Superbet Rapid Chess: ఆధిక్యంలో ఆనంద్‌ | Superbet Rapid Chess: Indian GM Viswanathan Anand continues to lead the field | Sakshi
Sakshi News home page

Superbet Rapid Chess: ఆధిక్యంలో ఆనంద్‌

Published Sat, May 21 2022 6:26 AM | Last Updated on Sat, May 21 2022 6:27 AM

Superbet Rapid Chess: Indian GM Viswanathan Anand continues to lead the field - Sakshi

వార్సా (పోలాండ్‌): సూపర్‌బెట్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరు రౌండ్‌ల తర్వాత ఆనంద్‌ 12 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

శుక్రవారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్‌ రెండు విజయాలు (షెవ్‌చెంకో, లెవాన్‌ అరోనియన్‌), ఒక ‘డ్రా’ (జాన్‌ క్రిస్టాఫ్‌ డూడా) నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్‌ కేటాయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement