తాల్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ విజేత ఆనంద్‌ | Viswanathan Anand wins Rapid event at Tal Memorial | Sakshi
Sakshi News home page

తాల్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ విజేత ఆనంద్‌

Published Mon, Mar 5 2018 5:00 AM | Last Updated on Mon, Mar 5 2018 5:00 AM

Viswanathan Anand wins Rapid event at Tal Memorial - Sakshi

విశ్వనాథన్‌ ఆనంద్‌

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్‌ స్మారక టోర్నమెంట్‌లో 48 ఏళ్ల ఆనంద్‌ ర్యాపిడ్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్‌ తొమ్మిది రౌండ్‌లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్‌ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement