సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ ఆకాశ్ అగ్రస్థానంలో ఉన్నాడు. నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్‌సలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిదిరౌండ్లు ముగిసే సరికి 8 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. హేమంత్‌రామ్ (తమిళనాడు), దాస్ (పశ్చిమ బెంగాల్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ క్రీడాకారుడు ఎ. అర్జున్ 6.5 పాయింట్లు సాధించాడు.
శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ (6.5)... జీల్ షా (6)పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో విక్రమ్‌జీత్ (7)... వెంకట కృష్ణ కార్తీక్ (6)పై, ప్రణవనంద (7)... శివ పవన్ తేజ (6)పై, లోకేశ్ (7)... రిత్విక్ (6)పై, పి. శ్యామ్ నిఖిల్ (7)... నిఖిల్ (6)పై, శరవణ కృష్ణన్ (7)... వినోత్ కుమార్ (6.5)పై, ఆకాశ్ (8)... చంద్రప్రసాద్ (7)పై విజయం సాధించారు. హేమంత్ రామ్ (7.5)... దాస్ (7.5), ఆకాశ్(6.5)... కుషాగ్ర మోహన్ (6.5), చక్రవర్తి (6.5)... రామకృష్ణ (6.5)ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరోవైపు 1500లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ఐదు రౌండ్లు ముగిసే సరికి ఐదు పాయింట్లతో శుభమ్ కుమార్, అష్ఫక్, అభిషేక్ పాటిల్, శ్రీకాంత్, దిలీప్, ప్రవీణ్, రవి, రూపేశ్ సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచారు.