
ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ఆనంద్ 53 ఎత్తుల్లో మహిళల ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా)పై గెలిచాడు.
నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్, నకముర (అమెరికా) సంయుక్తంగా రెండో స్థానంలో నిలువగా... మెరుగైన ప్రోగ్రెస్సివ్ స్కోరు ఆధారంగా ఆనంద్‌కు రెండో స్థానం, నకమురకు మూడో స్థానం లభించాయి. 7.5 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.