొందాడు. 24 ఏళ్ల తర్వాత అదే ప్రత్యర్థుల మధ్య వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. గతంలో కాస్పరోవ్ (రష్యా), అనతోలి కార్పోవ్ (రష్యా) ఈ విధంగా ఐదుసార్లు (1984, 1985, 1986, 1987, 1990) తలపడ్డారు. ముఖాముఖి అన్ని టైమ్ ఫార్మాట్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) లలో కలిపి ఆనంద్, కార్ల్సన్ ముఖాముఖిగా 79 సార్లు తలపడ్డారు. క్లాసికల్ ఫార్మాట్లో 38 సార్లు పోటీపడగా.. ఆనంద్ ఆరుసార్లు, కార్ల్సన్ ఏడుసార్లు గెలిచారు. మిగతా గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. వేదిక 2014 వింటర్ ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన రష్యాలోని సోచి పట్టణంలోని ఒలింపిక్ మీడియా సెంటర్. సమయం భారత కాలమానం ప్రకారం అన్ని రౌండ్ల గేమ్‌లు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. గేమ్ జరిగేదిలా... తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు. ఆ తర్వాత 20 ఎత్తులకు 60 నిమిషాలు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు. 61వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు అదనంగా 30 సెకన్లు కలుస్తాయి. {పతి గేమ్ ప్రారంభ సమయానికి కనీసం 10 నిమిషాల ముందే ఇద్దరు ఆటగాళ్లు భద్రత తనిఖీల కోసం వేదిక వద్దకు చేరుకోవాలి. ఇద్దరు ఆటగాళ్లు 30వ ఎత్తులోపు ‘డ్రా’ కోసం ప్రతిపాదన చేయకూడదు. తప్పనిసరి అయితే చీఫ్ ఆర్బిటర్ అంగీకారంతోనే ఇలా జరగాలి. గేమ్ సందర్భంగా ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చీఫ్ ఆర్బిటర్ కనిష్టంగా ఐదు వేల యూరోలు జరిమానా విధిస్తారు. -
ఆనంద్‌కు ‘మాస్టర్స్' టైటిల్
బిల్బావో (స్పెయిన్): ప్రతిష్టాత్మక బిల్బావో చెస్ మాస్టర్స్ ఫైనల్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి చేజిక్కించుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే ఈ టోర్నీలో ఆనంద్‌కు టైటిల్ ఖాయమైంది. రౌండ్ రాబిన్ లీగ్ రెండో దశలో భాగంగా శుక్రవారం పొనమరియోవ్ (ఉక్రెయిన్)తో జరిగిన ఐదో గేమ్‌ను ఆనంద్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిం చాడు. ఈ రౌండ్ తర్వాత 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు అరోనియన్ (ఆర్మేనియా), ఫ్రాన్సిస్కో వలెజో (స్పెయిన్)ల మధ్య జరిగిన గేమ్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యింది. దాంతో అరోనియన్ 7 పాయిం ట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆనంద్, అరోనియన్ల మధ్య చివరిదైన ఆరో రౌండ్ గేమ్ శనివారం జరుగుతుంది. -
ఆనంద్‌కు తొలి ‘డ్రా
బిల్బావో (స్పెయిన్): బిల్బావో ఫైనల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో నెగ్గిన ఆనంద్ ప్రస్తుతం 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
అజేయ ఆనంద్
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ 14 రౌండ్ల టోర్నీలో ఆనంద్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు 95 వేల యూరోలు (రూ. 78 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ 11 గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగతా మూడు గేముల్లో గెలిచాడు. ఈ టైటిల్‌తో ఆనంద్ ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడేందుకు అర్హత సాధించాడు. -
ఆనంద్ అదుర్స్
క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ సొంతం కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్లో మరో గేమ్ మిగిలి ఉండగానే విజేతగా నిలవడం ద్వారా మాగ్నస్ కార్ల్సన్తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. నవంబర్ 5 నుంచి 25 వరకు జరిగే ఈ పోటీకి త్వరలో వేదికను ప్రకటిస్తారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆనంద్.. గత ఏడాది కార్ల్‌సన్‌కు టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం కర్జాకిన్ (రష్యా)తో జరిగిన 13వ రౌండ్‌ను ఆనంద్ 91 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మొత్తం 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేత అయ్యాడు. ఆంద్రికిన్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), కర్జాకిన్ (రష్యా), అరోనియన్ (అర్మేనియా), మమెదైరోవ్ (అజర్బైజాన్) 6.5 పాయింట్ల తో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. -
వరల్డ్ కేండిడేట్స్ చెస్‌లో ఆనంద్ దూకుడు
-
ఆనంద్ శుభారంభం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. గురువారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ 47 ఎత్తుల్లో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)పై విజయం సాధించాడు. మొత్తం ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతాడు. శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో వాసిలిన్ తొపలోవ్‌తో ఆనంద్ ఆడతాడు. -
ఆనంద్‌కు పరీక్ష
నేటి నుంచి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): స్వదేశంలో గతేడాది కోల్పోయిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కిరీటాన్ని ఈసారి దక్కించుకునే క్రమంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి పరీక్షకు సిద్ధమయ్యాడు. బుధవారం మొదలయ్యే క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)తో తలపడే ప్రత్యర్థి ఎవరో నిర్ణయిస్తారు. ఈనెల 31 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్స్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడనున్నారు. ఆనంద్‌తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా) బరిలో ఉన్నారు. విజేతగా నిలిచిన వారు ఈ ఏడాది చివర్లో కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతారు. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం జరిగే తొలి రౌండ్లో అరోనియన్‌తో ఆనంద్; తొపలోవ్‌తో మమెదైరోవ్; కర్జాకిన్‌తో స్విద్లెర్; క్రామ్నిక్‌తో ఆంద్రికిన్ ఆడతారు. 6 లక్షల యూరోల (రూ. 5 కోట్ల 6 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతకు 1,35,000 యూరోలు (రూ. కోటీ 14 లక్షలు) లభిస్తాయి. -
ఆనంద్‌కు నిరాశ
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఓటమి తర్వాత తాను పాల్గొన్న రెండో టోర్నమెంట్లోనూ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు నిరాశ ఎదురైంది. లండన్ క్లాసిక్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్... మంగళవారం ముగిసిన జ్యూరిచ్ క్లాసిక్ టోర్నీలో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్ల మధ్య క్లాసిక్, ర్యాపిడ్ విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ఐదు పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) 10 పాయింట్ల తో విజేతగా నిలువగా... ఫాబియానో (ఇటలీ), అరోనియన్ (అర్మేనియా) తొమ్మిది పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానాన్ని సంపాదించారు. ర్యాపిడ్ విభాగంలో ఆనంద్ ఐదు గేమ్‌లు ఆడగా... అరోనియన్, నకముర, ఫాబియానో చేతిలో ఓడిపోయి... కార్ల్సన్, గెల్ఫాండ్లతో ‘డ్రా’ చేసుకున్నాడు. -
కార్ల్సన్తో ఆనంద్ గేమ్ ‘డ్రా’
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో సోమవారం జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఐదో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు ఆదివారం ఆలస్యంగా ముగిసిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్కిదే తొలి విజయం కావడం విశేషం. తొలి రెండు గేముల్లో ఓటమిపాలైన ఆనంద్ మూడో గేమ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆనంద్ ఈ టోర్నీలో మూడున్నర పాయింట్లు సంపాదించాడు. -
ఆనంద్‌కు అచ్చిరాలేదు!
భారత చదరంగ రారాజుగా వెలుగొందున్న విశ్వనాథన్ ఆనంద్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషీకి 2013 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలన్న అతడి ఆశలు సఫలం కాలేదు. సొంతగడ్డపై వరల్డ్ విజేతగా నిలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. చెన్నైలో నవంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ చెస్ పోటీలో ఆనంద్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఒత్తిడి లోనయి తన వయసులో సగం వయసున్న కార్ల్సెన్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్నాడు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత పట్టుసడలించాడు. ఈ బిగ్ ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమయినప్పటికీ కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థి ఆటకట్టించే స్థాయిలో ఎత్తులు వేయకపోవడంతో ఆనంద్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోలేకపోయాడు. ఇక డిసెంబర్లో జరిగిన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోనూ విశ్వనాథన్ ఉస్సూరనిపించాడు. వరల్డ్ టైటిల్ ఓటమి నుంచి తేరుకోక ముందే మరో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థుల ముందు అతడి ఎత్తులు పారకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌లోనే టోర్ని నుంచి నిష్క్రమించాడు. మే నెలలో జరిగిన నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్లో కూడా ఆనంద్‌కు కలిసి రాలేదు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో తడబడి టైటిల్ కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2013 మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడాలని విశ్వానాథన్ ఆనంద్ తపిస్తున్నాడు. విజయం కోసం తహతహ లాడుతున్నాడు. గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే వయసు తనకు అడ్డంకి కాదంటున్నాడు 44 ఏళ్ల ఈ చదరంగ మేధావి. టాప్‌టెన్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తాను ఆ దిశగా ఆలోచించడం లేదంటున్నాడు. అయితే 50 ఏళ్లు వచ్చే వరకు చెస్ ఆడనని స్పష్టం చేశాడు. ఎన్నేళ్లకు రిటైర్ అవుతానన్నది మాత్రం చెప్పలేదు. 2014 తనకు కలిసొస్తుందని విషీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మార్చిలో జరగనున్న ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచేందుకు సన్నద్దమవుతున్నాడు. -
ఆనంద్ శుభారంభం
లండన్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పరాజయం తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ తొలి విజయం సాధించాడు. గ్రూప్ ‘ఎ’లో ల్యూక్ మెక్‌షేన్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి గేమ్‌లో ఆనంద్ నల్లపావులతో ఆడుతూ 46 ఎత్తుల్లో గెలిచాడు. మొత్తం 16 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్‌లో నలుగురికి చోటు కల్పించారు. లీగ్ దశ గేమ్‌లు ముగిశాక ఒక్కో గ్రూప్ నుంచి ఇద్దరు చొప్పున క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘ఎ’లో ఆనంద్‌తోపాటు ల్యూక్ మెక్‌షేన్, మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), ఆండ్రియా ఇస్ట్రాటెస్కూ (ఫ్రాన్స్) ఉన్నారు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఆనంద్ బుధవారం 44వ వడిలోకి అడుగుపెట్టాడు. -
కార్ల్సెన్కు రూ. 9.90 కోట్లు
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవం సోమవారం జరిగింది. కొత్త చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)కు రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని అందజేశారు. కేవలం 10 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత కార్ల్సెన్కు ఆలివ్ ఆకులతో కూడిన దండను మెడలో వేసి... బంగారు పూతతో కూడిన ట్రోఫీని, రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీ చెక్నూ అందజేశారు. అనంతరం రన్నరప్ విశ్వనాథన్ ఆనంద్‌కు వెండి పళ్లెంతోపాటు రూ. 6 కోట్ల 3 లక్షల ప్రైజ్‌మనీని బహూకరించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్జినవ్ వరుసగా కార్ల్సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వైఫల్యం చెందినప్పటికీ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను తమ బ్రాండ్అంబాసిడర్గా కొనసాగిస్తామని ఐటీ శిక్షణ సంస్థ ‘నిట్’ స్పష్టం చేసింది. -
కార్ల్సెన్కు ప్రపంచ చెస్ టైటిల్
-
ప్రపంచ చెస్ చాంపియన్ కార్లసన్
అనుకున్నంతా అయ్యింది. ఐదు సార్లు వరుసగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి తలవంచాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్‌ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఒకప్పుడు చెస్ అంటే రష్యన్లదేనని భావన ఉండేది. అప్పట్లో గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పోవ్ దిగ్గజాల్లా ఉండి, వాళ్లే చెస్ కిరీటాలు సాధిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో మన దేశం నుంచి వెళ్లిన విశ్వనాథన్ ఆనంద్ వాళ్లిద్దరినీ మట్టికరిపించి, ప్రపంచ చెస్ విజేతగా నిలిచాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు. తన ఆటతీరు పట్ల చాలా అసంతృప్తి చెందానని ఓటమి తర్వాత విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఆనంద్ ఎప్పటికీ చాలా గొప్ప ఆటగాడని, తనకు ఆయనంటే ఎంతో గౌరవమని కార్ల్సన్ అన్నాడు. అలాగే ఆయనపై విజయం సాధించడమంటే చాలా గౌరవప్రదంగాను, సంతోషంగాను భావిస్తున్నట్లు తెలిపాడు. -
ఆనందం దూరమవుతోంది
చెన్నై: రెండు గేమ్‌లలో వరుస ఓటముల తర్వాత ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఏడో గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన వ్యూహాన్ని రచించలేక డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. దీంతో మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)తో సోమవారం జరిగిన ఈ గేమ్ 32 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా నార్వే ప్లేయర్ 4.5-2.5తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టైటిల్ గెలవాలంటే ఆనంద్ మిగిలిన ఐదు గేమ్‌ల ద్వారా నాలుగు పాయింట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగితే అద్భుతమే అనుకోవాలి. ఇప్పటికే బెర్లిన్ డిఫెన్స్‌తో ఆనంద్ టీమ్‌కు ఇబ్బందులు సృష్టించిన కార్ల్సెన్ ఏడో గేమ్‌లోనూ నల్లపావులతో అదే వ్యూహంతో బరిలోకి దిగాడు. దీంతో గేమ్‌లో ముందుకెళ్లేందుకు విషీకి సరైన దారి దొరకలేదు. రూయ్ లోపెజ్ డిఫెన్స్‌కు దగ్గరగా వెళ్లిన ఆనంద్ ఐదో ఎత్తు వద్ద నైట్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాడు. తెల్లపావులతో ఆడే ఆటగాడికి ఇంతకంటే మెరుగైన ఎత్తు వేసే అవకాశం లేకున్నా... కౌంటర్ అటాక్‌కు కార్ల్సెన్కు మాత్రం చాలా దారులు లభించాయి. గత రెండింటిలో ఎండ్గేమ్ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆనంద్... ఈ గేమ్‌లో జాగ్రత్తలు తీసుకున్నాడు. 10వ ఎత్తు వద్ద ఆనంద్ కాస్త ఆధిక్యంలో కనిపించినా... గేమ్‌ను గెలిచేంత అవకాశం రాలేదు. కింగ్ రూక్పాన్ను ఉపయోగించి వేసిన 15వ ఎత్తుతో భారత ప్లేయర్ కొత్త వ్యూహాన్ని అమలుపర్చాడు. అయితే బలహీనమైన ఈ ఎత్తుగడకు కార్ల్సెన్ రూక్తోనే చెక్ పెట్టాడు. దీంతో క్వీన్, నైట్‌తో ఎండ్‌గేమ్ మొదలైంది. ఆనంద్ కొన్ని పాన్లను మార్చుకుంటూ ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో 32వ ఎత్తు వద్ద డ్రాకు అంగీకరించాడు. నేడు ఎనిమిదో గేమ్ జరగనుంది. చివరి రెండు గేమ్‌ల్లో ఓటమి తర్వాత ఈ ఫలితం రావడం కాస్త అనుకూలమే. అయితే ఈ గేమ్‌లో అవకాశాలు లభించినా విజయం సాధ్యం కాలేదు. ఇంతకుముందు ఇద్దరం ఇదే లైన్లో ఆడాం. కార్ల్సెన్ బిషప్ వైపు మొగ్గడంతో నేను భిన్నమైన ఎత్తుగడలోకి వెళ్లా. వైట్‌కు ఉన్నవి రెండే మార్గాలు. కింగ్సైడ్ను బ్రేక్ చేయడం లేదా ఫ్లాంక్ మీద ఆడటం. నైట్‌తో ఆడాలని సిద్ధమైనప్పుడు ఎఫ్4ను ఉపయోగించడం సరైంది కాదు. తర్వాతి గేమ్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తా. -ఆనంద్ ఒకే లైన్లో ఇద్దరం ఆడినప్పటికీ భిన్నమైన ప్రణాళికలు అనుసరించాం. ఎలాంటి ఎత్తుగడ అయినా గేమ్ సాగుతున్న కొద్దీ నెమ్మదవుతుంది. కొంత ఇబ్బంది ఎదురైనా ఈ గేమ్‌లో నేను బాగానే ఆడా. కొన్ని మానసిక అంశాలు కూడా ఈ టోర్నీలో ముడిపడి ఉన్నాయి. ఐదో గేమ్ ఫలితం తర్వాతి రెండు గేమ్‌లపై ప్రభావం చూపింది. దీన్ని విస్మరించలేం. - కార్ల్సెన్ -
రక్షణాత్మకంగా ఆడాడు
రెండు వరుస ఓటముల తర్వాత ఆనంద్ ఏడో గేమ్‌ను డ్రా చేసుకోగలిగాడు. చివరి రెండు గేమ్‌లతో పోలిస్తే ఇదేమీ చెత్త ఫలితం కాదు. ఆనంద్ తెల్లపావులతో చావో రేవో అన్నట్లుగా ఆడతాడని భావించా. కానీ రక్షణాత్మకంగా ఆడటానికే మొగ్గు చూపాడు. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో కార్ల్సెన్ మూడుసార్లు తెల్లపావులతో ఆడతాడు. ముందుగా ఏడో గేమ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్‌ను మార్చకూడదని ఆనంద్ నిర్ణయించుకోవడంతో 1.ఈ4తో గేమ్ మొదలైంది. డీ4 లేదా సీ4తో గేమ్‌ను ప్రారంభిస్తాడని నేను ఊహించా. కానీ విషీ మొదటి దానికే కట్టుబడ్డాడు. గేమ్‌లో ఇప్పటికే మంచి ఫలితాన్ని చూపిస్తున్న బెర్లిన్ డిఫెన్స్ వైపే కార్ల్సెన్ మొగ్గు చూపాడు. ఐదో ఎత్తులో ఆనంద్ బీసీ6తో కొత్త వ్యూహాన్ని అవలంభించాడు. నా ఉద్దేశంలో ఇది బలమైన ఎత్తుగడ. గేమ్ సాగుతున్నకొద్దీ చాలా పావులు పరస్పరం చేతులు మారాయి. ఈ దశలో ఆనంద్ కాస్త ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించాడు. కానీ కార్ల్సెన్ సరైన ఎత్తులతో ఆకట్టుకున్నాడు. చివరకు గేమ్‌లో పురోగతి కనిపించకపోవడంతో 32 ఎత్తుల వద్ద పాయింట్‌ను పంచుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు అంగీకరించారు. ఏడు గేమ్‌ల తర్వాత కార్ల్సెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రెండే గేమ్‌లు గెలిచినా... నాలుగో గేమ్ నుంచే అతను పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టోర్నీలో పోరాడాలంటే ఆనంద్ వ్యూహాలతో పాటు ఓపెనింగ్నూ మార్చాల్సిన అవసరం ఉంది. ఫలితంపరంగానే కాకుండా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే నేటి మ్యాచ్ చాలా ప్రధానమైంది. మూడో గేమ్‌లో మాదిరిగా ఈ గేమ్‌లోనూ ఆనంద్ ప్రత్యర్థిపై ఒత్తిడి కలుగజేస్తాడని ఆశిద్దాం -
60వ ఎత్తు దెబ్బ తీసింది
ఆరో గేమ్‌లో ఓడ టం ఆనంద్‌కు మరో బాధాకరమైన అంశం. ఎండ్‌గేమ్ ను రూక్, పాన్‌తో ఆడటం వల్ల ఓ దశలో గేమ్ డ్రా దిశగా వెళ్లింది. అయితే ఆనంద్ 60వ ఎత్తు ఆర్ఏ4 వేసి తప్పిదం చేశాడు. దీనికి బదులుగా బీ4ను వేస్తే గేమ్ డ్రా అయ్యేది. ఇప్పుడు కార్ల్సెన్ 4-2 ఆధిక్యంలో ఉన్నాడు. ఓపెనింగ్‌లో విషీ దూకుడైన ఎత్తులతో అలరించాడు. నైట్‌ను త్యాగం చేస్తూ ఈ గేమ్‌కు కూడా బాగానే సిద్ధమయ్యాడు. అయితే కార్ల్సెన్ మాత్రం ఆనంద్‌కు అనుమానం రాకుండా భిన్నమైన ఎత్తుగడతో బరిలోకి దిగాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ కాస్త సానుకూల దృక్పథంతో ఆడాడు. రూక్ ఎండ్ గేమ్‌లో బలవంతంగా పాన్‌ను త్యాగం చేశాడు. గేమ్ ముందుకెళ్లే కొద్దీ సాంకేతికంగా గేమ్‌ను డ్రా చేసుకోవడానికి భారత గ్రాండ్‌మాస్టర్ మరో పాన్‌ను చేజార్చుకున్నాడు. ఈ అశ్చర్యకరమైన ఎత్తును కార్ల్సెన్ మిస్సయ్యాడు. అయితే 60వ ఎత్తులో ఆనంద్ చేసిన తప్పిదంతో మలుపు తీసుకుంది. -
ఆనంద్‌కు మళ్లీ షాక్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకోలేక చేతులెత్తేశాడు. దీంతో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) 67 ఎత్తులతో విజయం సాధించాడు. ఫలితంగా ఈ టోర్నీలో 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టిన నార్వే కుర్రాడు బోర్డుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. గేమ్ ముందుకెళ్తున్న కొద్దీ భిన్నమైన ఎత్తుగడలతో ఆనంద్‌ను కట్టిపడేశాడు. మరోవైపు ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన ప్రతి వ్యూహాన్ని అవలంభించలేకపోయిన భారత ప్లేయర్ కీలక సమయంలో పూర్తిగా తడబడ్డాడు. రూయ్ లోపెజ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టినా... క్రమంగా పట్టు కోల్పోయాడు. ఓ దశలో 20 ఎత్తుల వరకు సాఫీగా సాగినా...మిడిల్ గేమ్ మొత్తం కార్ల్సెన్ ఆధిపత్యం నడిచింది. చివర్లో క్వీన్, రూక్, పాన్లతో ఎండ్‌గేమ్ మొదలుకావడంతో ఆనంద్ ఆత్మరక్షణలో పడిపోయాడు. దీన్ని అదునుగా చేసుకున్న కార్ల్సెన్ ఎదురుదాడి చేసి పాన్, రూక్‌ను సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ 56వ ఎత్తు వద్ద కూడా సాంకేతికంగా గేమ్ డ్రా అయ్యే అవకాశాలున్నా... కార్ల్సెన్ దూకుడుకు విషీ తప్పులను పునరావృతం చేశాడు. చివరకు మరో 11 ఎత్తుల తర్వాత ఆనంద్ ఓటమిని అంగీకరించాడు. -
నేటి నుంచి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
చెన్నై: చెస్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు నేడు (శనివారం) తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్, నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)తో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడనున్నాడు. ఈనెల 28 వరకు స్థానిక హయత్ రీజెన్సీ హోటళ్లో ఈ ఈవెంట్ జరగనుంది. అనుభవానికి, యువ జోరుకు మధ్య జరుగుతున్న సమరంగా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న ఈ మ్యాచ్‌లో విజేత ఎవరో విశ్లేషకులు కూడా అంత తేలిగ్గా చెప్పలేకపోతున్నారు. ఐదు సార్లు ఈ టైటిల్ నెగ్గిన 44 ఏళ్ల ఆనంద్.. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా చెస్ మేధావిగా పిలిపించుకుంటున్న యువ సంచలనం కార్ల్సెన్ మధ్య జరిగే ఈ గేమ్‌ను 1972లో బాబీ ఫిషర్, బోరిస్ స్పాస్కీ మధ్య జరిగిన ఆటతో పోల్చుతున్నారు. తొలి గేమ్‌ను కార్ల్సెన్ తెల్ల పావులతో ఆడనుండడం సానుకూలంగా కనిపించినా అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతీ ఆటగాడు ఈ 12 గేమ్‌ల్లో ఆరేసి సార్లు తెల్ల పావులు, నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఆనంద్‌కు అనుభవమే అయినా తొలిసారి ఈ మెగాపోరులో అడుగుపెట్టిన కార్ల్సెన్కు మాత్రం కొత్తే అని చెప్పుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోని ఈ కుర్రాడు అపార అనుభవజ్ఞుడిని ఎలా ఎదుర్కొంటాడనేది చెస్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. -
ఆనంద్ తొలి గేమ్ నల్లపావులతో
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను నల్ల పావులతో ఆరంభించనున్నాడు. 12 రౌండ్ల పాటు జరిగే ఈ పోరులో ఆనంద్ నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీపడనున్నాడు. ఈనెల 9 నుంచి 28 వరకు స్థానిక హయత్ రీజెన్సీ హోటళ్లో పోటీ జరుగుతుంది. ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన తమిళనాడు సీఎం జయలలిత డ్రా తీశారు. తొలి బౌల్ నుంచి ఆనంద్ ఫొటోను, ఇంకో బౌల్ నుంచి నల్ల పావును బయటికి తీశారు. వెంటనే అక్కడున్న ప్రేక్షకులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ డ్రా ఫలితంతో ఆనంద్ వరుసగా ఆరు, ఏడు గేమ్‌ల్లో తెల్ల పావులతో ఆడే అవకాశం చిక్కనుంది. నిబంధనల ప్రకారం తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ఆటగాడు ఏడో గేమ్‌లో నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. 2000, 2007, 2008, 2010 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకున్న సమయంలో ఆనంద్ నల్ల పావులతోనే ఆటను ప్రారంభించాడు. 2012లో మాత్రం తెల్ల పావులతో ఆడాడు. ‘భారత్ నుంచి ఆనంద్ అత్యుత్తమ ఆటగాడు’ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గురువారం ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇరువురు ఆటగాళ్లతో పాటు ఫిడే అధ్యక్షుడు కిర్సన్ ఇల్యుమ్‌జినోవ్ తదితరులు హాజరయ్యారు. ఏడుగురు వర్ధమాన చెస్ ఆటగాళ్లు ఆనంద్, కార్ల్సెన్లను వెంటబెట్టుకుని వేదికపైకి తీసుకొచ్చారు. వీరికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ‘దేశంలో చెస్‌కు పర్యాయపదం ఆనంద్. అంతేకాకుండా ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. ఇంతటి అద్భుత ఆటగాడు చెన్నై నుంచి ఎదగడం అమితానందాన్ని కలిగిస్తోంది’ అని జయలలిత కొనియాడారు. కార్ల్సెన్ను చెస్ మేధావిగా అభివర్ణించారు. దూకుడునే కొనసాగిస్తా.. ఆరో ప్రపంచ చాంపియన్ టైటిల్ సాధించేందుకు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోరులో తన ప్రత్యర్థిపై దూకుడు మంత్రాన్ని ప్రయోగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ఆనంద్‌కు గట్టి పోటీనే ఎదురుకాబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన కార్ల్సెన్.. ఆనంద్‌తో పోటీపడే అర్హత సాధించాడు. గురువారం నాటి విలేకరుల సమావేశంలో ఆనంద్ తన సన్నాహకాలను వివరించాడు. ‘ఎప్పటిలాగే ఈ ఈవెంట్‌కు కూడా కఠినంగానే సన్నద్ధమవుతున్నాను. కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాను. అందుకే బరిలోకి దిగేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భావిస్తున్నాను. పోటీ ఎలా ఉంటుందో మున్ముందు చూస్తారు. సొంత నగరంలో ఆడడం చాలా ఉత్సుకతగా ఉంది. దీనికి కారణం సీఎం జయలలిత. ఆమె పట్టుదల కారణంగానే ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది’ అని ఆనంద్ అన్నాడు. ఆనంద్ టీమ్ ఇదీ... అత్యంత ఆసక్తికరంగా సాగే ఈ మెగా టోర్నీలో ఆనంద్ తన సహాయకుల పేర్లను ప్రకటించాడు. వీరిలో ఇద్దరు భారత ఆటగాళ్లున్నారు. కె.శశికిరణ్, సాందీపన్ చందాలకు ఇందులో చోటు దక్కింది. ఇక రెగ్యులర్‌గా ఉండే రడోస్లావ్ వొటస్జెక్ (పోలండ్), గతంలో ఆనంద్‌తో చాలాసార్లు తలపడిన పీటర్ లెకో (హంగేరి) కూడా ఆనంద్ బృందంలో ఉన్నారు. నేను చెప్పను: కార్ల్సెన్ మరోవైపు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్సెన్ మాత్రం తన టీమ్‌ను బహిర్గతపరచలేదు. ‘ఆనంద్ జట్టు సభ్యులను అభినందిస్తున్నాను. అయితే నా వారి గురించి చెప్పను. భారత్‌లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. -
రెండు తరాల మధ్య పోరాటం
64 గడులు.. ఎత్తులు మాత్రం అనంతం... చెస్ బాగా ఆడే వ్యక్తిని మేథావి అనడం అతిశయోక్తి కాదు. అలాంటి చెస్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడెవరో తేల్చుకునే పోరాటం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు చెన్నై ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్ ఈ మెగా టైటిల్ కోసం పోరాడనున్నారు. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్ కాగా... కార్ల్సెన్ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్‌లో చెస్ ఖ్యాతిని పెంచిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. ఆనంద్ ఏం ఆడుతున్నాడు..? టోర్నీ ఎలా జరుగుతోంది..? ఎవరు ఎక్కడ తప్పు చేశారు..? ఎవరికి గెలిచే అవకాశం ఉంది..? ఇలాంటి ప్రశ్నలకు అందరికంటే బాగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి హరికృష్ణ. ఈ భారత గ్రాండ్ మాస్టర్, తెలుగుతేజం...ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ప్రివ్యూ, గేమ్‌ల విశ్లేషణలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తాడు. పెంటేల హరికృష్ణ ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య ప్రపంచ టైటిల్ పోరాటం కోసం మొత్తం చెస్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పోరుపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది రెండు తరాల మధ్య పోరాటం. ఇద్దరి మధ్యా 20 ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. బోట్వినిక్-తాల్ల మధ్య పోరాటం తర్వాత ఇంత వయసు తేడా ఉన్న ఆటగాళ్లు తలపడలేదు. అంతేకాదు... చాంపియన్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న వ్యక్తి టైటిల్ కోసం తలపడటం కూడా 1972 (ఫిషర్-స్పాష్కీల మ్యాచ్) తర్వాత ఇప్పుడే. క్లాసికల్ చెస్‌లో కార్ల్సన్ మీద ఆనంద్‌కు 6-3 విజయాల రికార్డు ఉంది. కానీ గత రెండు సంవత్సరాల్లో కార్ల్సెన్... ప్రపంచ చాంపియన్ మీద రెండుసార్లు గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి పోరులో 2007, 08,10 సంవత్సరాల్లో ఆనంద్ గెలిస్తే... 2009, 12,13 సంవత్సరాల్లో ప్రత్యర్థి నెగ్గాడు. ఇద్దరి విజయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే... మెరుగైన సన్నాహకాలు, అనుభవం ఆనంద్‌ను గెలిపించాయి. సాధారణంగా ప్రారంభంలోనే ఆనంద్ అడ్వాంటేజ్ తీసుకుని ఆ ఒత్తిడిని చివరి వరకూ కొనసాగిస్తాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నల్లపావులతో ఆనంద్ కార్ల్సన్ మీద గెలిచాడు. మరోవైపు కార్ల్సెన్ గెలిచినవన్నీ తెల్లపావులతో ఆడినవే. ఎండ్గేమ్లో కాస్త మెరుగ్గా ఆడటం వల్ల తనకి విజయాలు వచ్చాయి. 2012లో బిల్బావోలో జరిగిన గేమ్‌లో విజయం ఆనంద్‌పై కార్ల్సెన్కు అత్యుత్తమం. ఆనంద్ బాగా ఆడినా కార్ల్సెన్ 30 ఎత్తుల్లో గెలిచాడు. వీళ్లిద్దరి మధ్య చివరిసారి 2013లో తాల్ మెమోరియల్ టోర్నీలో గేమ్ జరిగింది. ఇందులోనూ 30 ఎత్తుల్లోపే కార్ల్సన్ నెగ్గాడు. ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 2012లో లండన్‌లో, 2013లో నార్వేలో జరిగిన రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు గేమ్‌ల్లోనూ ఆనంద్ నల్లపావులతో ఆడి ఒత్తిడిలోకి వెళ్లినా... పుంజుకుని డ్రాలు చేశాడు. మొత్తంమీద తెల్లపావులతో ఆడుతున్నప్పుడు కార్ల్సన్ ప్రమాదకారి. -
భారత్‌కు చేరిన ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్
చెన్నై: దేశమంతా సచిన్ టెండూల్కర్ ఫేర్వెల్ టెస్టు సిరీస్ ‘మేనియా’తో ఊగిపోతున్న సమయంలో.... చెస్‌లో అత్యున్నత సమరం కూడా మన దేశంలోనే జరుగబోతోంది. ఈనెల 9 నుంచి 28 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై వేదిక కానుంది. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య 12 రౌండ్ల పాటు ఈ పోరు జరుగనుంది. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ రికార్డు స్థాయిలో రూ.29 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పోరు కోసం సోమవారం కార్ల్సన్ చెన్నై చేరుకున్నాడు. అతడికి ఫిడే ఉపాధ్యక్షుడు డీవీ సుందర్, ఏఐసీఎఫ్ అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్, ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వాహక కార్యదర్శి వి.హరిహరన్ స్వాగతం పలికారు. 2012 మాస్కోలో జరిగిన చివరి చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆనంద్ 6-6, 2.5-1.5 (టైబ్రేక్) తేడాతో గెల్ఫాండ్ను ఓడించాడు. అయితే ఇప్పటిదాకా కార్ల్సన్, ఆనంద్ పలు గేమ్స్‌లో ముఖాముఖి తలపడినా నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడలేదు. 2005 నుంచి ఇప్పటిదాకా 62 గేమ్స్‌లో ఆనంద్ 15 సార్లు, కార్ల్సన్ 11 సార్లు గెలవగా 36 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. క్లాసికల్ చెస్‌లో ఆడిన 29 గేమ్‌ల్లో ఆనంద్ ఆరు సార్లు, కార్ల్సన్ మూడు సార్లు నెగ్గారు. 7న టోర్నీ ఆరంభం ఈనెల 7న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత టోర్నీని ఆరంభిస్తారు. 9న తొలి గేమ్ జరుగుతుంది. ఒక్కో ఆటగాడు ఆరు సార్లు తెల్ల పావులు, ఆరు సార్లు నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ గేమ్ ఆరు గంటలపాటు ఉంటుంది. ఏ ఆటగాడైతే ముందుగా 6.5 పాయింట్లు సాధిస్తే అతడినే విజేతగా ప్రకటిస్తారు. ఓవరాల్ ప్రైజ్ మనీ రూ.14 కోట్లు కాగా టైటిల్ నెగ్గిన ఆటగాడికి 60 శాతం, రన్నరప్‌కు 40 శాతం సొమ్ము దక్కుతుంది. టోర్నీ వేదిక హోటల్ హయత్ రెజెన్సీకి ఆనంద్‌తో పాటు అతడి భార్య, కుమారుడు శుక్రవారమే చేరుకున్నారు. అయితే కార్ల్సన్ మాత్రం బయటకు వెల్లడించని రిసార్ట్‌లో బస చేస్తాడని సమాచారమున్నా అధికారికరంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫిడే ఉపాధ్యక్షుడు సుందర్ చెప్పారు. తమకు తెలిసి అతడు కూడా హయత్‌లోనే ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కార్ల్సన్ వెంట అతడి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు, సహాయక సిబ్బంది వచ్చారు. ఈ టోర్నీ కారణంగా హోటళ్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు