
వార్సా (పోలాండ్): సూపర్‌బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. శనివారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆనంద్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్ రాపోట్ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్ క్రిస్టాఫ్ (పోలాండ్) మూడో స్థానంలో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్ విభాగంలో టోర్నీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment