‘డ్రా'నందం | The match was drawn between Anand and Carlsen | Sakshi
Sakshi News home page

‘డ్రా'నందం

Published Thu, Nov 13 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

‘డ్రా'నందం

‘డ్రా'నందం

సోచి (రష్యా): మూడో గేమ్‌లో విజయం అందించిన ఉత్సాహంతో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం.

శుక్రవారం ఐదో రౌండ్ గేమ్ జరుగుతుంది. మూడో గేమ్‌లో ఎదురైన ఓటమితో ఈసారి కార్ల్‌సన్ ఆచితూచి ఎత్తులతో స్పందించాడు. మరీ దూకుడుగా ఆడకుండా సంయమనంతో ఎత్తులు వేశాడు. కార్ల్‌సన్ ప్రతి ఎత్తుకు ఆనంద్ తగిన సమాధానమిస్తూ ముందుకుసాగాడు. ఈ గేమ్‌లో ఏదశలోనూ ఇద్దరికీ విజయావకాశాలు లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement