మరింత బాగా ఆడాల్సింది: హరికృష్ణ | I should have played more well | Sakshi
Sakshi News home page

మరింత బాగా ఆడాల్సింది: హరికృష్ణ

Published Tue, May 23 2017 10:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM

I should have played more well

న్యూఢిల్లీ: మాస్కో గ్రాండ్‌ప్రి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తాను మరింత బాగా ఆడాల్సిందని భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ అభిప్రాయపడ్డాడు. 18 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య స్విస్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లతో సంయుక్తంగా పదో స్థానంలో నిలిచాడు.

 

‘ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. నేను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. బోరిస్‌ గెల్ఫాండ్‌ చేతిలో ఓడిపోకపోతే బాగుండేది. అయితే ఈ టోర్నీ నాకొక అనుభవం లాంటిది. రాబోయే రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో బాగా ఆడతాననే నమ్మకం ఉంది’ అని హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ తెలిపాడు. ఈ టోర్నీ ద్వారా హరికృష్ణ ఖాతాలో 30 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 5 వేల యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement