పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్‌సన్‌ | Chess World Cup 2023 Final: World No 1 Magnus Carlsen Beats Praggnanandhaa In Tie-Break - Sakshi
Sakshi News home page

FIDE Chess World Cup 2023 Final: పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. వరల్డ్‌ కప్‌ విజేతగా కార్ల్‌సన్‌

Published Thu, Aug 24 2023 5:25 PM | Last Updated on Thu, Aug 24 2023 6:02 PM

Chess World Cup 2023 Final: World No 1 Magnus Carlsen Beat Praggnanandhaa Tie Breaks - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ఫైవ్‌ టైమ్‌ వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) తన తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్‌ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్‌లో కార్ల్‌సన్‌ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు.

హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్‌ కోల్పోగా.. రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్‌సన్‌ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్‌ల్లో కార్ల్‌సన్‌, ప్రజ్ఞానంద తలో గేమ్‌ గెలవడంతో టైబ్రేక్స్‌ ద్వారా‌ విజేతను నిర్ణయించాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement