chess tourny
-
మరింత బాగా ఆడాల్సింది: హరికృష్ణ
న్యూఢిల్లీ: మాస్కో గ్రాండ్‌ప్రి ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తాను మరింత బాగా ఆడాల్సిందని భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అభిప్రాయపడ్డాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య స్విస్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లతో సంయుక్తంగా పదో స్థానంలో నిలిచాడు. ‘ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. నేను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. బోరిస్ గెల్ఫాండ్ చేతిలో ఓడిపోకపోతే బాగుండేది. అయితే ఈ టోర్నీ నాకొక అనుభవం లాంటిది. రాబోయే రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో బాగా ఆడతాననే నమ్మకం ఉంది’ అని హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ తెలిపాడు. ఈ టోర్నీ ద్వారా హరికృష్ణ ఖాతాలో 30 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 5 వేల యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఉమ్మడిగా అగ్రస్థానంలో వరుణ్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో వి. వరుణ్ అగ్రస్థానంలో ఉన్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్ ఓపెన్ కేటగిరీలో 3 రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కె. తరుణ్, ఎల్. సతీశ్ కుమార్, పి.రవీందర్, నీరజ్ అనిరుధ్‌లు కూడా 3 పాయింట్లతో ఉన్నారు. జూనియర్ విభాగంలో ఏకంగా ఏడుగురు చిన్నారులు 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. జి.శివాని, అద్వైత శర్మ, రిత్విక్, మైత్రి, హిమేశ్, రఘురామ్ తలా 3 పాయింట్లు సాధించారు. శనివారం జూనియర్ విభాగంలో జరిగిన మూడోరౌండ్లో అద్వైత శర్మ (3)... చిద్విలాస్ సాయి (2)పై, రిత్విక్ (3)... ప్రణవ్ (2)పై, రఘురామ్ రెడ్డి (3)... బిల్వ నిలయ (2)పై, మైత్రి (3)... రోహిత్ (2)పై, హిమేశ్ (3)... రిషి (2)పై గెలుపొందారు. ఓపెన్ విభాగంలో మూడో రౌండ్ ఫలితాలు వరుణ్ (3)... ప్రణీత్ (2)పై, తరుణ్ (3)... త్రిష (2)పై, సతీశ్ (3)... రాజు (2)పై గెలిచారు. సాయికృష్ణ (2.5)తో జరిగిన గేమ్‌ను సురేశ్ (2.5)... ప్రతీక్ (2.5)తో జరిగిన గేమ్‌ను సుబ్బరాజు (2.5) డ్రాగా ముగించారు. -
అగ్రస్థానంలో ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ ఆకాశ్ అగ్రస్థానంలో ఉన్నాడు. నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్సలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిదిరౌండ్లు ముగిసే సరికి 8 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. హేమంత్‌రామ్ (తమిళనాడు), దాస్ (పశ్చిమ బెంగాల్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ క్రీడాకారుడు ఎ. అర్జున్ 6.5 పాయింట్లు సాధించాడు. శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ (6.5)... జీల్ షా (6)పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో విక్రమ్‌జీత్ (7)... వెంకట కృష్ణ కార్తీక్ (6)పై, ప్రణవనంద (7)... శివ పవన్ తేజ (6)పై, లోకేశ్ (7)... రిత్విక్ (6)పై, పి. శ్యామ్ నిఖిల్ (7)... నిఖిల్ (6)పై, శరవణ కృష్ణన్ (7)... వినోత్ కుమార్ (6.5)పై, ఆకాశ్ (8)... చంద్రప్రసాద్ (7)పై విజయం సాధించారు. హేమంత్ రామ్ (7.5)... దాస్ (7.5), ఆకాశ్(6.5)... కుషాగ్ర మోహన్ (6.5), చక్రవర్తి (6.5)... రామకృష్ణ (6.5)ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరోవైపు 1500లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఐదు రౌండ్లు ముగిసే సరికి ఐదు పాయింట్లతో శుభమ్ కుమార్, అష్ఫక్, అభిషేక్ పాటిల్, శ్రీకాంత్, దిలీప్, ప్రవీణ్, రవి, రూపేశ్ సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచారు. -
చెస్ టోర్నీకి హైదరాబాద్, రంగారెడ్డి జట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి తానా స్కాలర్షిప్ చెస్ టోర్నమెంట్‌కు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జట్లు అర్హత సాధించాయి. హైదరాబాద్‌లో జరిగిన సెలక్షన్ టోర్నమెంట్లో మెరుగ్గా రాణించిన బాలబాలికలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారు. హైదరాబాద్ జిల్లా జట్టు: బాలురు: అఖిల్ కుమార్, ఉమేశ్, చంద్రశేఖర్, రాజా, యాదగిరి. బాలికలు: మాధురి, నర్మద, ప్రియాంక, గాయత్రి, జోష్న. రంగారెడ్డి జిల్లా జట్టు: బాలురు: శివ, మేఘరాజ్, ప్రవీణ్, తుకారామ్, పవన్. బాలికలు: జ్యోతి, వెన్నెల, రజిత, తహసిన్ బేగం, శివాని. -
తెలుగు రాష్ట్రాల్లో ‘తానా’ చెస్ టోర్నీలు
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో రాష్ట్ర స్థాయి స్కాలర్ షిప్ చెస్ టోర్నీలు నిర్వహించనున్నట్లు ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని తెలిపారు. గురువారం సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఈ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జిల్లా పరిషత్ (జెడ్పీ) ఉన్నత పాఠశాల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంట్రీ ఉచితమన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులతో పాటు, ఉచితంగానే వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న విశ్లేషణ సామర్థ్యం వెలితీయటం, వ్యూహాత్మకంగా సమస్యలను అధిగమించే శక్తి, పోటీ తత్త్వం మెరుగుపరచడం, చదువుకు గాను స్కాలర్షిప్లు సాధించుకొనే శక్తి కల్గించాలనే సదుద్దేశంతో, సదాశయంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ముందుగా జరిగే ఈ టోర్నీలో ప్రతి జిల్లా నుంచి 8, 9, 10వ తరగతి విభాగాల నుంచి ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను పోటీల ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 18, 19వ తేదీల్లో విజయవాడలో... 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతాయని చెప్పారు. ప్రథమ విజేతకు రూ. 50 వేలు, ద్వితీయ విజేతకు రూ.30 వేలు ఉపకార వేతనాలు ఉంటాయన్నారు. ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర టోర్నీలో జిల్లా స్థాయిలోని బాలబాలికల విభాగం విజేతలకు రూ. 10 వేలు ఉపకార వేతనం అందజేస్తామన్నారు. డిసెంబర్ రెండో వారంలో అన్ని జిల్లాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అక్కడ గెలుపొందిన ఐదుగురు బాలికలు, బాలుర విజేతలకు రాష్ట్రస్థారుు పోటీలకు ఎంపిక, జిల్లా చెస్ సంఘాల ద్వారా జరుగుతుందన్నారు. వివరాలకు 9490000252 నెంబర్లో సంప్రదించాలి. మీడియా సమావేశంలో తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు, అసోసియేట్ మెంబర్ చిత్రకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
20 నుంచి చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: సీజర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. నాగోల్‌లోని ధర్మారెడ్డి గార్డెన్సలో 25వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీజర్ అకాడమీ డెరైక్టర్ విశ్వనాథ్, తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి ఆనం వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. -
హారిక రెండో గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఎలైట్ మాస్టర్స్ కేటగిరీలో పోటీపడుతున్న హారిక అమెరికా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ సో వెస్లీతో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 21 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో హారిక 24 ఎత్తుల్లో ఫెర్నాండో రొకబాడో (అర్జెంటీనా)పై గెలిచింది. పీటర్ లెకోను నిలువరించిన హర్ష ఆంధ్రప్రదేశ్ మరో గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు తొలి రౌండ్లో 30 ఎత్తుల్లో గెరార్డ్ లోర్షెడ్ (జర్మనీ)పై విజయం సాధించగా... హైదరాబాద్ ప్లేయర్ హర్ష భరతకోటి (2363 ఎలో రేటింగ్) తొలి రౌండ్లో సంచలన ప్రదర్శన చేశాడు. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న హంగేరి గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 38వ ర్యాంకర్ పీటర్ లెకో (2709 ఎలో రేటింగ్)తో జరిగిన గేమ్‌ను హర్ష 37 ఎత్తుల్లో నిలువరించాడు. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆనంద్‌కు మూడో ‘డ్రా’ మరోవైపు మాస్కోలో జరుగుతున్న తాల్ స్మారక అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. ఎవ్‌గెనీ తొమషెవ్స్కీ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 3.5 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
చెస్ విజేతలు ఆశిష్, సాహిత్య
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అండర్-15 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆశిష్ రెడ్డి, సాహిత్య విజేతలుగా నిలిచారు. దోమలగూడలోని ఏవీ కాలేజిలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగారుు. అలాగే బాలుర విభాగంలో ఆర్ఎస్ ఆర్మోల్ రెండో స్థానంలో, తరుణ్, అఖిల్ కుమార్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో సారుుప్రియ, జి.చందన రెండు, మూడు స్థానాలు సాధించారు. -
‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్ మహిళా కాలేజ్ విద్యార్థిని చొల్లేటి సహజశ్రీ రాణించింది. ఫుణే చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో సహజశ్రీ ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకుంది. మొత్తం తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో సహజశ్రీ 6.5 పాయింట్లను సాధించింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 24నుంచి 29 వరకు పుణేలో జరిగింది. -
3 నుంచి తెలంగాణ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది. అండర్-19 కేటగిరీలో ఖమ్మంలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ పోటీలు జరుగుతాయని టీఎస్‌సీఏ కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. ఇందులో టాప్-4 స్థానాల్లో నిలిచిన బాలబాలికలు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌కు అర్హత పొందుతారని ఆయన చెప్పారు. ఈ టోర్నీ నేపథ్యంలో గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయినర్సింహా రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సం ఘం (టీఎస్‌సీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, టోర్నీ మీడియా ఇన్చార్జి రమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు. -
అరోరా కాలేజ్ గెలుపు
ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్లో ఆరోరా డిగ్రీ కాలేజ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ, సెరుుంట్ మేరీస్ కాలేజ్‌లు విజయం సాధించారుు. ఆరోరా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన పురుషుల పోటీల్లో ఓయూ కాలేజ్ (4)... భద్రుక కాలేజ్‌పై, అరోరా డిగ్రీ కాలేజ్ (4)... ఓయూ కామర్స్ (2) కాలేజ్‌పై, సీబీఐటీ (4)... నిజాం కాలేజ్ (2)పై గెలుపొందారుు. ఎంజేసీఈటీ (3), ఎంవీఎస్ఆర్ (3) కాలేజ్‌ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం 36 కాలేజ్‌లు తలపడుతున్న ఈ టోర్నీని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ పి. వెంకట్ రెడ్డి, ఆరోరా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌స సెక్రటరీ రమేశ్, ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. -
అగ్రస్థానంలో సాహితి వర్షిణి
జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జలంధర్‌లో జరుగుతోన్న జాతీయ స్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి సాయి వర్షిణి అగ్రస్థానంలో నిలిచింది. పదో రౌండ్ ముగిసే సరికి 9 పాయింట్లతో సవితశ్రీతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన సాయి వర్షిత్ 7.5 పారుుంట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పదో రౌండ్ బాలికల మ్యాచ్‌ల్లో సాహితి వర్షిణి (9, ఏపీ)... పటేల్ రిధి (7, గుజరాత్)పై, సవితశ్రీ (6.5, తమిళనాడు)... హిమ ప్రియ (6.5, తమిళనాడు)పై, సేవిత విజు (5.5, తెలంగాణ)... ప్రకృతి (5.5, ఒడిశా)పై, కీర్తి (6, తెలంగాణ)... జప్లీన్ కౌర్ (5, పంజాబ్)పై, మైత్రి (5.5, తెలంగాణ)... రిచా (4.5, మహారాష్ట్ర)పై, జాహ్నవి (5.5, తెలంగాణ)... నందిక సాహు (అస్సాం)పై విజయం సాధించారు. కనిష్క (6, తమిళనాడు), మనుశ్రీ (6, తెలంగాణ)ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బాలుర విభాగంలో దేవ్ (8.5, మహారాష్ట్ర)... సాయి వర్షిత్ (7.5, తెలంగాణ)తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకోగా మిగతా మ్యాచ్‌ల్లో షాహిల్ (9, అస్సాం)... తన్మయ్ (7, పంజాబ్)పై, శ్రేయస్ (8, ఒడిశా)... ప్రణీత్(7, తెలంగాణ)పై గెలుపొందారు. -
రెండో స్థానంలో ప్రణీత్, సాయి వర్షిత్
సాక్షి, హైదరాబాద్: జలంధర్‌లో జరుగుతోన్న జాతీయ స్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ప్రణీత్, సాయి వర్షిత్ రాణిస్తున్నారు. తొమ్మిదో రౌండ్ గేమ్ ముగిసేసరికి వీరిద్దరూ 7 పాయింట్లు సాధించి మరో ముగ్గురితో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాహితి వర్షిణి 8 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాయి వర్షిత్ (7, తెలంగాణ)... ముల్లిక్ రాహిల్ (6, మహారాష్ట్ర)పై, విశ్వక్సేన్ (6, తెలంగాణ)... సుమీర్ (5, తెలంగాణ)పై, రిత్విక్ (4, తెలంగాణ)... కృష్ణ కుమార్ (4, జార్ఖండ్)పై గెలుపొందారు. ఇలంపర్తి (7, తమిళనాడు), ప్రణీత్ (7, తెలంగాణ)... సర్వేశ్ (5.5, తమిళనాడు), శ్రీకర్ (5.5, తెలంగాణ)... ప్రణయ్ (5.5, తెలంగాణ), శ్రేయస్ (5.5, కేరళ)ల మధ్య జరిగిన మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. బాలికల విభాగంలో సాహితివర్షిణి (ఏపీ)... హర్షవర్ధిని (6, పాండిచ్చేరి)పై గెలిచింది. చెస్ టోర్నీ విజేత వర్షిత్ వన్గోల్ చెస్ అకాడమీ ఇన్విటేషన్ టోర్నమెంట్లో వర్షిత్ రెడ్డి సత్తా చాటాడు. మణికొండలోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్-14 విభాగంలో వర్షిత్ (ఇంటిగ్రల్ స్కూల్) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు అండర్-11 విభాగంలో జైన్ హెరిటేజ్ స్కూల్‌కు చెందిన ఆర్. సిధేశ్, అండర్-9 విభాగంలో సంఘమిత్ర స్కూల్‌కు చెందిన కృష్ణ కౌశిక్, అండర్-8 విభాగంలో జైన్ హెరిటేజ్ స్కూల్‌కు చెందిన ఆర్. సర్వేశ్, అండర్-7 విభాగంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీకి చెందిన అభినవ్ కృష్ణ విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ ైడె రెక్టర్ గణేశ్ విజేతలకు ట్రోఫీలను అందించారు. -
చెస్ చాంపియన్ దీక్షిత
సాక్షి, హైదరాబాద్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నమెంట్లో దీక్షిత విజేతగా నిలిచింది. కుషాయిగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం జరిగిన టోర్నమెంట్లో అండర్-17 బాలికల విభాగంలో దీక్షిత (రవీంద్ర భారతి) 5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. బాలుర విభాగంలో జయంత్ (6, డీఏవీ), ప్రతీక్ (5.5, డీఏవీ), రోహిత్ (5, టీవీఆర్ మోడల్)లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండ ర్ -14 బాలికల విభాగంలో నందిత (5) మొదటి స్థానంలో నిలవగా... చేతన (5, సెయింట్ ఆండ్రూస్), మాధురి (4, డీఏవీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. -
అగ్రస్థానంలో ఓజస్, అర్జున్
బ్రిలియంట్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో మూడో రౌండ్ ముగిసే సరికి జూనియర్ కేటగిరీలో ఓజస్, అర్జున్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరితో పా టు అద్వైత్ శర్మ, ఉమేశ్, సిద్ధార్థ్ కూడా అగ్రస్థానంలో ఉన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలి యంట్ స్కూల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం ఓజస్ (3) ... విఘ్నేశ్ (2)పై, అర్జు న్ (3)... శ్రీనందన్ (2)పై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో హిమసూర్య (2)... ఉమేశ్ (3) చేతిలో ఓడిపోగా, సిద్ధార్థ్ (3)... కమల్ (2)పై, అద్వైత్ శర్మ (3)... సౌరిశ్ రావు (2)పై విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీ మూడో రౌండ్ ఫలితాలు రాజు (3... స్పందన్ (2)పై, ఖాన్ (3)... శ్రీక ర్ (2)పై, ప్రణీత్ (2.5)... కశ్యప్ (1.5)పై, అనిల్ కుమార్ (2.5)... శరత్ చంద్ర (1.5)పై గెలుపొందారు. నిఖిల్ (2.5)... సుబ్బరాజు (2.5), విశ్వంత్ (2.5)... ఆశిష్ రెడ్డి (2.5)ల మధ్య మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. -
13 నుంచి చెస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. జూనియర్, అండర్-6, 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలుంటాయి. ఆసక్తి గలవారు 13వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు జె. సుబ్రహ్మణ్యం (92473 99717)ను సంప్రదించవచ్చు.