సాక్షి, హైదరాబాద్: జలంధర్‌లో జరుగుతోన్న జాతీయ స్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు ప్రణీత్, సాయి వర్షిత్ రాణిస్తున్నారు. తొమ్మిదో రౌండ్ గేమ్ ముగిసేసరికి వీరిద్దరూ 7 పాయింట్లు సాధించి మరో ముగ్గురితో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాహితి వర్షిణి 8 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాయి వర్షిత్ (7, తెలంగాణ)... ముల్లిక్ రాహిల్ (6, మహారాష్ట్ర)పై, విశ్వక్సేన్ (6, తెలంగాణ)... సుమీర్ (5, తెలంగాణ)పై, రిత్విక్ (4, తెలంగాణ)... కృష్ణ కుమార్ (4, జార్ఖండ్)పై గెలుపొందారు. ఇలంపర్తి (7, తమిళనాడు), ప్రణీత్ (7, తెలంగాణ)... సర్వేశ్ (5.5, తమిళనాడు), శ్రీకర్ (5.5, తెలంగాణ)... ప్రణయ్ (5.5, తెలంగాణ), శ్రేయస్ (5.5, కేరళ)ల మధ్య జరిగిన మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. బాలికల విభాగంలో సాహితివర్షిణి (ఏపీ)... హర్షవర్ధిని (6, పాండిచ్చేరి)పై గెలిచింది.
చెస్ టోర్నీ విజేత వర్షిత్
వన్‌గోల్ చెస్ అకాడమీ ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో వర్షిత్ రెడ్డి సత్తా చాటాడు. మణికొండలోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్-14 విభాగంలో వర్షిత్ (ఇంటిగ్రల్ స్కూల్) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు అండర్-11 విభాగంలో జైన్ హెరిటేజ్ స్కూల్‌కు చెందిన ఆర్. సిధేశ్, అండర్-9 విభాగంలో సంఘమిత్ర స్కూల్‌కు చెందిన కృష్ణ కౌశిక్, అండర్-8 విభాగంలో జైన్ హెరిటేజ్ స్కూల్‌కు చెందిన ఆర్. సర్వేశ్, అండర్-7 విభాగంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీకి చెందిన అభినవ్ కృష్ణ విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ ైడె రెక్టర్ గణేశ్ విజేతలకు ట్రోఫీలను అందించారు.