Chess World Championship
-
నా కల నిజమైంది: గుకేశ్
‘లిరెన్ 55వ ఎత్తు తర్వాత నేను ఏం వేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడమే తరువాయి. అయితే ఒక్కసారిగా అతని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దానిని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది. ఆరేళ్ల వయసులో చెస్ మొదలు పెట్టాను. గత పదేళ్లుగా ఇదే కల నన్ను నడిపించింది. ప్రతీ ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్, కార్ల్సన్ మధ్య పోరును చెన్నైలోని ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు. దాంతో గాజు తెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండా పక్కన పెట్టుకొని పోటీ పడటం గర్వంగా అనిపించింది. కార్ల్సన్ టైటిల్ సాధించిన సమయంలో దానిని మళ్లీ భారత్‌కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా. అధికారికంగా నా టీమ్‌లో ఆనంద్ సర్ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. గత ఏడాది నేను క్యాండిడేట్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్ గెలవగానే అమ్మకు ఫోన్ చేశాను. ఇద్దరమూ ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చెస్‌ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్‌ల వరకు కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్ సూచనలు నన్ను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాతి రెండు గేమ్‌లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు. కార్ల్సన్ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకూ ఉంది. చెస్‌లో అదే అత్యంత పెద్ద సవాల్. అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది. అతడిని స్ఫూర్తిగా తీసుకొనే అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నా’ అని విజయనంతరం మీడియా సమావేశంలో గుకేశ్ పేర్కొన్నాడు -
గుకేశ్... శభాష్...
న్యూఢిల్లీ: పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు పలువురు గుకేశ్ విజయాన్ని కొనియాడారు. అతిపిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్‌లో భారత్ కూడా ప్రచండ శక్తి అని నీ విజయం చాటింది. భారతీయులందరి తరఫున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి. –రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఅభినందనలు గుకేశ్. కెరీర్ తొలినాళ్లలోనే సంచలన విజయం సాధించావు. ఆటలో నీ ప్రతిభ, చేసిన కఠోర కృషి, కనబరిచిన అంకితభావం అసాధారణం. ఈ విజయం భారత చెస్ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడమే కాదు... కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షల మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరెన్నో ఘనతలు, ఘనవిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. –ప్రధాని నరేంద్ర మోదీప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్‌కు శుభాభినందనలు. నీవు సాధించిన టైటిల్ చెస్కే గర్వకారణం. భారత్ ఉప్పొంగిపోయే విజయం నీది. వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా) గరి్వంచే క్షణాలివి. మాజీ చాంపియన్ అయిన నాకూ ప్రత్యేక క్షణాలను మిగిల్చావు. ప్రతి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మెరుగ్గా ఆడినా... నీవు ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం. –విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ మాజీ చాంపియన్ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించిన గుకేశ్‌కు కంగ్రాట్స్. ఒత్తిడిని జయించిన తీరు... ప్రతీ రౌండ్లోనూ కనబరిచిన నీ ఆటతీరుకు హ్యాట్సాఫ్! నీ దృఢ సంకల్పంతో యావత్ దేశాన్ని గర్వించేలా చేశావ్. నీవు సాధించింది ఓ టైటిల్ మాత్రమే కాదు... యువతరం ప్రేరణ పొందే విజయగాథ నీది. ఇంకెన్నో విజయాలు, మరెన్నో సాఫల్యాలు నీ ముందుంటాయి. –బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ‘గుకేశ్... 64 గడుల్లో హద్దులెరుగని అవకాశాల్ని సృష్టించావు. ఆనంద్ అడుగు జాడల్లో భారత కొత్త చెస్ కెరటంగా అవతరించావు. –సచిన్ టెండూల్కర్మా ఆటలో మరో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. గుకేశ్... కంగ్రాట్స్. –ప్రపంచ చెస్ సమాఖ్య -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్‌ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత!
బకూ (అజర్బైజాన్): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద 3.5–2.5తో గెలుపొందాడు. ఫైనల్ చేరడంద్వారా ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్‌లు ముగిశాక ప్రజ్ఞానంద, కరువానా 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో గెలిచాడు. ఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో కరువానా ‘డ్రా’ చేసుకోవడంతో ప్రజ్ఞానంద విజయం ఖరారైంది. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ప్రజ్ఞానంద ఫైనల్లో తలపడతాడు. రెండు క్లాసికల్ గేమ్‌లలో భాగంగా వీరిద్దరి మధ్య తొలి గేమ్ నేడు జరుగుతుంది. చదవండి: Asia Cup 2023: రాహుల్, శ్రేయస్ పునరాగమనం -
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
ఆనంద్‌కు నిరాశ
మాస్కో: పదేళ్లలో తొలిసారి భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లేకుండా పు రుషుల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుం ది. సోమవారం ముగిసిన క్యాండిడేట్స్ ఓపెన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ 7.5 పాయింట్లతో కరువానా (అమెరికా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో సెర్గీ కర్జాకిన్ (రష్యా) 8.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఏడాది నవంబరు 11 నుంచి 30వ తేదీ వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ప్రస్తుత విజేత మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో పోరుకు కర్జాకిన్ సిద్ధమయ్యాడు. చివరిదైన 14వ రౌండ్లో స్విద్లెర్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మరోవైపు కరువానాపై కర్జాకిన్ 42 ఎత్తుల్లో గెలిచి విజేతగా అవతరించాడు.