ఆనంద్ శుభారంభం | Anand started | Sakshi
Sakshi News home page

ఆనంద్ శుభారంభం

Published Fri, Mar 14 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

ఆనంద్ శుభారంభం

ఆనంద్ శుభారంభం


ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. గురువారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ 47 ఎత్తుల్లో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)పై విజయం సాధించాడు.

మొత్తం ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతాడు.

శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో వాసిలిన్ తొపలోవ్‌తో ఆనంద్ ఆడతాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement