
జ్యూరిక్ చెస్ టోర్నీ: ఆనంద్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎనిమిది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ మధ్య జరిగిన జ్యూరిక్ అంతర్జాతీయ చెస్ చాలెంజ్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో క్లాసికల్ (7 రౌండ్‌లు), బ్లిట్జ్ (14 రౌండ్‌లు) విభాగాల్లో గేమ్‌లు జరిగాయి. క్లాసికల్ విభాగంలో ఆనంద్ 9 పాయింట్లు, బ్లిట్జ్ విభాగంలో 4.5 పాయింట్లు సాధించాడు. ఓవరాల్‌గా 13.5 పాయింట్లతో కంబైన్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని పొందాడు.
ఆనంద్‌తోపాటు నకముర (అమెరికా), నెపోమ్‌నియాచి (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్), గ్రిగరీ ఒపారిన్ (రష్యా), యానిక్ పెలిటిర్ (స్విట్జర్లాండ్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 15 పాయింట్లతో నకముర విజేతగా నిలువగా... 14 పాయింట్లతో నెపోమ్‌నియాచి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.