Tal Memorial international chess tournament
-
తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయి0ట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)తో జరిగిన మూడో రౌండ్లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయి0ది. -
ఆనంద్‌కు రెండో విజయం
మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)తో శనివారం జరిగిన ఐదో రౌండ్లో ఆనంద్ 58 ఎత్తుల్లో గెలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో ఆనంద్ 41 ఎత్తుల్లో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.