న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఎలైట్ మాస్టర్స్ కేటగిరీలో పోటీపడుతున్న హారిక అమెరికా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ సో వెస్లీతో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. శనివారం జరిగిన తొలి రౌండ్‌లో హారిక 24 ఎత్తుల్లో ఫెర్నాండో రొకబాడో (అర్జెంటీనా)పై గెలిచింది.
పీటర్ లెకోను నిలువరించిన హర్ష
ఆంధ్రప్రదేశ్ మరో గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు తొలి రౌండ్‌లో 30 ఎత్తుల్లో గెరార్డ్ లోర్‌షెడ్ (జర్మనీ)పై విజయం సాధించగా... హైదరాబాద్ ప్లేయర్ హర్ష భరతకోటి (2363 ఎలో రేటింగ్) తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న హంగేరి గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 38వ ర్యాంకర్ పీటర్ లెకో (2709 ఎలో రేటింగ్)తో జరిగిన గేమ్‌ను హర్ష 37 ఎత్తుల్లో నిలువరించాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్ నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఆనంద్‌కు మూడో ‘డ్రా’
మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. ఎవ్‌గెనీ తొమషెవ్‌స్కీ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 3.5 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
హారిక రెండో గేమ్ ‘డ్రా’
Published Mon, Oct 3 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
Advertisement
Advertisement