ఆనంద్‌కు నిరాశ
మాస్కో: పదేళ్లలో తొలిసారి భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లేకుండా పు రుషుల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుం ది. సోమవారం ముగిసిన క్యాండిడేట్స్ ఓపెన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ 7.5 పాయింట్లతో కరువానా (అమెరికా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఈ టోర్నీలో సెర్గీ కర్జాకిన్ (రష్యా) 8.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఏడాది నవంబరు 11 నుంచి 30వ తేదీ వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ప్రస్తుత విజేత మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో పోరుకు కర్జాకిన్ సిద్ధమయ్యాడు. చివరిదైన 14వ రౌండ్‌లో స్విద్లెర్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మరోవైపు కరువానాపై కర్జాకిన్ 42 ఎత్తుల్లో గెలిచి విజేతగా అవతరించాడు.